వెబ్‌‌మెయిల్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెబ్‌మెయిల్‌ (లేదా వెబ్‌ ఆధారిత ఈమెయిల్‌ ) అనే పదాన్ని ప్రధానంగా రెండు అంశాలను నిర్వచించేందుకు ఉపయోగిస్తారు. వెబ్‌ మెయిల్‌ క్లయింట్‌ ను నిర్వచించడం ఈ పదం ఉపయోగాల్లో ఒకటి. వెబ్‌మెయిల్‌ క్లయింట్‌ అంటే వెబ్‌ అప్లికేషన్‌గా అమలు చేసే ఈమెయిల్‌ క్లయింట్‌. దీన్ని వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా యాక్సెస్ చేస్తారు. ఈ పదాన్ని పై అర్థంలో వాడటం పైనే ఈ వ్యాసం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. హాట్‌మెయిల్‌, యాహూ మెయిల్‌, జి మెయిల్‌ మరియు AOL మెయిల్‌;[1] వంటి వెబ్‌సైట్ల (వెబ్‌మెయిల్‌ అందించే కంపెనీ) ద్వారా అందించే ఈమెయిల్‌ సేవల‌ను వివరించడం ఈ పదం రెండో ఉపయోగం. వాస్తవానికి ఏ వెబ్ ‌మెయిల్‌ ప్రొవైడర్ అయినా వెబ్‌మెయిల్‌ క్లయింట్‌ సాయంతోనే ఈమెయిల్‌ యాక్సెస్ ను అందిస్తుంది. వీటిలో అనేక కంపెనీలు డెస్క్‌టాప్‌ ఈమెయిల్‌ సర్వీస్‌ను అందిస్తున్నాయి. డెస్క్‌టాప్‌ ఈమెయిల్‌ను ప్రామాణిక ఈమెయిల్‌ నిబంధనలను అనుసచడం ద్వారా వినియోగించుకోవచ్చు. అనేక ఇంటర్నెట్‌ సర్వీస్‌ అందజేసే కంపెనీలు, తమ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్యాకేజ్‌తో పాటే ఈమెయిల్‌ సర్వీస్‌లో భాగంగా వెబ్‌మెయిల్‌ను అందజేస్తున్నాయి.

డెస్క్‌టాప్‌ ఈమెయిల్‌ వినియోగించేవారితో పోలిస్తే, వెబ్‌మెయిల్‌ను ఉపయోగించే వారికి అదనపు ప్రయోజనాలున్నాయి. వీరు వెబ్‌ బ్రౌజర్‌ అందుబాటులో ఉన్న ఏ ప్రదేశం నుంచైనా ఈమెయిల్‌ను పొందవచ్చు మరియు పంపవచ్చు. దీనిలో ఉన్న ప్రతికూల అంశం ఏమిటంటే, ఇది దీనిని ఉపయోగించే సమయంలో ఇంటర్నెట్‌ ఉంటే మాత్రమే పనిచేస్తుంది. (జీ మెయిల్‌ తన వినియోగదారులకు కొన్ని గేర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా వెబ్‌మెయిల్‌ను ఆఫ్‌లైన్‌లోనూ ఉపయోగించుకునే సదుపాయం కల్పిస్తోంది.) [2].

చరిత్ర[మార్చు]

వెబ్‌ ఆరంభ రోజుల్లో, 1994, 1995లలో, అనేక మంది ఈమెయిల్‌ను, వెబ్‌ బ్రౌజర్‌ను వినియోగించుకుని పని చేసేవారు. యూరోప్‌లో, సోరెన్‌ వెజురమ్‌ మరియు లూకా మనుంజా అనేవారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌[3] మరియు వెబ్‌మెయిల్‌[4][5] అప్లికేషన్‌లను విడుదల చేశారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో మాట్‌ మాన్‌కిన్స్‌ వెబెక్స్‌ను రాశారు.[6] ఈ ప్రారంభ అప్లికేషన్స్‌ అన్నింటిలోనూ పెర్ల్‌ స్క్రిప్ట్స్‌ ఉండేవి. ఇందులో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు పూర్తి సోర్స్‌ కోడ్‌ అందుబాటులో ఉండేది.

1994లో, బిల్‌ ఫిట్లర్‌ కాలిఫోర్నియాలో లోటస్‌ సిసి: మౌంటెన్‌ వ్యూలో మెయిల్‌, వెబ్‌ ఆధారిత ఈమెయిల్‌ను ఆచరణలోకి తీసుకురావడం గురించి పని చేయడం మొదలుపెట్టారు. దీనికి విండోస్‌ ఎన్‌టిలో సి లో రాసినసిజిఐ ప్రోగ్రామ్‌ను ఉపయోగించారు. దీనిని 1995 జనవరిలో లోటస్‌ఫియర్‌లో ప్రపంచానికి పరిచయం చేశారు.[7][8][9]

సోరెన్‌ వెజురమ్‌ డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌ గురించి రాశారు. దీనిని 1995, ఫిబ్రవరి 28న విడుదల చేశారు.[10] లూకా మనూంజా, శార్డినియాలోని CRS4లో పనిచేస్తుండగా తన వెబ్‌మెయిల్‌ గురించి రాశారు. దీనిని తొలుత 1995 మార్చి 30న విడుదల చేశారు.[11] యునైటెడ్‌ స్టేట్స్‌లో మాట్‌ మాన్‌కిన్స్‌ తన వెబెక్స్‌ అప్లికేషన్‌ను మియామీ విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బర్ట్‌ రోసెన్‌బర్గ్‌ పర్యవేక్షణలో విడుదల చేశారు.[12] 1995 ఆగస్టు 8న సోర్స్‌కోడ్‌ను కాంప్‌.మెయిల్‌. మిస్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి కొద్ది నెలల ముందు మాన్‌కిన్స్‌ పనిచేసిన ఆర్కిటెక్చర్‌ స్కూల్‌లోనే దీనిని ప్రాథమిక ఈమెయిల్‌ అప్లికేషన్‌గా ఉపయోగించారు.[13]

ఇదిలా ఉండగా, బిల్‌ఫిల్టర్‌ యొక్క వెబ్‌మెయిల్‌ ఆచరణను, మరింత అభివృద్ధి చేసి, లోటస్‌ సంస్థ ఒక వాణిజ్యపరమైన ఉత్పత్తిగా తయారు చేసింది. 1995 చివర్లో దీనిని మెయిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ 1.0గా విడుదల చేసింది. తర్వాత యాక్సెస్‌కు ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా సిసిగా చూపించింది. దీనిని మెయిల్‌ మెసేజ్‌ స్టోర్‌ (సిసిగా ఉండటం అంటే సాధారణ అర్థం: డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌ మెయిల్‌ను డయల్‌అప్‌ కనెక్షన్‌ ద్వారా లేదా ఒక లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ ద్వారా నిర్వహించడం) గా పిలిచారు.[14][15][16][17]

1995 చివర్లో వెబెక్స్‌ను వెబ్‌ కాన్ఫరెన్సింగ్‌ కంపెనీతో సంబంధం లేకుండా మాన్‌కిన్‌ యొక్క కంపెనీ తన డాట్‌ షాప్‌, ఇన్‌కార్పొరేటెడ్‌లో అమ్మడం ప్రారంభించినప్పుడే వెబ్‌మెయిల్‌ వాణిజ్యపరమైన అంశంగా మారింది. డాట్‌షాప్‌లో వెబెక్స్‌ పేరును ఇఎంయు మెయిల్‌గా మార్చారు. దీనిని యుపిఎస్‌ మరియు రాక్‌స్పేస్‌ లాంటి కంపెనీలకు, 2001లో ఎకరెవ్‌కు తమ కంపెనీ అమ్మేవరకూ అందించారు.[18] తొలుత ఉచిత వర్షెన్‌ను అందించిన కొన్ని మెయిల్‌లలో ఇఎంయు మెయిల్‌ కూడా ఒకటి. ఇందులో ప్రకటనలతో పాటు గతంలో లేని లైసెన్స్‌ వెర్షన్‌ కూడా ఉంది. ఉచిత ఈమెయిల్‌ అడ్రెస్‌ మార్కెట్‌లో హాట్‌మెయిల్‌ పాదం మోపేసరికి, ఇఎంయు మెయిల్‌, మాలి మెయిల్‌ను ప్రారంభించింది. ఇందులో వెబ్‌ ద్వారా ఇప్పటికే ఉన్న తమ ఈమెయిల్‌ను క్లయింట్‌ పరిశీలించుకోవచ్చు.[19] ఎకరెవ్‌ కంపెనీ ఇఎంయు మెయిల్‌ను పొందిన తర్వాత, SMTP.com కోసం వెబ్‌మెయిల్‌ లైన్‌ను తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈమెయిల్‌ డెలివరీ కోసం ఎస్‌ఎమ్‌టిపి.కామ్‌ను అమ్ముతున్నారు.[20]

సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజ్‌లు[మార్చు]

సంస్థలు తమ అనుబంధ వ్యక్తులు, సంస్థలకు వెబ్‌ ద్వారా ఈమెయిల్‌ సర్వీసును అందించడం కోసం వీలుగా సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సొల్యూషన్స్‌ స్క్విరెల్‌ మెయిల్‌, రౌండ్‌ క్యూబ్‌, బ్లూ మాంబా, లోహా మెయిల్‌ మరియు యుబిమియా లాంటి ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నాయి. ఇతర సొల్యూషన్స్‌ ఎట్‌ మెయిల్‌ లాంటి వాణిజ్యపరమైన ఓపెన్‌ సోర్స్‌ లేదా అవుట్‌లుక్‌ వెబ్‌ యాక్సెస్‌ మాడ్యూల్‌ ఫర్‌ మైక్రోసాఫ్ట్‌ ఎక్స్చేంజ్‌ లాంటి క్లోజ్డ్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌లను కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో, POP3 లేదా IMAP అకౌంట్‌లలో నిల్వ చేయబడిన వెబ్‌మెయిల్‌ను వెబ్‌ బ్రౌజర్‌ ద్వారా యాక్సెస్‌ చేసేందుకు ప్రోగ్రామ్స్‌ రాశారు. ఇక్కడ ప్రామాణిక ఇంటర్‌ఫేస్‌ లేకపోవడం వల్ల వినియోగదారుడి ఇంటర్‌ఫేస్‌లో మార్పులను తెలుసుకోవడం కష్టం కాబట్టి, ఇవి అనుమానితంగా మారాయి.

కొందరు ప్రొవైడర్స్‌ వెబ్‌ యాక్సెస్‌ను ఇతర ఈమెయిల్‌ సర్వర్లకు అందిస్తున్నారు. దీనివల్ల మెయిల్‌ బాక్స్‌లకు వెబ్‌ యాక్సెస్‌, మెయిల్‌ సర్వర్‌ వెబ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఇవ్వకపోయినా లేదా కోరుకున్న ప్రత్యామ్నాయ ఇంటర్‌ఫేస్‌ లేకపోయినా సమస్య లేదు.

అందజేయడం మరియు అనుకూలత (సంయోజనీయత)[మార్చు]

ఈమెయిల్‌ వినియోగదారులు వెబ్‌మెయిల్‌ క్లయింట్‌ మరియు డెస్క్‌టాప్‌ క్లయింట్‌లు కూడా POP3 ప్రొటోకాల్‌ను ఉపయోగించుకోవచ్చు: డెస్క్‌టాప్‌ క్లయింట్‌ డౌన్‌లోడ్‌ చేసిన ఈమెయిల్‌ సర్వర్‌లో వెబ్‌మెయిల్‌ క్లయింట్‌కు అందుబాటులో ఉండదు. ఈ విధానంలో వెబ్‌మెయిల్‌ క్లయింట్‌ యొక్క ఉపయోగం పరిమితంగా ఉంటుంది. దీని వల్ల డెస్క్‌టాప్‌ ఈమెయిల్‌ క్లయింట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే క్లయింట్‌ చూసుకోవచ్చు.

మరోవైపు, IMAP4ను ఉపయోగించే వెబ్‌మెయిల్‌ క్లయింట్‌ మరియు డెస్క్‌టాప్‌ క్లయింట్‌ ఇలాంటి ఇన్‌కంపాటబులిటీ లేని ప్రోటోకాల్‌ను పాటించవచ్చు: మెయిల్‌ బాక్స్‌లో ఉన్న అంశాలు స్థిరంగా వెబ్‌మెయిల్‌లో మరియు డెస్క్‌టాప్‌ ఈమెయిల్‌ క్లయింట్‌ చూడవచ్చు. ఒక ఇంటర్‌ఫేస్‌లో క్లయింట్‌ చేసిన ఏ చర్యనైనా, మరో ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి ఈమెయిల్‌ను యాక్సెస్‌ చేయడం ద్వారా చూడవచ్చు.

అందజేసే సామర్ధ్యం విషయంలో యాహు మెయిల్‌, జి మెయిల్‌, విండోస్‌ లైవ్‌ హాట్‌మెయిల్‌ లాంటి ప్రఖ్యాత వెబ్‌మెయిల్‌ సర్వీస్‌ కంపెనీలలో చెప్పుకోదగ్గ మార్పులు ఉన్నాయి. దీనికి హెచ్‌టిఎమ్‌ఎల్‌ ట్యాగ్స్‌ను రకరకాలుగా ఉపయోగించడం, ఉదాహరణకు స్టయిల్‌ మరియు హెడ్‌, సిఎస్‌ఎస్‌ను అందజేసే అస్థిరత్వం తదితరాలను కారణంగా చెప్పవచ్చు. ఈ మెయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సాధారణంగా పాత వెబ్‌ డెవెలెప్‌మెంట్‌ టెక్నిక్‌లను ఉపయోగించి మెయిల్‌ను క్రాస్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదకు పంపుతాయి. సాధారణంగా దీని అర్థం, టేబుల్స్‌ మరియు ఇన్‌లైన్‌ స్టైల్‌షీట్స్‌ మీద ఆధారపడటం.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • వెబ్‌మెయిల్‌ ప్రొవైడర్ల మధ్య పోలిక
 • ఈమెయిల్‌ క్లయింట్‌ల మధ్య పోలిక
 • ఈ మెయిల్‌ను హెస్ట్‌ చేసే సర్వీసులు
 • ఎల్‌ లేదా లెటర్‌ మెయిల్‌, ఈ మెయిల్‌ లెటర్‌ మరియు లెటర్‌ ఈ మెయిల్‌

సూచనలు[మార్చు]

 1. బ్రౌన్‌లో, మార్క్‌ఈమెయిల్‌ అండ్‌ వెబ్‌మెయిల్‌ స్టాటిస్టిక్స్‌ Archived 2007-03-16 at the Wayback Machine.,ఈమెయిల్‌ మార్కెటింగ్‌ రిపోర్ట్స్‌, జనవరి 2009
 2. ఆఫ్‌లైన్‌ జిమెయిల్‌ అధికారిక జిమెయిల్‌ బ్లాగ్‌, జనవరి 27, 2009
 3. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌ క్లెయింట్‌ వెబ్‌సైట్‌ 'డబ్లుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌ వెబ్‌సైట్‌ Archived 2010-07-18 at the Wayback Machine.
 4. పినా ఆల్బెర్టో సోరు: అన్‌ ఇన్‌కాన్‌ట్రో కాన్‌ రుబియా, కోసి నాక్వి ఇల్‌ వెబ్‌ ఇన్‌ సార్డెగానా కొరియర్‌ డెల్లా సారా, 1999 డిసెంబర్‌ 28 (ఇటాలియన్‌)
 5. ఫెరుసి లూకా "ది ఐసీటి ఇన్‌ సార్డినియా: స్టార్ట్‌ అప్‌ అండ్‌ ఎవల్యూషన్‌" Archived 2008-10-29 at the Wayback Machine.
 6. comp.mail.misc వెబెక్స్‌ ప్రకటన "comp.mail.misc వెబెక్స్ అనౌన్స్‌మెంట్, ఆగస్టు 8, 1995"
 7. ఇన్ఫో వరల్డ్‌,లోటస్‌ సిసి : మెయిల్‌ టు గెట్‌ బెటర్‌ సర్వర్‌, మొబైల్‌ యాక్సెస్‌ , ఫిబ్రవరి 6, 1995, p. 8.
 8. ఇన్ఫర్మేషన్‌ వీక్, సర్ఫింగ్‌ ద నెట్‌ ఫర్‌ ఈ మెయిల్‌, అక్టోబర్‌ 16, 1995
 9. బిజినెస్‌ వైర్‌, రీకోర్స్‌ టెక్నాలజీస్‌ అపాయింట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, నవంబరు 3, 2000.
 10. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌ క్లయింట్‌ 1.00 అనౌన్స్‌: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు మెయిల్‌ క్లయింట్‌ 1.00
 11. వెబ్‌మెయిల్‌ - సోర్స్‌ కోడ్‌ రిలీజ్‌
 12. సివి, డాక్టర్‌. బర్టన్‌ రోసెన్‌ బర్గ్‌ సివి, బర్టన్‌ రోసెన్‌బర్గ్‌ Archived 2010-06-15 at the Wayback Machine.
 13. comp.mail.misc వెబెక్స్‌ ప్రకటన "comp.mail.misc వెబెక్స్‌ ప్రకటన, ఆగస్ట్‌ 8, 1995"
 14. నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ లోటస్‌ రీడీస్‌ సిసి: మెయిల్‌ వెబ్‌ హూక్స్‌, (పార్ట్‌ 2), సెప్టెంబరు 4, 1995, pp. 1, 55.
 15. పిఆర్‌ న్యూస్‌వైర్‌, లోటస్‌ అనౌన్సెస్‌ సిసి: మెయిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ వైడ్‌ వెబ్‌[permanent dead link], సెప్టెంబరు 26, 1995.
 16. ఇన్ఫో వరల్డ్‌ సిసి: మెయిల్‌ యూజర్స్‌ విల్‌ గెట్‌ ఈమెయిల్‌ త్రూ వెబ్‌, అక్టోబరు 2, 1995, p. 12.
 17. నెట్‌వర్క్‌ వరల్డ్‌, మోర్‌ ఫ్రమ్‌ లోటస్‌: ఎక్స్‌. 500 మరియు ది వెబ్‌, అక్టోబరు 2, 1995, p. 10.
 18. "ఇఎంయు మెయిల్‌ వెబ్‌సైట్‌". మూలం నుండి 2009-09-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-30. Cite web requires |website= (help)
 19. మాలి మెయిల్‌ రివ్యూ 'మాలి మెయిల్‌ రివ్యూ
 20. SMTP.com SMTP.com