Jump to content

వెలిచాల కొండలరావు

వికీపీడియా నుండి
వెలిచాల కొండలరావు
వెలిచాల కొండలరావు
జననంవెలిచాల కొండలరావు
1932
ఉద్యోగండైరెక్టర్, తెలుగు అకాడమి
ప్రసిద్ధివిద్యావేత్త, కవి, రచయిత, సంపాదకుడు

వెలిచాల కొండలరావు కవి, రచయిత, అనువాదకుడు, సంపాదకుడు. ఇతని స్వగ్రామం కరీంనగర్. ఇతడు బాల్యంలో ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నాడు. వాణిజ్యశాస్త్రంలో స్నాతకోత్తర పట్టాను పొందాడు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. కరీంనగర్, జగిత్యాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌గా తెలంగాణలో ఉన్నత విద్యారంగానికి విలువైన బాటలు వేశాడు. తెలుగు అకాడమి సంచాలకునిగా సేవల్ని అందించాడు. ఇంగ్లీషుతో పాటు ఉర్దూలోనూ ఇతనికి ప్రావీణ్యం ఉంది. తిలక్ అమృతం కురిసిన రాత్రి కావ్యాన్ని ఆంగ్లంలోకి, గాలిబ్ కవితల్ని తెలుగులోకి అనువదించాడు.[1]

విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యంపై ఇతనికి విపరీతమైన అభిమానం. విశ్వనాథ సాహిత్యం గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తగినంత ప్రచారం కల్పించడానికి ఇతడు విశ్వనాథ సాహిత్యపీఠం స్థాపించాడు. ఈ పీఠం ద్వారా విశ్వనాథపై పరిశోధనలకు అవసరమైన పూర్తి వాఙ్మయాన్ని అందుబాటులో ఉంచారు. విశ్వనాథ సాహిత్యాన్ని విశ్లేషించిన ఇంగ్లీషు వ్యాసాల బృహత్ సంకలనాన్ని (760 పుటలు) ఈ పీఠం ప్రచురించింది.

1927లో ప్రారంభమై కొంత కాలం నడిచిన 'జయంతి' పత్రికను ఇతడు 2003లో పునఃప్రారంభించి త్రైమాసికగా స్వీయసంపాదకత్వంలో నడిపాడు. ఈ పత్రిక సామల సదాశివ, ఇస్మాయిల్, పి.వి.నరసింహారావు, శేషేంద్ర, పఠాభి, సంపత్కుమార వంటి వారిపై ప్రత్యేక సంచికలు వెలువరించింది.

రచనలు

[మార్చు]

కొండలరావు ప్రకటించిన కొన్ని గ్రంథాలు:

  • Viswanatha : a literary legend
  • విశ్వనాథవారి ముద్దు వడ్డన్లు
  • ప్రజాయుద్ధనౌక గద్దర్
  • నాదేశం
  • Telangana : a classic cultural khazaana
  • రోజా
  • భాష-పరిభాష, సాహిత్యం-సంస్కృతి
  • మురిపాల ముచ్చట్లు - విశ్వనాథ గురించి
  • The night that rained nectar (అమృతం కురిసిన రాత్రికి ఆంగ్లానువాదం)
  • Poetry "Pattabhic" : ragala dozen (పఠాభి ఫిడేలు రాగాల డజన్ అనువాదం)
  • Seshendra Sharma : a poetic legend
  • Salam to you Dr. Kalam : a bouquet of tributes
  • మహానటి సావిత్రి

పదవులు

[మార్చు]

వెలిచాల కొండలరావు నిర్వహించిన పదవుల పాక్షిక జాబితా[2]:

  • సంచాలకులు - తెలుగు అకాడమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • సంయుక్త సంచాలకులు - ఉన్నత విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • సంచాలకులు - శాతవాహన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, కరీంనగర్
  • ప్రిన్సిపాల్ - గవర్నమెంట్ సిటీ కాలేజ్, హైదరాబాద్
  • ప్రిన్సిపాల్ - గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్
  • సెనెట్ సభ్యుడు - ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • ఛీఫ్ ఎడిటర్ - తెలుగు మాసపత్రిక
  • ఎడిటర్ - జయంతి ద్విభాషా త్రైమాసిక
  • ఛైర్మన్ - సిస్టర్ నివేదిత ఫౌండేషన్, హైదరాబాదు
  • ఛైర్మన్ - విశ్వనాథ సాహిత్య పీఠం, హైదరాబాదు
  • ఛీఫ్ ఎడిటర్ - బిజినెస్ విజన్ (ఆంగ్ల వాణిజ్య, నిర్వహణ త్రైమాసపత్రిక), హైదరాబాదు
  • శాశ్వత సభ్యుడు - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, న్యూఢిల్లీ
  • శాశ్వత సభ్యుడు - పొయెట్రీ సొసైటీ ఆఫ్ ఇండియా
  • శాశ్వత సభ్యుడు - పొయెట్రీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]

ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని[2]:

  • వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వారిచే డి.లిట్
  • మైకేల్ మధుసూదన్ దత్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్
  • జాగృతి కిరణ్ ఫౌండేషన్, నాగపూర్ వారిచే సుభాష్ చంద్రబోస్ జాతీయ సాహిత్య పురస్కారం
  • వరల్డ్ పొయెట్స్ కాంగ్రెస్, బ్యాంకాక్ & ఇస్తాంబుల్ నుండి ప్రశంసాపత్రాలు

మూలాలు

[మార్చు]
  1. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి. "వెల్చాల కొండలరావుకు 80 ఏళ్లు,". సాహితీబంధు. Retrieved 23 October 2025.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Dr. Kondal Rao Velchala". వివేకానంద డిగ్రీ అండ్ పి.జి. కాలేజ్, కరీంనగర్. Retrieved 23 October 2025.