వేటూరి సుందరరామ్మూర్తి

వికీపీడియా నుండి
(వేటూరి సుందర్రామ్మూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వేటూరి సుందరరామ్మూర్తి
వేటూరి
జననంవేటూరి సుందరరామ్మూర్తి
(1936-01-29)1936 జనవరి 29
పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా
మరణం2010 మే 22(2010-05-22) (వయసు 74)
హైదరాబాదు
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లువేటూరి
వృత్తిసినీ గీత రచయిత
పాత్రికేయుడు (పూర్వం)
మతంబ్రాహ్మణ హిందూ
భార్య / భర్తసీతామహాలక్ష్మి
పిల్లలుముగ్గురు కుమారులు

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద[1] శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.[2]

జీవిత విశేషాలు

వేటూరి సుందరరామ్మూర్తి 1936జనవరి 29కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు.[3] మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు.[4]

విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గల వేటూరి విగ్రహం

సినీ ప్రస్థానం

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఇలా ఎన్నో సినిమాలు...ఈ సినిమాలలోని అందమయిన అద్బుతమయిన పాటలు!
“పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి.

వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునక.

కళాతపస్వి కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్, ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన, నాదవినోదము....

పుస్తకాలు, ప్రచురణలు

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px
px
px
  • పేరు :కొమ్మ కొమ్మకో సన్నాయీ[5]
  • రచయిత:వేటూరి సుందరరామ్మూర్తి
  • భాష :తెలుగు
  • ప్రచురణ :2007
  • పుటలు : 206
  • ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి చరణ సుమాలుగా అర్పించి అర్చిస్తున్నసారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలే ఈ కొమ్మ కొమ్మకో సన్నాయీ.

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం పాట భాష సినిమా ఇతర వివరాలు
1977 నంది పురస్కారం మానస వీణా మధుగీతం... తెలుగు పంతులమ్మ
1979 నంది పురస్కారం శంకరా నాదశరీరాపరా తెలుగు శంకరాభరణం
1984 నంది పురస్కారం బృందావని ఉంది తెలుగు కాంచనగంగ
1985 నంది పురస్కారం ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో తెలుగు ప్రతిఘటన
1991 నంది పురస్కారం పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం తెలుగు చంటి
1992 నంది పురస్కారం, మనస్విని పురస్కారాలు ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి తెలుగు సుందరకాండ
1994 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే... తెలుగు మాతృదేవోభవ

కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా
హోదా ఇవ్వనందుకు నిరసనగా
అవార్డ్ వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.

1994 మనస్విని పురస్కారాలు వేణువై వచ్చాను భువనానికి తెలుగు మాతృదేవోభవ

మూడు దశాబ్దాల కెరిర్‌లో ఆరు నందులు వేటూరికి దక్కాయి.

సినీ గేయాల పట్టిక

1970వ దశకం

1980వ దశకం

  • మంచు పల్లకి (1982) (పాటలు:మేఘమా దేహమా ఉరమకే ఈ క్షణం)
  • శుభలేఖ (సినిమా) (1982) (పాట: రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా)
  • ఖైదీ (1983)
  • మంత్రిగారి వియ్యంకుడు (1983) (పాటలు: మనసా శిరసా నీ నామమే పాడెద ఈ వేళ, కోకోనట్ మనకు దోస్తీ ఒకటే జాస్తి రా, జబర్దస్తీ చేస్తే నాస్తి రా, ఛీ ఛీపో పాపా ఒప్పులకుప్పా, బెక బెక బావురు కప్ప, కొలువైనాడే ఊరికి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే , ఏమని నీ చెలి పాడెదనూ, సలసలా నను కవ్వించవేల మిలమిలా)
  • మేఘ సందేశం (సినిమా) (1983) (పాటలు: ఆకాశ దేశాన ఆషాఢ మాసాన, పాడనా వాణి కళ్యాణిగా గానం)
  • ముందడుగు (1983 సినిమా) (1983)
  • సితార (సినిమా) (1983) (పాటలు: అర్జున మంత్రం అపురూప, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, కుక్కు కూ .. కుక్కు కూ, జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా, నీ గానం, వెన్నెల్లో గోదారి అందం
  • రుస్తుం (1984)
  • అగ్ని పర్వతం (1985) (పాటలు: అగ్ని పర్వతం, ఈ గాలిలో)
  • అన్వేషణ (1985) (పాటలు: ఎదలో లయ, కీరవాణి, ఏకాంత వేళ, ఇలలో కలసి)
  • కృష్ణ గారడీ (1986) (అన్ని పాటలు)
  • చంటబ్బాయి (1986) (పాటలు: ఉత్తరాన లేవన్నది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం, హరిలో రంగ హరీ, అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను )
  • పడమటి సంధ్యారాగం (1986) (పాట: ఈ తూరుపు ఈ పశ్చిమం)
  • ప్రతిఘటన (1986) (పాటలు: ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, వయసు , హెచ్చరిక ఓ హెచ్చరిక )
  • అనసూయమ్మ గారి అల్లుడు (1986) (అన్ని పాటలు)
  • ఆఖరి పోరాటం (1988) (పాటలు: తెల్ల చీరకు, ఎప్పుడు ఎప్పుడు)
  • మరణ మృదంగం (1988) (పాట: కరిగిపోయాను కర్పూర వీణలా)
  • గీతాంజలి (1989) (పాటలు: జల్లంత కవ్వింత కావాలిలే, నందికొండ వాగుల్లో, జగడ జగడ జగడం, ఓం నమః నయన శృతులకు, ఓ పాపా లాలి, ఆమనీ పాడవే హాయిగా)

1990వ దశకం

  • జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) (పాటలు: అబ్బనీ తియ్యనీ దెబ్బ, మన భారతంలో, అందాలలో అహో మహోదయం, జై చిరంజీవా! జగదేకవీరా!, యమహో నీ యమా యమా అందం, ప్రియతమా, నను పలకరించు ప్రణయమా, ధినక్కుతా కసక్కురో)
  • ఆయుధం (1990) - అన్ని పాటలు
  • చంటి (1991) (పాటలు: పావురానికి పంజరానికి, ఇది తైలం పెట్టి , ఎన్నెన్నో అందాలు , ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే)
  • గ్యాంగ్ లీడర్ (1991) (పాటలు: పాలబుగ్గ , వయసు వయసు )
  • నిర్ణయం (1991) (పాటలు: మిల మిల మెరిసెను తారా)
  • ధర్మ క్షేత్రం (1992) (పాటలు: కొరమీను కోమలం)
  • ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992) (పాటలు:నువ్వు మల్లె తీగ, పరువాల కోడి, మండూరి ఆంబోతు, ఆ వద్దు ఈ వద్దు, ఉమ్మ కావాలి, కందిరీగ నడుము దాని)
  • సుందరకాండ (1992) (పాటలు: ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, కోకిలమ్మ కొత్త పాట పాడిందీ, సుందరాకాండకు సందడే సందడి , ఇంకా ఇంకా, అరె మావ ఇల్లలికి పండగ చేసుకుందామ , ఉలికిపడకు )
  • గోవిందా గోవిందా (1993) (పాటలు: ఓ నవీన, ఇందిర మందిర సుందర తార )
  • మాతృదేవోభవ (1993) (పాటలు: రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వేణువై వచ్చాను భువనానికి , కన్నీటి కాలువలు , రాగం అనురాగం)
  • మెకానిక్ అల్లుడు (1993)
  • సూపర్ పోలీస్ (1994)
  • రాముడొచ్చాడు (1996) (పాటలు: మా పల్లె రేపల్లంట, గుమ్మ గుమ్మ ముద్దు గుమ్మ, వారెవా, గువ్వ కూసె పువ్వు పూసె, శృంగార కావ్యాల )
  • ఇద్దరు (1997),
  • శీను (1997) (పాటలు: ఏమని చెప్పను ప్రేమా .. ఎగిరే చిలకమ్మా , ఏ కొమ్మకాకొమ్మ )
  • రావోయి చందమామ (1999) (పాటలు: నంద నందనా, జగడం జవానీ, స్వప్న వేణువేదో, మల్లెపువ్వా, లేత లేత, లవ్ టు లివ్, ఝుమ్మని ఝుమ్మని)

2000వ దశకం

ఆఖరి సినిమా

వేటూరి పై ప్రముఖుల అభిప్రాయాలు:

  • గానం కోరుకునే గీతం వేటూరి - గాయకుడు కోరుకునే కవి వేటూరి—మంగళంపల్లి బాలమురళీకృష్ణ
  • యాభై సంవత్సరాలు పైబడిన నా సినీ జీవిత ప్రయాణంలో నాకు తారసపడిన మహాకవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కణ్ణదాసన్ ఇంకొకరు వేటూరి- 'రాజన్-నాగేంద్ర'
  • "పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే"—సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • "మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి...”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!" అని చెప్పి వచ్చేశాను". -- సిరివెన్నెల సీతారామశాస్త్రి

  వేటూరి వారిపాటకి
  సాటేదని సరస్వతిని చేరి కోర, నా
  పాటేశ్వరుడికి వుజ్జీ
  వేటూరేనంది నవ్వి వెంకటరమణా!

  • సినీలాకాశంలో ఇంద్రధనుష్పాణి వేటూరి - విఖ్యాత విమర్శకుడు ఎమ్వీయల్

మరణం

75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.

ఇవి కూడా చూడండి

పాటల పూదోట వేటూరి - రంజని తెలుగు సాహితీ సమితి ప్రచురణ

బయటి లింకులు

మూలాలు

  1. ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి తెలుగు సినిమా పాట Archived 2013-12-30 at the Wayback Machine ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి... వేటూరి...జూన్ 21,2008న సేకరించబడినది.
  2. ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010
  3. వార్త దినపత్రిక, తేది 23-05-2010
  4. ఈనాడు దినపత్రిక తేది 23-05-2010
  5. 5.0 5.1 ఏ.వి.కె.ఎఫ్.ఫౌండేషన్ వారి అధికారిక వెబ్సైట్ నుండి వేటూరి సుందరరామ్మూర్తి వారి రచనల పుస్తకాల వివరాలుజూన్ 21,2008న సేకరించబడినది.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు