వెస్టిన్ చెన్నై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెస్టిన్ చెన్నై
Westin Chennai
దస్త్రం:Westin velachery.jpg
Westin Chennai
హోటల్ చైన్స్టార్‌వుడ్ హోటల్స్
సాధారణ సమాచారం
ప్రదేశంభారతదేశం
చిరునామా154, వెలచెరి
చెన్నై, తమిళనాడు 600 042
ప్రారంభంఫిబ్రవరి 2013
యజమానిపి. మొహమద్ అలీ (Mfar Hotels and Resorts Limited)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య10
ఇతర విషయములు
గదుల సంఖ్య215
జాలగూడు
starwoodhotels.com/westin

వెస్టిన్ చెన్నై (Westin Chennai) అనేది భారతదేశంలోని చెన్నై నగరంలోని 10-అంతస్థుల భవనంలో ఏర్పాటు చేసిన విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్. ఈ హోటల్ చెన్నై నగరం దక్షిణ శివారులో గల వెలచెరిలోని వెలచెరి ప్రధాన రహదారిలో ఉంది. ఇది భారత దేశంలో ఏర్పాటు చేసిన ఆరవ వెస్టిన్ హోటల్.[1] విమానాశ్రయానికి అతి సమీపంలో ఈ హోటల్ ఉంది. అంతేకాదు కెంప్లాస్ట్ క్రికెట్ మైదానానికి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసుకు, గిండీ జాతీయ ఉద్యానవానికి, గిండీ రేస్ కోర్స్ కు, చెన్నై స్నేక్ పార్కు కు ఇది అతి దగ్గరలో ఉంటుంది.

చరిత్ర[మార్చు]

వెస్టిన్ చెన్నై హోటల్ ఫిబ్రవరి, 2013లో ప్రారంభమైంది.[1] నవంబరు 2013లో ఈ హోటల్ తన ఆసియన్ స్పెషాలిట్ రెస్టారెంట్ ను ప్రారంభించింది.[2]

ది హోటల్[మార్చు]

వెస్టిన్ చెన్నై హోటల్ ను 7792  చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల చదునైన స్థలంలో నిర్మించారు.[3] ఈహోటల్లో రోజంతా నడిచే డైనింగ్ హాళ్లు, ప్రత్యేకమైన రెస్టారెంట్, బార్, పూల్ సైడ్ రెస్టారెంట్ సహా నాలుగు ఫుడ్ కోర్టులు, బ్రేవరేజ్ వేదికలు ఉన్నాయి. ఈ హోటల్లో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాయామం చేసేందుకు వెస్టిన్ వర్కవుట్ పేరుతో జిమ్, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్, ‘హెవెన్లీ స్పా’ పేరుతో ఓ స్పా, , ‘రన్ వెస్టిన్’ పేరుతో సామూహిక పరుగు కార్యక్రమం వంటి ఎన్నో వినోదాత్మక, మానసిక ప్రశాంతత కల్గించే సౌకర్యాలు వెస్టిన్ హోటల్లో ఉన్నాయి.[1] అంతేకాదు 12,600 చదరపు అడుగుల(1,170 చదరపు మీటర్ల) వైశాల్యంలో విశాలమైన సమావేశ మందరి, ఫంక్షన్ హాల్ కలదు.[4] వీటితో పాటు ఫిల్లర్లులేని రెండు బాల్ రూములు, 12 బ్రేక్ అవుట్ రూములతో పాటు అదనంగా ఓ బిజినెస్ సెంటర్ కూడా ఉంది.[1] ఈ హోటల్ కున్న ప్రత్యేకతల్లో మరో విశేషమిటంటే... రెండో అంతస్తు టెర్రస్ భాగంలో ఓపెన్ స్విమ్మిగ్ పూల్ సౌకర్యం కూడా ఉంది.[3]

వెస్టిన్ చెన్నై హోటల్లో మూడు రెస్టారెంట్లున్నాయి. వాటి పేర్లు ‘ది ఆల్ డే డైనింగ్ సీజనల్ టేస్ట్స్’, ‘పాన్ ఆసియా-ఇ.ఇ.ఎస్.టి.’, ‘ది పూల్ సైడ్ గ్రిల్ అండ్ బార్బేక్యూ’. వీటితో పాటు అదనంగా ది క్రికెట్ థీమ్డ్ లాంజ్ బార్ విలియమ్స్ కూడా ఉంది. హోటల్ యొక్క పై అంతస్థులో వెస్టిన్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ కూడా ఉంది.[1]

వెస్టిన్ చెన్నై హోటల్లో మొత్తం 3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక బార్/లాంజ్ అనేది డ్రింక్స్ కోసం తెరిచి ఉంటుంది. 24 గంటల పాటు గది సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లోని కాఫీ షాప్ లో ఉదయం పూర్తి స్థాయి బ్రేక్ ఫాస్ట్ అందించబడుతుంది. ఇందుకోసం సర్ ఛార్జీ తీసుకుంటారు. వినోదాత్మకమైన కార్యక్రమాలు, అవుట్ డోర్ పూల్, హెల్త్ క్లబ్ ఇందులో ఉన్నాయి. ఈ 5-స్టార్ హోటల్లో 24 గంటల పాటు వ్యాపార కేంద్రం అందుబాటులో ఉండటమే కాకుండా సెక్రటేరియల్ సేవలు, హెల్ప్ డెస్క్, సాంకేతిక సహకారం వంటివి అందిస్తారు. వైర్ లేస్, వైర్ సహాయంతో పనిచేసే హై స్పీడ్ ఇంటర్నెట్ హోటల్ తో పాటు పరిసరాల్లో పబ్లిక్ ఏరియాల్లో ఉంటాయి. వీటిని వినియోగించుకునే వారి నుంచి కూడా సర్ ఛార్జీ వసూలు చేస్తారు.

అందుబాటులో విమానాశ్రయం, దగ్గరలో జాతీయ ఉద్యానవనం, రేస్ కోర్సు, చెన్నై స్నేక్ పార్క్ వంటి సందర్శనీయ ప్రదేశాలెన్నో అందుబాటులో ఉండటం వల్ల వెస్టిన్ చెన్నై హోటల్లో బస చేయడానికి అతిథులు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు హోటల్ సెంట్రల్ కంట్రీయార్డ్ లో 35 అడుగుల ఎత్తైన భారీ జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.[5]

క్లబ్ గది[మార్చు]

హోటల్లోని 420 చదరపు అడుగుల గదుల్లో ఒక కింగ్ బెడ్, రెండు కవల బెడ్లు ఉంటాయి. ఈ గది నుంచి నగర అందాలను, స్విమ్మింగ్ పూల్ దృశ్యాలను చూసే వీలుంటుంది. ఈ గదిలో బస చేసిన వారికి పిల్లో మెనుతో సుఖంగా నిద్రపోయే అవకాశాలుంటాయి. అందమైన బెడ్ షీట్లు, పిల్లో కవర్స్ మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. స్నానాలు చేసేందుకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన స్నానాల గదులు, అందుబాటులో ఇంటర్నెట్ సౌకర్యం, 42- అంగులాల ఎల్.సి.డి. టీవీ వంటి ఎన్నో అధునాతన సౌకర్యాలుంటాయి. ఈ గదికి ముందుబాగంలోని ఫైర్ ప్లేస్ సెద తీరడమే కాకుండా, స్వాగత సౌకర్యాలను ఎంజాయ్ చేసే వీలుంటుంది. మినీబార్, కాఫీ /టీ మేకర్ కూడా గదుల్లోకి సరఫరా చేస్తారు. అదనపు బెడ్లు, కాంప్లిమెంటరీ మంచినీటి సీసాలు కూడా ఇస్తారు.[6]

బయటి లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Westin opens Chennai Velachery property". Business Traveller. Chennai: Business Traveller. 25 February 2013. Retrieved 26 Feb 2013. {{cite news}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. "The Westin Chennai Velachery opens EEST restaurant". HospitalityBizIndia.com. Mumbai: HospitalityBizIndia. 21 November 2013. Archived from the original on 11 డిసెంబర్ 2013. Retrieved 7 Dec 2013. {{cite news}}: Check date values in: |archive-date= (help); Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. 3.0 3.1 "PP Approval - MSB 2012 (January to October)" (pdf). CMDA. 2012. Retrieved 16 Nov 2012. {{cite web}}: Cite has empty unknown parameter: |coauthors= (help)
  4. "Starwood signs agreement for first property in Chennai". Travel Biz Monitor. Mumbai: TravelBizMonitor.com. 25 January 2012. Retrieved 16 Apr 2012. {{cite news}}: Cite has empty unknown parameter: |coauthors= (help)[permanent dead link]
  5. "Westin® Hotels & Resorts Brings Inspired Well Being to Chennai, India with the Opening of the Westin Chennai Velachery". Fort Mill Times. Chennai: Fortmillstimes.com. 25 February 2013. Retrieved 26 Feb 2013. {{cite news}}: Cite has empty unknown parameter: |coauthors= (help)[permanent dead link]
  6. "Westin Chennai Rooms". cleartrip.com.