వేణు (హాస్యనటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేణు
జననం
వేణు ఎల్దండి

(1980-06-02) 1980 జూన్ 2 (వయసు 43)[1]
సిరిసిల్ల
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • వెంకటయ్య (తండ్రి)
  • మాలవ్వ (తల్లి)

వేణు ఒక హాస్యనటుడు, దర్శకుడు.[2] తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో సినీ రంగంలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందం నడిపాడు. 200 పైగా సినిమాల్లో నటించాడు. 2023 లో బలగం అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

వేణు స్వస్థలం తెలంగాణాలోని సిరిసిల్ల. తల్లిదండ్రులకు వేణు తొమ్మిదో సంతానం.[4] వీరు కూరగాయల వ్యాపారం చేసేవారు. వాళ్ళకి ఆ పనుల్లో సాయపడుతూ చదువుకున్నాడు. అదే పనిలో వాగుడుకాయ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని రెండు సార్లు స్టేట్ ఛాంపియన్ కూడా అయ్యాడు. కానీ ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తి కలిగి ఇంటి నుంచి బయటికి వచ్చాడు.[5]

కెరీర్[మార్చు]

ప్రారంభంలో నవకాంత్ అనే రచయిత దగ్గర మూడు నెలలు సహాయకుడిగా పనిచేశాడు. సినిమా రంగంలో ఉన్నవారికి దగ్గరగా ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయని భావించి నటుడు చిత్రం శ్రీను దగ్గర రెండు సంవత్సరాలు సహాయకుడిగా ఉన్నాడు. నటుడిగా ప్రయత్నించడం కోసం అక్కడి నుంచి కూడా బయటికి వచ్చేశాడు. పని లేకపోవడంతో పూట గడవడం కూడా కష్టమైంది. అదే సమయంలో దర్శకుడు తేజ తాను తీస్తున్న జై సినిమా కోసం నూతన నటులను అన్వేషిస్తున్నాడని తెలుసుకుని ఆడిషన్ కి హాజరై అందులో చిన్న పాత్ర చేజిక్కించుకున్నాడు. ఆ తరువాత 2000 దశాబ్దం నుంచి వేణు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు. సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించాడు. కానీ కమర్షియల్ గా అంత గుర్తింపు రాలేదు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో వేణు వండర్స్ అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ సినిమాల మీదనే దృష్టి సారించాడు. తాను పుట్టిన ప్రాంతం, మనుషులు, సంస్కృతి నేపథ్యంలో బలగం సినిమా కథ రాసుకుని తానే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2023 లో విడుదలై మంచి స్పందన లభించింది.[4]

వివాదం[మార్చు]

జబర్దస్త్ కార్యక్రమంలో ఒక ప్రదర్శనలో తమ కులాన్ని అవమానించారంటూ కొంతమంది ఇతని మీద దాడి చేశారు.[6] ఈ దాడిని తెలుగు సినీ నటుల సంఘం ఖండించింది. దాడికి చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులకు రిపోర్టు చేశారు.[7]

సినిమాలు[మార్చు]

  • జై
  • రణం
  • దొంగల బండి
  • మున్నా
  • కంత్రి
  • కత్తి కాంతారావు
  • దరువు
  • దిక్కులు చూడకు రామయ్య
  • సర్దార్ గబ్బర్ సింగ్
  • బాబు బంగారం
  • కిట్టు ఉన్నాడు జాగ్రత్త
  • మహానుభావుడు
  • బలగం

మూలాలు[మార్చు]

  1. "Tollywood Movie Actor Nalla Venu Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2023-03-29.
  2. "Jabardasth 'Venu' arrested". aptoday.com. Archived from the original on 20 మే 2016. Retrieved 5 October 2016.
  3. "బలగం తర్వాత క్లోజ్‌ ఫ్రెండ్స్‌ కూడా అలా పిలవట్లేదు: వేణు". Sakshi. 2023-03-16. Retrieved 2023-03-28.
  4. 4.0 4.1 "Venu Tillu: కొత్తగా ఉంది.. ఆ గౌరవం". EENADU. Retrieved 2023-03-28.
  5. "Venu: అలా అనుకొనే వారికి సమాధానమే 'బలగం'..: వేణు యెల్దండి". EENADU. Retrieved 2024-02-05.
  6. "Telugu TV actor Venu of Jabardasth fame attacked in Hyderabad". deccanchronicle.com. వెంకట్రామి రెడ్డి. Retrieved 5 October 2016.
  7. "'నవ్విస్తున్న మమ్మల్ని కొట్టడం అమానుషం'". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 5 October 2016.