వెల్లింగ్టన్ మసకడ్జా
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | వెల్లింగ్టన్ పెడ్జిసాయ్ మసకడ్జా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1993 అక్టోబరు 4 హరారే, జింబాబ్వే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 106) | 2018 నవంబరు 3 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2025 జూలై 6 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 127) | 2015 అక్టోబరు 9 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 ఫిబ్రవరి 18 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 43) | 2015 అక్టోబరు 26 - ఆఫ్ఘనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 నవంబరు 25 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 11 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2013/14– | మౌంటెనీర్స్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2014/15 | మషోనాలాండ్ ఈగల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2026 జనవరి 2 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వెల్లింగ్టన్ పెడ్జిసాయ్ మసకడ్జా (జననం: 1993 అక్టోబరు 4) జింబాబ్వే క్రికెటర్, అతను మౌంటెనీర్స్, మషోనాలాండ్ ఈగల్స్ తరపున ఫస్ట్-క్లాస్, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. 2015 అక్టోబరు 9 న ఐర్లాండ్‌తో వన్డే ఇంటర్నేషనళ్ళ లోనూ [1] 2015 అక్టోబరు 26 న ఆఫ్ఘనిస్తాన్‌తో ట్వంటీ20 ఇంటర్నేషనళ్ళ లోనూ రంగప్రవేశం చేశాడు.[2]
దేశీయ క్రికెట్
[మార్చు]హరారే నగరానికి చెందిన, ఉన్నత స్థాయిలలో క్రికెట్ ఆడిన ముగ్గురు మసకడ్జా సోదరులలో వెల్లింగ్టన్ చిన్నవాడు - హామిల్టన్ మసకడ్జా (జననం 1983), షింగిరాయ్ మసకడ్జా (జననం 1986), ఇద్దరూ జింబాబ్వే జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు.[3] ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, ఎడమచేతి వాటం ఆర్థడాక్స్ స్పిన్నర్ అయిన వెల్లింగ్టన్ మసకడ్జా, 2012 అండర్-19 ప్రపంచ కప్‌లో జింబాబ్వే అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి, మూడు మ్యాచ్‌లు ఆడాడు.[4] అతను 2013-14 దేశీయ సీజన్‌లో మౌంటెనీర్స్ ఫ్రాంచైజీ తరపున సీనియర్ జట్టులో ప్రవేశించాడు.[5][6] సీజన్ ప్రారంభానికి ముందు ఆడిన నాలుగు ట్రయల్ ట్వంటీ20 ఆటలలో మంచి ప్రదర్శన ఇచ్చాడు.
2013–14 లోగాన్ కప్‌లో మసకడ్జా ఐదు మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.[7] ఇందులో మటాబెలెలాండ్ టస్కర్స్‌తో తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడుతూ, 5/63 గణాంకాలు సాధించాడు.[8] 3014 సెప్టెంబరులో అతను బంగ్లాదేశ్‌లో పర్యటించిన జింబాబ్వే A కి ఎంపికయ్యాడు. రెండు ఫస్ట్-క్లాస్, మూడు వన్డే ఆటలలో ఆడాడు.[5][6] ఆ మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్‌లో మసకడ్జా 6/63 సాధించాడు. ఇది అతని ఉత్తమ గణాంకాలు. తరువాత అతను అక్టోబరు, డిసెంబర్లలో బంగ్లాదేశ్ పర్యటన కోసం జింబాబ్వే సీనియర్ జట్టు లోని 17 మంది సభ్యుల టెస్ట్ జట్టులో తన ఇద్దరు సోదరులతో పాటు ఎంపికయ్యాడు. కానీ అతను ఏ టెస్ట్‌లోనూ ఆడలేదు. 2014–15 జింబాబ్వే సీజన్ కోసం, మసకడ్జా మషోనాలాండ్ ఈగల్స్ తరపున ఆడాడు.[5]
2020 డిసెంబరులో అతను 2020–21 లోగాన్ కప్‌లో మౌంటెనీర్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[9][10]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]వెల్లింగ్టన్ 2015 అక్టోబరు 9 న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరపున తన వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. కానీ ఆ సిరీస్‌పై తన ప్రభావం చూపలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ పర్యటనలో 21 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. చివరికి జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌ను గెలిచింది. మసకద్జా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[11]
2018 సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ కోసం జింబాబ్వే టెస్ట్ జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[12] అతను 2018 నవంబరు 3 న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరపున టెస్టుల్లో ప్రవేశించాడు.[13]
మూలాలు
[మార్చు]- ↑ "Ireland tour of Zimbabwe, 1st ODI: Zimbabwe v Ireland at Harare, Oct 9, 2015". ESPN Cricinfo. Retrieved 9 October 2015.
- ↑ "Afghanistan tour of Zimbabwe, 1st T20I: Zimbabwe v Afghanistan at Bulawayo, Oct 26, 2015". ESPN Cricinfo. Retrieved 26 October 2015.
- ↑ Under-19 ODI matches played by Wellington Masakadza (3) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ Under-19 ODI matches played by Wellington Masakadza (3) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ 5.0 5.1 5.2 First-class matches played by Wellington Masakadza (7) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ 6.0 6.1 List A matches played by Wellington Masakadza (6) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ Under-19 ODI matches played by Wellington Masakadza (3) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ Under-19 ODI matches played by Wellington Masakadza (3) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ – (16 October 2014). "Zimbabwe select Masakadza brothers for Bangladesh tests" – SBS Australia. Retrieved 17 November 2014.
- ↑ Under-19 ODI matches played by Wellington Masakadza (3) – CricketArchive. Retrieved 17 November 2014.
- ↑ "Wellington, Jongwe crush Afghanistan". ESPN Cricinfo. Retrieved 17 October 2015.
- ↑ "Brendan Taylor, Sean Williams return as Zimbabwe name squads for South Africa, Bangladesh tours". International Cricket Council. Retrieved 13 September 2018.
- ↑ – (16 October 2014). "Zimbabwe select Masakadza brothers for Bangladesh tests" – SBS Australia. Retrieved 17 November 2014.