వెన్నునొప్పి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెన్నునొప్పి
వెన్నెముకలోని వేర్వేరు భాగాలు
ప్రత్యేకతఎముకల శాస్త్రం

వెన్నునొప్పి, అనేది వీపు వెనుకభాగంలో వచ్చే నొప్పి. ఇది సాధారణంగా కండరాల నుండికానీ, నరాల నుండికానీ, ఎముకల నుండికానీ, కీళ్ళ నుండికానీ, వెన్నుపాములోని ఇతర భాగాల నుండికానీ పుడుతుంది. ఈ నొప్పి మెడనొప్పి, వెన్ను పైభాగపు నొప్పి, వెన్ను దిగువభాగపు నొప్పి, హలాస్థి నొప్పిగా విభజించబడింది. ఈ నొప్పిలో కటి ప్రాంతం ఎక్కువగా ప్రభావితమవుతుంది.[1] వెన్నునొప్పి స్వల్ఫకాలికంగా, దీర్ఘకాలికంగా.. ఒకే చోటకానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండవచ్చు. చేతులు, కాళ్ళు, అడుగులు[2] తిమ్మిరి కలిగి ఉండవచ్చు, బలహీనంగా మారవచ్చు.

వెన్నునొప్పిలో ఎక్కువభాగం గుర్తించదగిన కారణాలు లేవు. అనేక రకాల వైద్య సమస్యలకు ఇది ఒక లక్షణంగా భావించాలి. కీళ్ళు బలహీనపడి, కండరాలు, నరాలలో నొప్పిని కలిగిస్తాయి. పిత్తాశయం, క్లోమం, బృహద్ధమని, మూత్రపిండాల వ్యాధి, వాపు కూడా వెనుకభాగంలోని నొప్పికి కారణం కావచ్చు.

వెన్నునొప్పి మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. పెద్దవాళ్ళలో ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ వెన్నునొప్పి వస్తుంది. ప్రతి పదిమంది శ్రామికులలో ఐదు మందికి, ప్రతి సంవత్సరమూ వెన్నునొప్పి కనపడుతుంటుంది.[3] 95% మంది ప్రజలు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో వెన్నునొప్పిని అనుభవిస్తారని అంచనా వేయబడింది.[1] ఇది దీర్ఘకాలిక నొప్పిగా, వైకల్యానికి ప్రధాన కారణంగా మారవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా శస్త్రచికిత్సలు చేయడం వంటివి ఈ వెన్నునొప్పికి పరిష్కార మార్గాలు.

వర్గీకరణ

[మార్చు]

నొప్పి భాగాన్ని బట్టి

 1. వెన్ను నొప్పి (గర్భాశయ)
 2. మధ్య వెనుక నొప్పి (థొరాసిక్)
 3. దిగువ వెన్నునొప్పి (కటి)
 4. కోకిసిడెనియా (టెయిల్బోన్ లేదా త్రికోణ నొప్పి)

లక్షణాలు, నొప్పికాలాన్ని బట్టి

 1. తీవ్రమైన వెన్నునొప్పి: 6 వారాలు ఉంటుంది.
 2. సబాక్యుట్ వెన్నునొప్పి: 6 నుండి 12 వారాల మధ్య ఉంటుంది.
 3. దీర్ఘకాలిక వెన్నునొప్పి: 12 వారాల కన్నా ఎక్కువ ఉంటుంది.

కారణాలు

[మార్చు]

వెన్నునొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో రక్త నాళాలు, అంతర్గత అవయవాలు, అంటువ్యాధులు ప్రధాన కారణాలు.[4] ఈ నొప్పి ఉన్నవారిలో సుమారు 90శాతం మందికి తీవ్రమైన వెన్నునొప్పి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.[5]

సాధారణ కారణాలు
కారణం వెన్నునొప్పి ఉన్నవారిలో%
అస్పష్టత 90%
వెన్నుపూస కుదింపు పగులు 4%[6]
మెటాస్టాటిక్ క్యాన్సర్ 0.7%
వ్యాప్తి 0.01%
కాడా ఈక్వినా 0.04%

నివారణ - చికిత్స

[మార్చు]

నివారణ

[మార్చు]
 1. వ్యాయామం చేయడం
 2. బెడ్ రెస్ట్ ని తగ్గించుకోవడం
 3. ఫ్లెక్సిబిలిటీను పెంపొందించుకోవడం
 4. సరైన భంగిమలో నిద్రించడం
 5. స్మోకింగ్ కు దూరంగా ఉండడం

శస్త్రచికిత్స

[మార్చు]

వెన్నునొప్పి తీవ్రమైనపుడు శస్త్రచికిత్స తప్పినిసరిగా చేయాల్సివస్తుంది.[7]

కొన్ని సమయాల్లో కింది లక్షణాలు కల రోగులకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు:

 • కటి కశేరు చక్రిక పక్కకు తొలగడం లేదా వ్యాధి వలన కశేరు చక్రిక క్షీణించడం
 • కటి కశేరు చక్రిక పక్కకు తొలగడం వలన కటి ప్రాంతపు కశేరు కుల్య కుంచించుకపోవడం, వ్యాధి వలన కశేరు చక్రిక క్షీణించడం లేదా స్పాండైలోలిస్థేసిస్
 • పార్శ్వగూని
 • వెన్నుపూస పగులు

గర్భం

[మార్చు]

గర్భధారణ సమయంలో 50%మంది మహిళలు ఈ వెన్నునొప్పిని అనుభవిస్తారు. గర్భధారణకు ముందు వెన్నునొప్పిని అనుభవించిన మహిళలకు గర్భధారణ సమయంలో వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలలో తేలింది.[8] గర్భిణీ స్త్రీలలో మూడవ వంతు స్త్రీలకు ఈ నొప్పి తీవ్రంగా ఉండవచ్చు.[9] ఈ వెన్నునొప్పి 18 వారాల గర్భధారణ వద్ద ప్రారంభమై, 24 - 36 వారాల గర్భధారణలో ఈ నొప్పి పెరుగుతుంది. గర్భధారణ సమయంలో వెన్నునొప్పిని అనుభవించిన స్త్రీలలో సుమారు 16%మందికి గర్భధారణ తర్వాత కూడా వెన్నునొప్పి ఉంది. వెన్నునొప్పి ఉన్నవారు గర్భం తరువాత వెన్నునొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తేలింది.

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Church E, Odle T. Diagnosis and treatment of back pain. Radiologic Technology [serial online]. November 2007;79(2):126-204. Available from: CINAHL Plus with Full Text, Ipswich, MA. Accessed December 12, 2017.
 2. Burke GL (2008). "Chapter 3: The Anatomy of Pain in Backache". Backache:From Occiput to Coccyx. Vancouver, BC: MacDonald Publishing. ISBN 978-0-920406-47-2.
 3. A.T. Patel, A.A. Ogle. "Diagnosis and Management of Acute Low Back Pain" Archived 2011-10-26 at the Wayback Machine. American Academy of Family Physicians. Retrieved March 12, 2007.
 4. Walls, Ron M.; Hockberger, Robert S.; Gausche-Hill, Marianne (2017-05-18). Rosen's emergency medicine : concepts and clinical practice. Walls, Ron M.,, Hockberger, Robert S.,, Gausche-Hill, Marianne (Ninth ed.). Philadelphia, PA. ISBN 9780323354790. OCLC 989157341.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
 5. Slipman, Curtis W.; et al., eds. (2008). Interventional spine : an algorithmic approach. Philadelphia, PA: Saunders Elsevier. p. 13. ISBN 978-0-7216-2872-1.
 6. Stern, Scott D. C. (2014-10-28). Symptom to diagnosis : an evidence-based guide. ISBN 9780071803441. OCLC 894996548.
 7. Wall and Melzack's textbook of pain. McMahon, S. B. (Stephen B.) (6th ed.). Philadelphia, PA: Elsevier/Saunders. 2013. ISBN 9780702040597. OCLC 841325533.{{cite book}}: CS1 maint: others (link)
 8. High risk pregnancy : management options. James, D. K. (David K.), Steer, Philip J. (4th ed.). St. Louis, MO: Saunders/Elsevier. 2011. ISBN 9781416059080. OCLC 727346377.{{cite book}}: CS1 maint: others (link)
 9. Honorio Benzon, MD; James p. Rathmell, MD; Christopher l. Wu, MD; Dennis Turk, PhD; Charles e. Argoff, MD; Robert w Hurley, MD (2013-09-12). Practical management of pain. Benzon, Honorio T.,, Rathmell, James P.,, Wu, Christopher L.,, Turk, Dennis C.,, Argoff, Charles E.,, Hurley, Robert W. (Fifth ed.). Philadelphia, PA. ISBN 9780323083409. OCLC 859537559.{{cite book}}: CS1 maint: location missing publisher (link)