వెల్గటూర్ మండలం (జగిత్యాల జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెల్గటూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, వెల్గటూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, వెల్గటూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, వెల్గటూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం వెల్గటూర్ (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 188 km² (72.6 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 51,822
 - పురుషులు 25,850
 - స్త్రీలు 25,972
అక్షరాస్యత (2016)
 - మొత్తం 54.81%
 - పురుషులు 58.4%
 - స్త్రీలు 41.67%
పిన్‌కోడ్ {{{pincode}}}

వెల్గటూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన రామగుండం నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పెద్దపల్లి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం వెల్గటూర్

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 51,719 - పురుషులు 25,824 - స్త్రీలు 25,895

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 51,822. జనాభాలో పురుషులు 25,850 కాగా, స్త్రీల సంఖ్య 25,972. మండలంలో 14,325 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ వెల్గటూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలో, పెద్దపల్లి రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వెల్గటూర్ మండలాన్ని (1+21) ఇరవైరెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

ఎండపల్లి మండలం నూతనంగా ఏర్పాటయ్యాక వెల్గటూరు మండలం 26,028 మంది జనాభాతో, 15 రెవెన్యూ గ్రామాలతో నూతనంగా ఏర్పాటైంది.[5]

  1. వెల్గటూర్
  2. స్తంబంపల్లి
  3. కిషన్‌రావుపేట
  4. జగ్దేవ్‌పేట
  5. కప్పరావుపేట
  6. ముక్కట్రావుపేట్
  7. ముత్తునూర్
  8. చెగ్గ్యాం
  9. సాకపురం
  10. పైడిపల్లి
  11. రామ్‌నూర్‌
  12. సంకెనపల్లి
  13. కుమ్మరిపల్లి
  14. వెంకటాపూర్‌
  15. పాశిగాం

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.

వెలుపలి లంకెలు[మార్చు]