వెలివర్తి రామదాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెలివర్తి రామదాసు
జననం1908
వెలివర్తి, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
మరణం1941
తండ్రిఅనంత క్రిష్ణయ్య
తల్లిసరస్వతి

వెలివర్తి రామదాసు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాగ్గేయకారుడు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

రామదాసు 1908వ సంవత్సరంలో అనంత క్రిష్ణయ్య, సరస్వతి దంపతులకు రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, వెలివర్తి గ్రామంలో జన్మించాడు.[3]

రచనా ప్రస్థానం[మార్చు]

రామదాసుకు చదువుపై ఆస్తకి లేకపోవడంతో మధ్యలోనే ఆపేశాడు. పన్నెండేళ్ళ వయసులో రంగశాయిపై ఆశువుగా సీసపద్యము చెప్పాడు. అచల గురువు బారలింగ దేశికేంద్రుడు వచ్చి రామదాసుకు ఉపదేశం ఇచ్చి, అచల పీఠాన్ని అప్పగించాడు. అక్కడ రామదాసు కందపద్యం, శ్లోకాలు, కీర్తనలు రచించి గానం చేస్తుండేవాడు. వీటన్నింటిని కలిపి పరిపూర్ణ గురుసార సంగ్రహము పేరుతో పుస్తకంగా ప్రచురించబడింది. గురుపూజ సంస్కృత శ్లోకాలు, గురుస్తవ షోడశ శ్లోకాలు, తత్వ విచార అద్వైత కీర్తనలు మొదలైనవి ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

మరణం[మార్చు]

ఈయన 1941లో శ్రావణ శుద్ధ తదియ రోజున మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 18 November 2019.
  2. తెలంగాణ మ్యాగజైన్ (17 December 2017). "సంకీర్తనా సాహిత్య వైభవం". magazine.telangana.gov.in. డా. పి. భాస్కరయోగి. Retrieved 18 November 2019.[permanent dead link]
  3. వెలివర్తి రామదాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 40