Jump to content

వేంకట నారాయణ కవి

వికీపీడియా నుండి
వేంకట నారాయణ కవి
జననం1831
లేపాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా
ప్రసిద్ధికవి, యక్షగాన కర్త
మతంహిందూ
తండ్రికృష్ణప్ప
తల్లివెంకమ్మ

వేంకట నారాయణ కవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, యక్షగాన కర్త.[1]

జననం, కుటుంబ నేపథ్యం

[మార్చు]

వేంకట నారాయణ కవి 1831లో శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో జన్మించాడు. తల్లి వెంకమ్మ, తండ్రి కృష్ణప్ప. వీరిది శీర్నాడు బ్రాహ్మణ కులం.[2]

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

వేంకట నారాయణ కవిని లేపాక్షి వేంకటనారాయణప్ప అని కూడా పిలిచేవారు. లేపాక్షి గ్రామ కరణీకంతోపాటు కవిత్వాన్ని కూడా చేపట్టాడు. బావగారైన శ్రీ వేంకటరాయ కవి రామాయణ యక్షగానం ప్రసిద్ధి చెంది, బహుళ ప్రచారంలోకి రావడంతో, ఆయన కూడా "సంపూర్ణ లేపాక్షి భారతం" అనే నాలుగు రాత్రుల కథను యక్షగానంగా రచించాడు. ఉత్సాహవంతులైన యువకులకు శిక్షణ ఇచ్చి ప్రదర్శింపచేసేవాడు. సంగీత, నృత్యాలలో పాండిత్యం పొంది "తాళ లయబ్రహ్మ" అని పేరుగాంచాడు. ఈ వ్రాత ప్రతి వీరి వంశీకులైన శ్రీ ఎన్.ఎ. నారాయణ రావు, ప్రిన్సిపాల్, ఓరియంటల్ కళాశాల, లేపాక్షి వారి వద్ద ఉంది. వేంకట నారాయణ కవి రుక్మిణీ పరిణయ నాటకం, మాకం తిమ్మయ్య శెట్టి యక్షగానం కూడా రచించాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వెంకట నారాయణ కవికి మగ సంతానం లేకపోవడంతో, మూడవ తమ్ముని కుమారుడైన నాగభూషణప్పలను దత్తత చేసుకున్నాడు. నాగభూషణప్పకు కరణీకం పని వచ్చింది. నాగభూషణప్ప కుమారుడు వేంకట నారాయణప్ప లేపాక్షి సర్పంచ్ గా పనిచేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర మూడవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  3. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.
  4. కల్లూరు అహోబలరావు (1981-08-01). రాయలసీమ రచయితల చరిత్ర-మూడవ సంపుటి.

ఇతర లింకులు

[మార్చు]