వెన్నెరాడై నిర్మల
(వెన్నిరాడై నిర్మల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
వెన్నెరాడై నిర్మల | |
---|---|
![]() 2007లో మాతృదినోత్సవ సందర్భంగా ఒక ఇంటర్యూలో వెన్నెరాడై నిర్మల | |
జననం | ఏ.బి.శాంతి కుంబకోణం, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 1965–ప్రస్తుతం |
వెన్నెరాడై నిర్మల తమిళ సినిమా నటి. నిర్మల దక్షిణ భారత భాషలన్నింటా 100కు పైగా సినిమాలలో నటించింది.[1] శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నెరాడై సినిమాతో రంగప్రవేశం చేయడంతో ఈమె పేరు వెన్నిరాడై నిర్మలగా స్థిరపడిపోయింది. 2007లో చాలాకాలం తర్వాత సినీరంగంలో మరల ప్రవేశించి గుణశేఖరన్ దర్శకత్వంలో వస్తున్న పెరియార్ సినిమాలోనూ, జీవా, భావన నటించిన రామేశ్వరం సినిమాలోనూ ముఖ్యప్రాత్రలు పోషిస్తున్నది. తన మొదటి సినిమాలో తనతో పాటు తెరపై పరిచయమైన జయలలితపై 1989 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, నిర్మల అండిపట్టి నియోజకవర్గం నుండి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె (జానకి) వర్గపు అభ్యర్థిగా పోటిచేయటం విశేషం.[2]
నిర్మల నటీమణే కాకుండా, శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా.[3][4]
నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]
సంవత్సరము | చిత్రము | పాత్ర | దర్షకత్వం | తారాగణం |
---|---|---|---|---|
1971 | బొమ్మా బొరుసా | కె. బాలచందర్ | చంద్రమోహన్, రామకృష్ణ | |
1971 | బంగారు తల్లి | తాపీ చాణక్య | శోభన్ బాబు | |
1972 | కత్తుల రత్తయ్య | కె.ఎస్.ఆర్.దాస్ | కృష్ణ | |
1972 | దత్తపుత్రుడు | అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ | ||
1972 | భలే మోసగాడు | టి.లెనిన్ బాబు | కృష్ణ | |
1972 | మాయింటి వెలుగు | విజయ్ | కృష్ణ | |
1972 | సోమరిపోతు | వి.రామచంద్రరావు | చలం | |
1973 | ధనమా దైవమా | సి.ఎస్.రావు | నందమూరి తారక రామారావు, జమున, చంద్రమోహన్ | |
1973 | వారసురాలు | బి.హరి నారాయణ | రామకృష్ణ | |
1974 | నిజరూపాలు | కె.వి.నందనరావు | రామకృష్ణ | |
1974 | మాంగల్య భాగ్యం | పద్మనాభం | భానుమతి, జగ్గయ్య, జయంతి, చంద్రమోహన్ | |
1974 | స్త్రీ గౌరవం | ఎస్.ఎస్.దేవదాస్ | క్రష్ణంరాజు, దేవిక | |
1976 | దేవుడే గెలిచాడు | విజయనిర్మల | క్రష్ణ, విజయనిర్మల | |
1978 | కరుణామయుడు | ఎ.భీంసింగ్ | టి.యస్.విజయచందర్ | |
1980 | కాళి | ఐ.వి. శశి | రజనీకాంత్, చిరంజీవి | |
1980 | చుక్కల్లో చంద్రుడు | సి.ఎస్. రావు | చంద్రమోహన్, కాంతారావు | |
సీమసింహం | ||||
గాలిపటాలు | ||||
1997 | అరుణాచలం | |||
2004 | శంకర్‌దాదా ఎంబీబీఎస్ |
మూలాలు[మార్చు]
- ↑ Back with a brim - Venniradai Nirmala - ఇండియా గ్లిట్జ్ ఏప్రిల్ 20, 2007
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-22. Retrieved 2008-11-29.
- ↑ Randor Guy (2008-10-31). "Trend-setter". The Hindu. Retrieved 2013-02-20.
- ↑ M. Balaganessin (2007-04-03). "She wants novel role". The Hindu. Retrieved 2013-02-20.