వెలమల సిమ్మన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆచార్య వెలమల సిమ్మన్న బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు, ఉత్తమ పరిశోధకులు, ఆదర్శ అధ్యపకులు, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు ఆచార్య వెలమల సిమ్మన్న గారు.

జీవిత విశేషాలు[మార్చు]

సిమ్మన్న గారు శ్రీ కాకుళం జిల్లా, జాలుమూరు మండలం, తిమడాం గ్రామంలో మర్చి 1వ తేది 1955 సం||లో శ్రీమతి వి.ఆరుద్రమ్మ, డాక్టర్ వి. కృష్ణమూర్తి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు ప్రాథమిక విద్య, ఉత్తమ విద్య తిమడాం గ్రామంలో పూర్తి చేసారు. ఇంటర్ విద్యను నరసన్న పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, డిగ్రీ విద్యను విజయనగరం ఎం.ఆర్. కళాశాలలోనూ, ఎం.ఎ ఆంధ్ర విశ్వ కళా పరిశాత్తులోను విద్యను అభ్యసించి, అంతటితో ఆగక డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఆంధ్ర విశ్వ కళా పరిశాత్తు, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు శాఖలో అధ్యాపక ధర్మం నిర్వహిస్తూ, విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో మరువలేని అక్షరబీజాలు వెదజాల్లూతూ, ఉత్తమ ఫలాలు అందుకుంటూ, తెలుగు సాహితీ సరస్వతికి సేవలందిస్తూ, ఎన్నో పురస్కారాలను, అవార్డులను, “భాషా విభూషణ” అనే బిరుదుని అందుకున్న ఘనుడు.

బహు విద్యాయోగ్యతలు కలిగిన ఉత్తమ విద్యార్థిగా, పరిశోధన స్థాయి విద్యార్థులకు మార్గదర్శకునిగా, ఆకాశవాణిలో గళాన్ని వినిపిస్తూ, తన బాణిలో తెలుగు సాహితీ రంగంలో తన కాలాన్ని నదిపిస్తూ, ఎన్నో సభల్లో, సెమినార్లల్లో ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ, విశ్వవిద్యాలయ స్థాయిలో ముల్యాకకునిగా మన్ననలను పొందారు.

క్లిష్టమైన పాట్యామశాలను సైతం సులభమైన పద్ధతిలో దూర విద్య కేంద్రాల్లో ప్రత్యేకంగా నిర్వహించే తరగతుల్లో భోదిస్తున్నారు. సిమ్మన్న బోధనకు సంబంధించిన తరగతి ఉన్నదని తెలుసుకున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని చెప్పటం సహజోక్తి మాత్రమే. “ఎంతటి క్లిష్ట విషయాన్ని అయినా అతిసరలంగా, సుభోధకంగా వ్యక్తికరించ గల నేర్పు నైపుణ్యం సిమ్మన్న గారి సొంతం”. సిమ్మన్న మిక్కిలి చదవరి. “పట్టెనేని విడిచి పెట్టరాదు” అని అన్నట్లు “పట్టిన పట్టును సాధించటంలో ఉడుము కూడా సిమ్మన్న గారి ముందు తక్కువే” అని చెప్పవచ్చు. ఎంత దీక్ష లేకపోతే ఆయన “ సంస్కృతం, హిందీ, తమిళం, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ట్రాన్స్లేషన్, ఫంక్షనల్ ఇంగ్లీష్ మొదలైన ఏడు అంశాల్లో డిప్లామోలు పొందగలిగారు. ఏ అంశం మీద వ్యాసం రాయాలన్నా, ఏ విషయం మీద గ్రంథం రాయాలన్నా సిమ్మన్న గారు బహు గ్రంథ పరిశీలన చేస్తారు అని వారి రచనల్ని చదినప్పుడు తెలుస్తుంది”.

సిమ్మన్న ఆంధ్ర విశ్వ కళాపరిషత్ దూర విద్యా కేంద్రంలో తెలుగు విభాగంలో పనిచేస్తున్నారు. వీరు భాష, సాహిత్యం, వ్యాకరణం, విమర్శ మొదలైన రంగాలకు సంబంధించి 60 గ్రంథాల్ని రాశారు. అందులో 58 గ్రంథాలు ముద్రణకు నోచుకున్నాయి. రెండు (2) అముద్రితంగా ఉన్నాయి. సిమ్మన్న గారు 310 కి పైగా రాసిన పరిశోధన పత్రాలు భారతి, తెలుగు, నవభారతి, సాహితీ స్రవంతి, భావవీణ, చేతన, చినుకు, మూసీ, నడుస్తున్న చరిత్ర మొదలైన ప్రముఖ పత్రికల్లో ముద్రించబడ్డాయి. 45 కి పైగా రేడియో ఉపన్యాసాలిచ్చి శ్రోతల్ని అలరించారు. 100 కి వివిధ సాహితీ సభల్లో ఉపన్యాసాలిచ్చి సభను రంజింపజేశారు. సిమ్మన్న గారి గైడెన్స్ లో 27 మందికి ఎం.ఫిల్, 10 మందికి పి.హెచ్.డిలు వచ్చాయి. సిమ్మన్న రచనల పై వివిధ పత్రికల్లో 20 వ్యాసాలు రాశారు. వీరు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ “బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు” చైర్మన్ గా వ్యవహారించారు. అంతేకాకుండా వివిధ విశ్వ విద్యాలయాల్లో “బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్”గా ఉన్నారు. ప్రస్తుతం వీరు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయాల్లో (శ్రీ కాకుళం) తెలుగు విభాగం, “బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ తెలుగు” చైర్మన్ గా ఉన్నారు. ఆచార్య సిమ్మన్న రాసిన “ఆంధ్ర భాషా చరిత్ర”, “తెలుగు సాహితీ చరిత్ర”, “తెలుగు సాహిత్య విమర్శ సిద్దాంతాలు”, “ఆధునిక భాషా శాస్త్ర౦” అనే గ్రంథాలు సివిల్ సర్విస్, గ్రూప్-1, గ్రూప్-2, నెట్, స్లెట్, వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకే కాక, అన్ని విశ్వ విద్యాలయాల్లో ఎం.ఎ తెలుగు చదివే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా అధ్యాపకులకు, పరిశోధకులకు, సాహితీ ప్రియులకు ఉపయోగపడుతున్నాయి. వీరు రాసిన “తెలుగు భాషా చరిత్ర” అనే గ్రంథం ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమి వారు హిందీ భాషా లోనికి అనువదించారు.

అవార్డులు, పురస్కారాలు[మార్చు]

సిమ్మన్నగారి పరిశోధన ప్రతిభకు ఆయన ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. అవి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 1985 లో రఘుపతి వెంకటరత్నం నాయుడు “బెస్ట్ దిసేస్ అవార్డు”.

  • 1995 లో “బెస్ట్ రీసెర్చర్ అవార్డు”.
  • 2009 లో “బెస్ట్ ఎకాడమీషియాన్ అవార్డు”.
  • 2010 లో “అరసం” వారి “పురిపండా అప్పలస్వామి అవార్డు”
  • సెప్టెంబర్- 5 - 2013 రవేంద్ర భారతి హైదరాబాద్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు” .
  • 2014 లో శ్రీ శ్రీ సాయి సరిగమప సేవా సంస్థ వారి “సాహితీ బ్రహ్మ అవార్డు”.
  • 2006 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతులు మీదగా హైదరాబాదులో “భాషా విశిష్ట పురస్కారం”.
  • 2007 లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి “ధర్మనిధి పురస్కారం”.
  • 2012 లో సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్, 12 వ వార్షికోత్సవ సందర్భంగా “భాషాబ్రహ్మ పురస్కారం”.
  • 2003 గుంటూరులో “డాక్టర్ పిల్లి శాంసన్ స్మారక సాహితీ పురస్కారం”.
  • 2005 మచిలీపట్నంలో సాహితీ మిత్రుల “సాహితీ పురస్కారం”.
  • 2005 శ్రీ కాకుళంలో “ఆంధ్రప్రదేశ్ సాహితీ సాంస్కృతిక “సమాఖ్య పురస్కారం”.
  • 2006 మచిలీపట్నం ఆంధ్ర సారస్వతి సమితి వారి “ఉగాది సాహితీ ప్రతిభా పురస్కారం”.
  • 2007 తిరుపతి తెలుగు భాషా బ్రహ్మ ఉత్సవాల్లో “ఆత్మీయ పురస్కారం”.
  • 2008 హైదరాబాదు జ్యోత్స్నా కళాపీఠ౦ వారి “ఉగాది సాహితీ పురస్కారం”.
  • 2008 విశాఖపట్నం తెలుగు తేజం వారి “తెలుగు భాషా పురస్కారం”.
  • 2011 విజయవాడ రసభారతి సాహితీ సంస్థ వారి “విశిష్ట సాహితీ పురస్కారం”.
  • 2012 విశాఖపట్నం సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ వారి “మోదు గురుమూర్తి స్మారక పురస్కారం”.
  • 2012 –ఆగష్టు-15 భారత స్వాతంత్ర్య వేడుకలు సందర్భంగా శ్రీ కాకుళం జిల్లా కలెక్టర్ వారి వద్ద నుండి “విశిష్ట సేవ పురస్కారం”.
  • 2012 మచిలీపట్నం డాక్టర్ పట్టాబి కళాపీఠ౦ వారి “గిడుగు రామమూర్తి పంతులు ప్రతిభా పురస్కారం”.
  • 2013 ఒంగోలులో “శ్రీ మతి కుర్రాకోటి సూర్యమ్మ స్మారక సాహితీ పురస్కారం”.
  • 2013 విశాఖపట్నం విజయనామ ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం వారి “ఉగాది గౌరవ పురస్కారం”.

ఇలా ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. వందకి పైగా వివిధ సాహితీ సంస్థలు, ఇతర ప్రముఖ సంస్థలు ఆచార్య సిమ్మన్న సాహితీకృషిని గుర్తించి ఘనంగా సన్మానించింది. ప్రాచీన సాహిత్యానికి సంబంధించి కానీ, వ్యాకరణానికి సంబంధించి కానీ, భాషా చరిత్రకు సంబంధించి కానీ, భాషా శాస్తానికి సంబంధించి కానీ, సాహిత్య విమర్శకు సంబంధించి కానీ ఏదో ఒక రంగంలో నిష్ణాతులు అన్పించుకున్న వారు పెక్కు మంది ఉన్నారు. అయితే పైన పేర్కొన్న అన్ని అంశాల్లోనూ నిష్ణాతులు ఆచార్య వెలమల సిమ్మన్న గారు. ఇదే అయన గొప్పతనం, వారిలో ఉన్న ప్రత్యేకత, విశిష్టత. “కృషితో నాస్తిదుర్భిక్షం” అనే ఆర్యోక్తి ఊరకే పోదు.సిమ్మన్న గారి లాంటి నిరంతర క్రుషికులే దీనికి సాక్ష్యంగా చెప్పవచ్చు.

రచనలు[మార్చు]

  1. దర్శిని [1994]
  2. అడవి బాపిరాజు కథలు, కవిత్వం-పరిశీలన [1995]
  3. కళా తపస్వి బాపిరాజు [1996]
  4. తెలుగు శబ్ద పరిణామం [1997]
  5. తెలుగు భాషా పరిణామం [1998]
  6. జాషువా
  7. బాల వ్యాకరణం (సంజ్ఞ, సంధి, సమాస పరిఛ్ఛేదాలు- విశ్లేషణ)
  8. [2000]
  9. రస తరంగిణి [2000]
  10. తెలుగు సాహిత్య విమర్శ [2001]
  11. తెలుగు భాషాకౌముది [2001]
  12. తెలుగు భాషాతత్త్వం [2002]
  13. సాహితీ కిరణాలు [2002]
  14. బాపిరాజు భాషా వైదుష్యం [2002]
  15. ప్రపంచ భాషాలు [2003]
  16. సంధి – తులనాత్మక పరిశీలన [2003]
  17. సహృదయలహరి [2003]
  18. తెలుగు భాషా దర్పణం [2004]
  19. తెలుగు భాషా సంజీవని [2004]
  20. తెలుగు భాషా చరిత్ర [2004]
  21. భాషా శాస్త్ర వ్యాసాలు [2004]
  22. విమర్శ – వివేచన [2004]
  23. నాటకం – పరిశీలన [2005]
  24. ఆధునిక సాహిత్య విమర్శ [2005]
  25. తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు [2005]
  26. ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు [2006]
  27. తెలుగు భాషా దీపిక [2006]
  28. భాషా పరిశోధనా వ్యాసాలు [2007]
  29. భాషా శాస్త్ర విజ్ఞానం [2007]
  30. భాషా చారిత్రక వ్యాసాలు [2007]
  31. భాషాను శీలనం [2008]
  32. ఆధునిక భాషా శాస్త్రం [2008]
  33. లోచనం [2009]
  34. డాక్టర్ సి.ఆర్.రెడ్డి [2009]
  35. విమర్శ భారతి [2009]
  36. భాషాభోధిని [2009]
  37. తెలుగు సాహిత్యంలో ప్రక్రియలు [2010]
  38. విమర్శ – పరామర్శ [2010]
  39. విమర్శనదర్శనం [2011]
  40. తెలుగు సాహిత్య చరిత్ర [2011]
  41. ప్రముఖ సాహిత్య విమర్శకులు [2011]
  42. తెలుగు సంస్కృతిపై భౌద్ధమత ప్రభావం [2011]
  43. సాహిత్యం – ప్రయోజనం [2011]
  44. తెలుగు భాషా స్వరూపం [2011]
  45. సాహితీ స్రవంతి [2012]
  46. విశ్వనాథ శబరి [2012]
  47. సాహిత్య మంజరి [2012]
  48. సాహితీ సౌరభం [2012]
  49. తెలుగు భాషా శాస్త్రవేత్తలు [2012]
  50. వ్యాకరణ ప్రకాశిక [2013]
  51. ప్రముఖ పత్రికా సంపాదకులు [2013]
  52. సాహిత్య సుధ [2013]
  53. తెలుగు వెలుగు [2013]
  54. అన్వేషణ [2014]
  55. బోయి భీమన్న సాహితీ సమాలోచన [2014]
  56. సాహిత్యం – సమాజం [2014]
  57. అక్షరార్చన [2014]
  58. సాహితీ పరిమళం [2014]
  59. సాహిత్య సంపద [2014]

మూలాలు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: