వెస్పా
| రకం | ఉపసంస్థ |
|---|---|
| పరిశ్రమ | స్కూటర్ |
| స్థాపన | 23 ఏప్రిల్ 1946 ఫ్లోరెన్స్, టస్కనీ |
| స్థాపకుడు | ఎన్రికో పియాజియో |
| ప్రధాన కార్యాలయం | పాంటెడెరా, టస్కనీ , ఇటలీ |
| మాతృ సంస్థ | పియాజియో |
వెస్పా స్కూటర్లు, మోపెడ్లు తయారు చేసే పియాజియో సంస్థకు చెందిన ఇటాలియన్ బ్రాండు. 1946 లో పియాజియో సంస్థ దీన్ని సింగిల్ మోడల్‌గా ప్రారంభించింది. ప్రస్తుతం దీనిని పాంటెడెరా అనే పియాజియో ఉపసంస్థ పలు మోడళ్ళుగా ఉత్పత్తి చేస్తోంది.[1]
దీనిని తయారు చేసినప్పటి నుంచి రంగులు వేసిన స్టీల్ బాడీ, దుమ్ము, గ్రీజు లాంటివి చేరకుండా ఇంజన్ ని కప్పివేసే నిర్మాణం, కాళ్ళు పెట్టుకోవడానికి సమతల నిర్మాణం, గాలి, వానలు తట్టుకునేందుకు వీలుగా ముందు అడ్డంగా ఒక పలకం దీని ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు.
2024 లో పియాజియో సంస్థ 140 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేవలం 140 ప్రత్యేక వెస్పా స్కూటర్లను విడుదల చేసింది.[2]

భారతదేశంలో వెస్పా
[మార్చు]పియాజియో సంస్థ 1960వ దశకంలో భారతదేశంలోని బజాజ్ ఆటో భాగస్వామ్యంతో మొదటిసారిగా వెస్పా స్కూటర్లు ఉత్పత్తి చేసింది. 1971 నాటికి ఈ భాగస్వామ్యం కొనసాగలేదు. బజాజ్ స్వంతంగా వెస్పా ను పోలిన చేతక్ స్కూటర్ ని ఉత్పత్తి చేసింది. 1983 నాటికి పియాజియో సంస్థ అప్పటికే తమకు పెద్ద ఎత్తున విడిభాగాలు సమకూరుస్తున్న ఎమ్‌ఎల్ మోటార్స్‌తో జట్టుకట్టి వెస్పా స్కూటర్లను ఉత్పత్తి చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Piaggio Group Launches Market Expansion Plans". Rider Magazine. Archived from the original on 15 January 2009. Retrieved 2007-09-03.
- ↑ "Vespa Special Edition Introduced To Celebrate Piaggio's 140th Anniversary". Times Now. 18 April 2024. Retrieved 27 April 2024.