వేంకటరాయ కవి
| వేంకటరాయ కవి | |
|---|---|
| జననం | 1830 లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా |
| ప్రసిద్ధి | కవి, నాటక కర్త |
| మతం | హిందూ |
| భార్య / భర్త | పుట్టమ్మ |
| పిల్లలు | నంజుండ రాయడు |
| తండ్రి | వేంకట రమణయ్య |
వేంకటరాయ కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, నాటక కర్త.[1]
జననం, కుటుంబ నేపథ్యం
[మార్చు]వేంకటరాయ కవి 1830లో శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జన్మించాడు. తండ్రి వేంకట రమణయ్య. వీరిది శీర్నాడు కులం, విశ్వామిత్ర గోత్రం. భార్య పుట్టమ్మ, కుమారుడు నంజుండ రాయడు.[2] వేంకట నారాయణ కవి ఇతనికి బావమరిది.
సాహిత్య ప్రస్థానం
[మార్చు]వేంకటరాయ కవి రామాయణంతోపాటు లేపాక్షి కృష్ణ నాటకం, జలక్రీడలు, శివనాటకం, నాట్య ప్రదీపనం వంటి రచనలు చేశాడు.[3]
ఆతను రాసిన లేపాక్షి రామాయణ యక్షగానం 1991లో సి.వి. కృష్ణ బుక్ డిపో 1991 అమ్మర్ కోవిల్ వీడి వాల్ టాక్సు రోడ్డు, మద్రాసు ద్వారా ప్రచురించబడింది. లేపాక్షి చుట్టుపక్కల గ్రామాలలో యువకులు ఈ యక్షగానాలను ప్రదర్శించారు.[2]
లేపాక్షి కృష్ణ నాటకం 1910 జూన్ లో చెన్నపట్టణానికి చెందిన శ్రీ వంకాయల కృష్ణస్వామి శెట్టి అండ్ సన్స్ వారి శ్రీరంగ విలాస ముద్రాక్షర శాలలో ముద్రించబడింది. ఈ ప్రతి ప్రస్తుతం శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల పుస్తక భాండాగారంలో ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
- ↑ కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
- ↑ కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.