వెల్చల్ (మోమిన్‌పేట్‌)

వికీపీడియా నుండి
(వెల్చాల్ నరసింహస్వామి గుట్ట నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వెల్చల్, రంగారెడ్డి జిల్లా, మోమిన్‌పేట్‌ మండలానికి చెందిన గ్రామము.

వెల్చల్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం మోమిన్‌పేట్‌
ప్రభుత్వము
 - సర్పంచి
ఎత్తు 632 m (2,073 ft)
జనాభా (2011)
 - మొత్తం 1,696
 - పురుషుల సంఖ్య 835
 - స్త్రీల సంఖ్య 861
 - గృహాల సంఖ్య 367
పిన్ కోడ్ Pin Code : 501202
ఎస్.టి.డి కోడ్08416

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) మొత్తం 1471 అందులో పురుషులు 645 మంది. స్త్రీలు 726 మంది. గృహాలు 314 విస్తీర్ణము 1172 హెక్టార్లు, ప్రజల భాష. తెలుగు.
జనాభా (2011) - మొత్తం 1,696 - పురుషుల సంఖ్య 835 - స్త్రీల సంఖ్య 861 - గృహాల సంఖ్య 367

సమీప గ్రామాలు/ మండలాలు[మార్చు]

కొజ్జావనం పల్లె 2 కి.మీ. మల్రెడ్డిగూడ, 2 కి.మీ. కొడ్చర్ల 2 కి.మీ. మాదారం 4 కి.మీ> ఫుల్ మామిడి 4 కి.మీ. దూరేములో ఉన్నాయి. నవాబ్ పేట మండలం తూర్పున, మర్పల్లి మండలం పడమరన, వికారాబాద్ మండలం దక్షిణాన, సదాశివ పేట మండలము ఉత్తరానా ఉన్నాయి. ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా, మరియు మెదక్ జిల్లాల సరిహద్దులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపములోని రైల్వే స్టేషను వికారాబాద్. 11 కి.మీ. దూరములో ఉంది. గోడం గూడ రైల్వే స్టేషను, వికారాబాద్ రైల్వే స్టేషను ఇక్కడికి అతి సమీపములోని రైల్వే స్టేషను. . ప్రధాన రైల్వే స్టేషను హైదరాబాద్ ఇక్కడికి 69 కి.మీ.దూరములో ఉంది. ఈ గ్రామమునుండి అన్ని పరసర ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది.[1]

ఈ గ్రామములోని పాఠశాలలు[మార్చు]

ఈ గ్రామములో ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

నరసింహస్వామి గుడి[మార్చు]

మేకల కాపరి - పర్మయ్య[మార్చు]

రంగారెడ్డి జిల్లాలోని వెల్చాల్ నలభయ్యేళ్ల క్రితం దట్టమైన అటవీ ప్రాంతం. పర్మయ్య ఆనే మేకల కాపరి జీవనోపాధి కోసం తనకున్నాటు వంటి 40 మేకలను వేల్చాల్ గ్రామ సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్ళేవాడు . చుట్టూ చేయ్ట్లు, వాటిని దాటాక ఎత్తైన కొండలు, బండరాళ్ళు చుట్టూ పక్కల ప్రపంచంతో సంబంధాల్ని తెన్చివేసినట్లుండేవి. మేకలూ తనూ వొంటరిగా వున్నా అప్పుడప్పుడు భయమ కలిగేది. దానికి తోడు, ఎండా వానలకు తల దాచుకోటానికి ఒక ఆసరా కూడా లేకపోవటం అతన్ని ఆలోచనలకు నేట్టేయ్సింది. తొలుత ఆ కొండలను తొలిచి ఒక గుహ చేద్దామని గొడ్డలి చేత బట్టి రాత్రింబవళ్ళు శ్రమించాడు.

గుడి నిర్మాణము[మార్చు]

"ఓ రోజు లక్ష్మీ నరసింహస్వామి తన కలలో 'ఎలాగూ కొండలను తోలుస్తున్నావు నాక్కూడా ఒక గుడి కట్టు' అని అన్నట్టు అనిపించిందట". మేకలూ మేత మేసే సమయమ లోనే కాకుండా, వాటి మేత తరువాత వాటిని ఇంటిలో వదిలేసి తిరిగి తన పనిలో నిమగ్నంయ్యేవాడు. ఎంత శ్రమించినప్పటికీ ఎటువంటి కష్టం అనిపించేది కాదట. గుడి నిర్మాణం ఎంతో దీక్షతో కూడినటువంటి కార్యం, ఎవరి సాయం అర్తించకుండా, తానూ ఒక్కడే సుమారు ఆరు సంవత్సరాలు శ్రమించాడు, ఇంటిని వదిలి పూర్తిగా అడివికే అంకితమయ్యాడు. తన తండ్రి మరణించిన చలించక, పట్టు వదలక, ఆకలి, నిద్ర, పగలు, రాత్రి ఏమి తెలియకుండా గడిపాడు. ఒక సొరంగంలా తవ్వి, గుహను చెక్కటంతో ఆలయం మరో నాలుగేళ్లకు కాని స్థానికుల కంటపడలేదు. తర్వాత దానిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

గుడి అందాలు[మార్చు]

పర్మయ్య ఒక శిల్పి కాడు, ఐనప్పటికీ ఎంతో ఊహ శక్తి కావలి. ఆ భగవంతుడే తన ద్వారా ఇవన్ని చేయిఅంచాడని చెప్పుకోచాడు పర్మయ్య. ఆయన మాటల్లో, "ఆలయాని నిర్మించాలంటే ఎంతో ఊహ శక్తి వుండాలి, సిహ్మద్వారాలు, స్తంభాలు, వాటిమీద బొమ్మలు ఇవన్ని కళ్ళు మూసుకుంటే కాళ్ళ ముందు కనిపించేవి. ఆడాటునీ చేక్కేసేవాని ". సందర్శకులు, భక్తులు పెరిగారు. అక్కడికి సమీపంలోనే ౫౦౦ గజాల పొడవున్న మరో గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అటుపక్కనే బద్రీనాథ్, మల్లికార్జున స్వామి ఆలయాలను కూడా నిర్మించాడు పర్మయ్య. ౪౦ ఏళ్లలో ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

శివరాత్రి వుత్సవాలు/ఆలయ అభివృద్ధి[మార్చు]

ప్రతి శివరాత్రికీ ఈ ప్రాంతంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆలయం పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి స్వామివారిని దర్శించు కుంటారు భక్తులు. కోరికలు నేరవేరాలంటూ ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలను ముడుపులుగా కడతారు. పెళ్ళిళ్ళు, వ్రతాలు, పుట్టు వెండ్రుకలు తీయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. కోరికలు నెరవేరిన వారు స్వామికి ముడుపులు చెల్లిస్తారు, ఆవిధంగా సమకూరిన డబ్బులతోనే ఆలయ అభివృద్ధి జరుగుతోంది.

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Mominpet/Velchal". Retrieved 9 July 2016.  External link in |title= (help)