వెదురుపాక సావరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెదురుపాక సావరం
—  రెవిన్యూ గ్రామం  —
వెదురుపాక సావరం is located in Andhra Pradesh
వెదురుపాక సావరం
వెదురుపాక సావరం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°53′47″N 82°00′09″E / 16.8963°N 82.0024°E / 16.8963; 82.0024
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం రాయవరం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 533 346
ఎస్.టి.డి కోడ్

వెదురుపాక సావరం, తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 533 346.

ఈ ఊరి పేరు వెదురుపాక సావరం. పూర్వం ఇది వెదురుపాక గ్రామానికి శివారుగా ఉండేది. (అప్పటి పాత పేరు "వెదురుపాక శివారు సావరం) తర్వాత ఇది కూడా ఒక గ్రామ పంచాయితీగా ఏర్పడింది. దీనికి తూర్పున కొంకుదురు గ్రామం, పడమర రాయవరం గ్రామం, కొమరిపాలెం గ్రామం, దక్షిణమున తుల్యభాగ కాలువ (దీనినే మురుక్కాలువ అంటారు), ఉత్తరమున పందలపాక, తొస్సిపూడి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ముక్కొటీ ఏకాదశి 17 డీసెంబర్ 2010 రోజున శుక్రవారము జరిగింది..ఊరి ఛివరన కొత్తగా శ్రీ వెంకటెశ్వరా ఆలయం నిర్మిమించారు.ఈ ఆలయంలో కొనేరు ఉంది.ప్రతి శనివరాము భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.ఈ గ్రామానికి ఆదర్సగ్రామం అని పేరు ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గతంలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాల ప్రస్తుతము ప్రాథమికోన్నత పాఠశాలగా అభివృద్ధి చెంది 1 నుండి 7వ తరగతుల వరకు బోధించుచున్నారు. గతంలో అయితే దారిగట్టున రాయవరం లోని శ్రీరామయ్యా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నడచి వెళ్ళేవారు. ప్రస్తుతం చుట్టు ప్రక్కల ఉన్న అన్ని గ్రామాలలోనూ ఉన్నత పాఠశాలలు స్థాపించబడ్డాయి. వెదురుపాక, పందలపాకలలో కూడా ఉన్నత పాఠశాలలు ఏర్పడినందున విద్యార్థులు తమకు అనువుగా ఉన్న గ్రామం వెళ్ళి చదువుతున్నారు. అలాగే రాయవరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజి ఏర్పడింది.

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వెదురుపకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

ఈ ఊరిలో పంటపొలాలలో గతంలో అయితే అన్ని రకాల పంటలూ పండించేవారు అనగా వరి, చెరకు, కూరగాయలు, కందులు మెదలగునవి. కొంతకాలానికి చెరకు పంటకు చీడపీడలు ఎక్కువయి రైతులకు నష్టాలు రావడంతో చెరకు పంటవేయడం మెత్తం మానివేసారు. గత 20 - 25 సంవత్సరాలుగా వరి పంటనే పండిస్తున్నారు. ఈ ఊరికి నీరు ధవళేశ్వరం గోదావరి నది నుండి వస్తుంది. అక్కడనుండి వచ్చిన నీరు తొస్సిపూడి లాకుల వద్ద నుండి రెండు కాలువలుగా వెదురుపాక సావరం గ్రామంలోని పొలాలకు వస్తుంది. ఒక కాలువను అక్కిరేవు కాలువ అంటారు, రెండవ కాలువను లంక కాలువ అంటారు. ఎక్కువమంది వ్యవసాయ పనుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు.

ఊరిలో ఇటుక బట్టీలు ఎక్కువ. ఇక్కడ తయారయిన ఇటుకలు చుట్టు ప్రక్కల గ్రామాలకే కాకుండా, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాదు మొదలగు పట్టణాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.

పాడిపశువులు: ప్రస్తుతం పాడిపశువులు సంఖ్య బాగా తగ్గిపోయింది.

  • కాలువలు: 1217 హెక్టార్లు

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-07.