వెట్రి (సినిమాటోగ్రాఫర్)
| వెట్రి | |
|---|---|
| జననం | వెట్రివేల్ పళనిస్వామి పల్లడం, తిరుపూర్, తమిళనాడు, భారతదేశం |
| ఇతర పేర్లు | వెట్రి వెట్రి పళనిసామి |
| విశ్వవిద్యాలయాలు | తమిళనాడు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ |
| వృత్తి | ఫోటోగ్రఫీ డైరెక్టర్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2007-ప్రస్తుతం |
| తల్లిదండ్రులు | ఎన్. ఎస్. పళనిసామి (తండ్రి) |
వెట్రివేల్ పళనిస్వామి ప్రధానంగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేసే భారతీయ సినిమాటోగ్రాఫర్. ఆయన చెన్నైలోని ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పూర్వ విద్యార్థి.[1] ఆయన శౌర్యం, ముని 2: కాంచన, వీరం, వేదలమ్, విశ్వాసం, అన్నాత్తే వంటి చిత్రాలలో చేసిన పనికి ప్రసిద్ధి చెందాడు. అన్నాత్తే చిత్రం తెలుగులొ పెద్దన్నగా 2021లో వచ్చింది.
కెరీర్
[మార్చు]వెట్రి తమిళనాడు తిరుప్పూర్ జిల్లాకు చెందినవాడు. సినిమాటోగ్రఫీ ఫిల్మ్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసిన తరువాత ఆయనరి ఆహ..!, ఆటో డ్రైవర్, సంగమం, ఒరువన్, వల్లరసు, మాయ వంటి చిత్రాలలో సినిమాటోగ్రాఫర్ ఎస్. శరవణన్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. వెట్రి అగరం చిత్రంలో సినిమాటోగ్రాఫర్ గా అరంగేట్రం చేశాడు, ఆపై అతను యాక్షన్ డ్రామా చిత్రం తెనవట్టు (2008)తో గుర్తింపు పొందాడు. ఆ తరువాత కామెడీ మాసిలామణి (2009), విజయవంతమైన భయానక చిత్రం ముని 2: కాంచన (2011)లో రాఘవ లారెన్స్ కలిసి ఆయన పనిచేశాడు.[1]
వెట్రి తరచుగా దర్శకుడు శివతో కలిసి పనిచేసాడు. అతని తెలుగు చిత్రాలలో సౌర్యం (2008), శంఖం (2009), దరువు (2012) వంటివి ఉన్నాయి. అజిత్ కుమార్ తో తమిళ చిత్రాలలో భాగంగా వీరం (2014), వేదాలం (2015), వివేగం (2017), విశ్వాసం (2019) వంటి వాటికి పనిచేసాడు.[2] ఈ జంట ఎంజీఆర్ ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కలిసి చదువుకున్నారు.[1]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | సినిమా | భాష | గమనిక |
|---|---|---|---|
| 2007 | అగరం | తమిళం | అరంగేట్రం |
| రామేశ్వరం | |||
| 2008 | తేనవట్టు | ||
| శౌర్యం | తెలుగు | తెలుగులో అరంగేట్రం | |
| 2009 | మాశిలామణి | తమిళం | |
| శంఖం | తెలుగు | ||
| 2011 | వెంగై | తమిళం | |
| ముని 2: కాంచన | తమిళం | ||
| వెల్లూరు మావట్టం | తమిళం | ||
| 2012 | దరువు | తెలుగు | |
| 2013 | యా యా | తమిళం | |
| 2014 | వీరం | [3] | |
| లౌక్యం | తెలుగు | ||
| 2015 | వేదాళం | తమిళం | [3] |
| 2017 | వివేగం | ||
| ఆక్సిజన్ | తెలుగు | ||
| 2019 | విశ్వాసం | తమిళం | |
| కాంచన 3 | తమిళం | ||
| చాణక్య | తెలుగు | ||
| 2020 | లక్ష్మి | హిందీ | హిందీలో అరంగేట్రం |
| 2021 | అన్నాత్తే | తమిళం | |
| 2023 | రామబాణం | తెలుగు | |
| 2024 | కంగువ | తమిళం | [4] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Nathan, Archana (2017-07-23). "Ajith is an even bigger star off-screen, says 'Vivegam' cinematographer Vetri Palanisamy". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-23.
- ↑ S. R. ASHOK KUMAR. "Showbitz". The Hindu.
- ↑ 3.0 3.1 Nathan, Archana (2017-07-23). "Ajith is an even bigger star off-screen, says 'Vivegam' cinematographer Vetri Palanisamy". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-07-23.
- ↑ Rajaraman, Kaushik (2023-07-22). "DT Next Exclusive: Kanguva is sheer happiness, says director Siva". www.dtnext.in (in ఇంగ్లీష్). Retrieved 2023-07-23.