వెంగల్ చక్కరాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంగల్ చక్కరాయ్
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
In office
1949–1957
అంతకు ముందు వారుశ్రీపాద్ అమృత్ డాంగే
తరువాత వారుఎస్ఎస్ మీరాజ్కర్
వ్యక్తిగత వివరాలు
జననం
వెంగల్ చక్కరాయ్ చెట్టియార్

(1880-01-17)1880 జనవరి 17
మరణం1958 జూన్ 14(1958-06-14) (వయసు 78)
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.

వెంగల్ చక్కరాయ్ చెట్టియార్ ( 1880 జనవరి 17 - 1958 జూన్ 14) తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, ట్రేడ్ యూనియన్ కార్యకర్త.[1] ఎఐటియుసి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

తొలి జీవితం[మార్చు]

చక్కరాయ్ 1880, జనవరి 17న హిందూ చెట్టియార్ కుటుంబంలో జన్మించాడు. మద్రాస్ లోని స్కాటిష్ మిషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యను, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో మాధ్యమిక విద్యను పూర్తిచేశాడు. 1901లో తత్వశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత మద్రాస్ లా కాలేజీలో న్యాయవిద్యను చదివి, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.

వృత్తిజీవితం - ఉద్యమం[మార్చు]

డానిష్ మిషన్ రూమ్‌లో 1913లో చక్కరాయ్ క్రైస్తవ బోధకునిగా చేరి, అందులో ఇరవై సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు. మహాత్మాగాంధీ శిష్యుడిగా చేరి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.[2] 1941 నుండి 1942 వరకు మద్రాస్ మేయర్‌గా పనిచేశాడు. అతను 1954 నుండి 1957 వరకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.

మరణం[మార్చు]

వెంగల్ చక్కరాయ్ 1958, జూన్ 14న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Chakkarai, Vengal (1981). Vengal Chakkarai: a selection. Library of Indian Christian theology. Christian Literature Soc.
  2. Burbank, Ray. "Vengal Chakkarai: Indian Freedom Fighter and Christian Theologian" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-09-07. Retrieved 2021-09-07. {{cite journal}}: Cite journal requires |journal= (help)
అంతకు ముందువారు
జి. జానకిరామ్ చెట్టి
చెన్నై నగర మేయర్లు
1941-1942
తరువాత వారు
సి. తడులింగ ముదలియార్