వేతనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక నియత కాలానికి యజమాని, తన ఉద్యోగికి చెల్లించే మొత్తమే వేతనం . దీనిని ఉద్యోగ ఒప్పందంలో స్పష్టం చేస్తారు. ఇది కూలీకి వ్యతిరేకంగా ఉంటుంది. కూలీలో నియమిత కాలానికంతటికీ కాకుండా, ప్రతీ పనికీ గంటలు లేదా ఇతర యూనిట్ల లెక్కన విడిగా లెక్కించి చెల్లిస్తారు.

వ్యాపార దృష్టిననుసరించి, వేతనం అనేది మానవ వనరులను కలిగివున్నందుకు, వారితో కార్యకలాపాలను నిర్వహించినందుకుగాను వారికి వ్యక్తిగతంగా చెల్లించవలసిన ఖరీదు లేదా వేతన ఖరీదు. పద్దుల నిర్వహణలో వేతనాన్ని చెల్లింపుల జాబితా పద్దు కింద నమోదు చేస్తారు.

చరిత్ర[మార్చు]

మొదటి వేతన చెల్లింపు[మార్చు]

తొలుత పనులకు చెల్లింపులు ఉండేవి కావు. మొట్టమొదటి వేతనపని ఉనికిలోనికి రావడానికి కనీసం వస్తుమార్పిడి పద్ధతి ఏర్పడి, వస్తువులకు, పనినిగానీ; లేదా వస్తువులకు, వస్తువులుగానీ మారకంగా అంగీకరించగలిగిన స్థితికి మానవ సమాజం అభివృద్ధి చెందివుండాలి. ముఖ్యంగా వ్యవస్థీకృతమైన యాజమాన్యం ఉనికిలో ఉన్నప్పుడే - బహుశా అది ఒక ప్రభుత్వం లేదా మతపరమైన సంస్థ అయివుండొచ్చు - అది పనికి కిరాయిని మారకంగా ఇస్తూ, కనీస నిరంతర ప్రాతిపదిక క్రింద ఆ పనులను నిర్వహించగలుగుతుంది. దీనిని అనుసరించి మొదటి వేతనం కొత్తరాతి విప్లవ కాలంలో ఒక గ్రామంలో గానీ, పట్టణంలోగానీ క్రీస్తుకు పూర్వం 10,000 నుండి 6,000 సంవత్సరాల మధ్యకాలంలో చెల్లించి ఉండవచ్చు.

క్రీస్తుకు పూర్వం 3100 నాటి మట్టి పలకలపై క్యూనీఫామ్ లిపిలో రాసిన రాతలలో మెసపటోమియా లోని శ్రామికులకు దిన బత్తెం కింద బీర్‌‌ను అందించినట్లుగా నమోదై ఉంది. ఈ బీర్‌ను కూసుగావున్న పీఠాన్ని కలిగి నిటారుగావున్న జాడీతో సూచించారు. దిన బత్తేన్ని గిన్నెలో తింటున్న మనిషి తల గుర్తుతో సూచించారు. గుండ్రంగానూ అర్థవృత్తంగానూ గీయబడిన గుర్తులు కొలతలకు సూచికలు.[1]

హిబ్రూ ఎజ్రా పుస్తక ( క్రీస్తు పూర్వం 550 నుంచి 450 వరకు) కాలంలో ఒక వ్యక్తి నుంచి ఉప్పును తీసుకోవడమనేది జీవనాధారానికీ, ప్రతిఫలం తీసుకోవడానికీ, లేదా ఆ వ్యక్తియొక్క సేవలలో నిమగ్నుడై ఉన్నాడనడానికి సమాన అర్థంలో వాడబడింది. ఆ కాలంలో ఉప్పుతయారీని రాజరికం లేదా ఉన్నతపాలక శ్రేణి చాలా కట్టుదిట్టంగా నియంత్రిస్తూ ఉండేది. ఎజ్రా 414 అనువాదాన్ని అనుసరించి పర్షియా రాజైన ఆర్టాక్సెర్క్స్ సేవకులు తమ విధేయతకు కారణాన్నిఇలా అనేక రకాలుగా వివరించారు. మేము రాజమందిరం ఉప్పు తింటున్నాము. లేదా మేము ఆయన నుండి జీవనాధారాన్ని పొందుతున్నాము, లేదా మేము రాజుకు పూచీ పడివున్నాము కాబట్టి మేము రాజుకు విధేయులమై ఉన్నాము.'

రోమన్ పదం శాలరియమ్[మార్చు]

అలాగే రోమన్ పదం శాలరియమ్ ఉద్యోగంతో, ఉప్పుతో, సైనికులతో ముడిపడివుంది. ఐతే దాని కచ్చితమైన అర్థం ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. చాలామంది ఆమోదించిన సిద్ధాంతం ప్రకారం సోల్జర్ అనే పదం లాటిన్ మాతృక అయిన సాల్ డేర్ (ఉప్పు ఇవ్వడం) నుంచి వచ్చింది. దీనితోపాటుగా రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన నాచురల్ హిస్టరీలో విడిగా సముద్రపు నీటిని గురించి చర్చించాడు. దానిలో, రోమ్‌లో సైనికులకు వాస్తవికంగా చెల్లించే మొత్తం ఉప్పేననీ, దానినుంచే వేతనం అనే పదం ఆవిర్భవించిందని ఆయన అంటాడు.." ప్లినియస్ నాచురలిస్ హిస్టోరియాXXXI. ఇతరుల అభిప్రాయం ప్రకారం, సోల్జర్ అనే పదం గోల్డ్ సోలిడస్ నుంచి వచ్చింది. ఇది సైనికులకు చేసిన చెల్లింపు అయి ఉండాలి. సలారియమ్ అనేది ఉప్పును కొనుగోలు చేయడానికి ఇచ్చే ప్రత్యేక బత్తెం అయివుండాలి. లేదా ఉప్పు నిల్వలను జయించినందుకు సైనికులకు ఇచ్చే కిరాయి, మరియు శాలరియమ్ మీదుగా రోమ్‌కు చేరే ఉప్పు మార్గాల కాపలా కాసినందుకుగాను చేసిన చెల్లింపులై ఉండవచ్చు.

రోమ్ సామ్రాజ్యకాలం, మధ్యయుగం, ఐరోపా పారిశ్రామికీకరణ పూర్వ యూరప్‌లో చెల్లింపులు[మార్చు]

రోమన్ సైనికులకు చేసిన చెల్లింపు అయిన శాలరియమ్ ‌కు సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు. అయినా అది పాశ్చాత్య ప్రపంచంలో పనికి చెల్లించే కిరాయి అనే అర్థంలో స్థిరపడి, ఒకరికి రుణపడి ఉండడం అనే వాడుకకు దోహదపడింది.

రోమ్ సామ్రాజ్యంలోగానీ, (ఆ తర్వాతదైన) మధ్య యుగ కాలంలో గానీ, పూర్వ పారిశ్రామిక ఐరోపాలోగానీ, దానికి సంబంధించిన వర్తక వలసలలోగానీ వేతనం తీసుకొని పనిచేసే ఉద్యోగులు చాలా తక్కువ. ఇది ఉన్నత స్థాయిలో, ప్రత్యేకించి ప్రభుత్వ సేవలలో ఉన్న కొందరికి మాత్రమే పరిమితమైవుంది. ఆ కాలంలో ఆయా సేవలకుగాను నివాస వసతిని కల్పించడం, వారి విధులను సూచించే ప్రత్యేకమైన దుస్తులను అందించడం, డబ్బును ముట్టచెప్పడం వంటివి కూడా పారితోషికాలుగా ఉండేవి. చాలా దేశాల్లో, వాలెట్స్ డీ చాంబ్రే మధ్యయుగ అంత్య కాలపు ఆస్థానాలలో వార్షిక చెల్లింపులు ఉండేవి. కొన్నిసార్లు వీటితో పాటుగా ఊహింపజాలని అదనపు మొత్తాలనుకూడా చెల్లించేవారు. దీనికి మరోవైపు, చాలా రకాల ఉద్యోగాలకు వేతనముతో పోల్చదగిన చెల్లింపులేవీ ఉండేవి కావు. బానిసత్వం లోకానీ (చాలామంది బానిసలకు డబ్బును ఎంతో కొంత ముట్ట జెప్పేవారు), అర్థబానిసత్వం లోకానీ, పరస్పరం ఒడంబడిక చేసుకొని చేసే సేవ లలో కానీ దిగుబడి పంపకం లాంటి, ఉత్పత్తిలో కొంత భాగాన్ని పంచి ఇచ్చే పద్ధతులు మాత్రమే ఉండేవి. ఇది ఇలా ఉంటే తమకుతాము ఉద్యోగాలను కల్పించుకునే, లేదా పరస్పరం సహాయం చేసుకునే చేతివృత్తినిపుణుల సహకారసంఘాల యజమానులు, తమతో కలిసి పనిచేసే సహాయకులకు తరుచుగా జీతాలిచ్చే పద్ధతి ఉండేది. మధ్యయుగ విశ్వవిద్యాలయాలు మఠాలు వంటివానిలో కూడా ఇదే పద్ధతి ఉండేది. ఈ సహకార సంఘాల నిర్వాహకులు ఏక కాలంలో పనిచేసే శ్రామికులుగానూ, యజమానులుగానూ ఉండేవారు.

వాణిజ్య విప్లవకాలంలో చెల్లింపులు[మార్చు]

వాణిజ్య విప్లవ కాలం 1520-1620 మధ్య కాలంలో కానీ, 18, 19శతాబ్దాలలో జరిగిన పారిశ్రామీకరణ వల్ల కానీ పుట్టుకొచ్చిన ఉద్యోగాలలో వేతనాలు ఉండేవికాదు. వాటికి కేవలం గంటలు లేదా రోజువారీ లేదా ఉత్పత్తి అయిన యూనిట్ల లెక్కన కూలీ చెల్లించేవారు (దీనినే విభాగీకరింపబడిన పని అని కూడా అంటారు).

ఆర్జనలో భాగాన్ని చెల్లింపుగా పొందడం[మార్చు]

ఈ కాలంలో అనేక ఈస్ట్ ఇండియా కంపెనీలు, చాలామంది మేనేజర్లకు తమ సంస్థలలో పనిచేసినందుకుగాను పారితోషికంగా యాజమాన్య భాగస్వామ్యాన్ని ఇచ్చాయి. ఇలాంటి విధానమే పద్దుల నిర్వహణ, పెట్టుబడులు, న్యాయస్థానానికి సంబంధించిన లావాదేవీలలో భాగస్వామ్యం వంటి వాటిలోనూ పారితోషికంగా కొనసాగుతున్నది. వృత్తి సంబంధ నిపుణులకు భాగాన్ని పంచి ఇచ్చే ఈ విధానంలో, సాంకేతికంగా వీరు వేతనం తీసుకోకున్నప్పటికీ, తమకు చెందవలసిన భాగం నుండి వార్షిక ఆదాయాన్ని పొందుతున్నారు.

రెండవ పారిశ్రామిక విప్లవం మరియు వేతనంతో కూడిన చెల్లింపులు.[మార్చు]

1870 నుండి 1930 వరకూ జరిగిన రెండవ పారిశ్రామిక విప్లవం రైలు మార్గాలు, విద్యుత్, టెలిగ్రాఫ్, టెలిఫోన్ వంటివాటిని ఆధారంగా చేసుకుని, అధునాతన వాణిజ్య సంస్థ ఆవిర్భావానికి దోహదపడింది. ఈ యుగంలోనే వేతనాన్ని తీసుకునే తరగతికి చెందిన కార్యనిర్వాహకులు, పాలనా నిర్వాహకులు విస్తృతంగా ఆవిర్భవించారు. వారు అప్పుడే ఆవిర్భవించివున్ననూతన, భారీ స్థాయి వాణిజ్య సంస్థలకు తమ సేవలను అందించారు.

కొత్తగా ఏర్పడిన నిర్వాహక సంబంధిత ఉద్యోగాలు వారిని వేతన ఉద్యోగులుగా మార్చాయి. కార్యాలయాలలో జరిగే పనిని గంటల వారిగా లెక్కవేయడం కష్టం. అంతేకాకుండా వారికి పారితోషికంగా భాగస్వామ్యాన్ని కల్పించే అవసరం లేకపోవడం కూడా ఈ మార్పుకు దోహదపడింది.

20 శతాబ్దంలో వేగంగా పారిశ్రామికీకరణ చెందిన జపాన్‌కు కార్యలయ పని అనేది నూతన భావన, అక్కడ పనిచేసే ఉద్యోగులను, వారికి ఇస్తున్న పారితోషికంతో ముడివేసి (వేతనజీవులనే) కొత్త పదంతో పిలుస్తున్నారు.

20 శతాబ్దంలో వేతనయుత ఉద్యోగాలు.[మార్చు]

20 శతాబ్దంలో సేవలతో కూడిన ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందడం వలన అభివృద్ధిచెందిన దేశాలలో వేతనంతో కూడిన ఉద్యోగాలు సాధారణమయ్యాయి.. దీనికి మరొక వైపు పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన ఉద్యోగాలు అంతకంతకూ తగ్గిపోయాయి. కార్యనిర్వహణ, పాలనా నిర్వహణ, కంప్యూటర్, మార్కెటింగ్, సృజనాత్మకతతో ముడిపడిన ఉద్యోగాలు వేతనంతో కూడినవిగా మారిపోయాయి. ఈ మార్పు బాగా ఎక్కువయింది.

ప్రస్తుత కాలంలో వేతనాలు, ఇతర రూపాలలో చెల్లింపులు[మార్చు]

ఈ రోజు వేతనం అనే భావన ఉద్యోగికి యజమాని ఇచ్చే అన్ని రకాల పారితోషకాల మొత్తంగా మారిపోయింది. వేతనం (ఇప్పుడు స్థిర చెల్లింపుగా దీన్ని పిలుస్తున్నారు) బోనస్, ప్రోత్సాహకాలు, కమిషన్లు వంటి వాటన్నిటి సమహారంగా మారుతున్నది) దీనిలో అతని సఫలతను మెచ్చుకుంటూ ఉద్యోగికి ఇచ్చిన ప్రోత్సాహకాలు, సంప్రదాయ ప్రోత్సాహకాలు ( లేదా ఇనాము) వంటివన్ని కలసి ఉంటాయి.

యు.ఎస్‌.లో వేతనాలు[మార్చు]

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నియత వేతనాలకు (పని గంటలతో నిమిత్తం లేకుండా చేసే చెల్లింపులు), గంటలవారీ కూలీకి (అదనపు పని గంట లకు వీలు కల్పించే కనీస కూలి పరీక్షననుసరించి) తేడాను మొదటిసారిగా 1938లో ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ నిబద్ధం చేసింది. ఈ చట్టం, కనీస వేతనం, అదనపు పనిగంటల సంరక్షణలనుండి మినహాయింపబడిన ఐదు తరగతుల ఉద్యోగులను గుర్తించింది. 1991లో కొంతమంది కంప్యూటర్ శ్రామికులను ఉన్న వాటికి అదనంగా ఆరవ తరగతి కింద చేర్చారు. కానీ 2004 ఆగస్టు 23 లో జరిగిన సవరింపులలో తిరిగి ఐదు తరగతుల (కార్యనిర్వాహకులు, వృత్తి నిపుణులు, కంఫ్యూటర్, బయట పని చేసే అమ్మకపు ఉద్యోగులు) కింద కుదించారు. వేతనాన్ని సాంవత్సరిక ప్రాతిపదికన నిర్ణయిస్తారు.

ఎఫ్ఎల్ఎస్ఏ అమెరికాలోని యజమానులను, పనిగంటలకు కనీస వేతనాలని ఇవ్వాలనీ, అదనపు పనిగంటలకు వెంటనే చెల్లింపులు జరగాలనీ, వారానికీ 40 పనిగంటలకు మించినట్లయితే, మామూలుగా ఇస్తున్నదానికి ఒకటిన్నర రెట్లు చొప్పున చెల్లించాలని కోరుతున్నది.

సెక్షన్ 13 (a) (1) ని అనుసరించి ఎఫ్ఎల్ఎస్ఏ, ధ్రువీకరింపబడిన, కార్యనిర్వహణ, పాలనా నిర్వహణ, వృత్తినిపుణులు, బయట అమ్మకాలు జరిపే ఉద్యోగులను కనీస వేతనం, అదనపు పనిగంటల రక్షణ నుండి మినహాయించింది. సెక్షన్ 13 (a) (1) మరియు 13 (a) (17) కొందరు కంప్యూటర్ రంగ ఉద్యోగులను కూడా మినహాయించింది. ఈ రకమైన మినహాయింపులను పొందడానికి ఉద్యోగులు తప్పనిసరిగా వారి విధులకు సంబంధించిన పరీక్షలలో నెగ్గాలి. అంతేకాక వారానికి 455 డాలర్లకు తగ్గకుండా వేతనాన్ని తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగాల పేర్లు వాటి స్థాయిని తప్ప మరి దేనినీ సూచించరాదు. ఈ రకంగా మినహాయింపులను పొందాలని దరఖాస్తు చేయాలంటే ఆ ఉద్యోగి విధులు, వేతనం ఆయా శాఖల నిబంధనల కనుగుణంగా ఉండాలి.[2]

ఈ ఐదు తరగతులలోనూ కంప్యూటర్ ఉద్యోగులకు మాత్రమే గంటల ప్రకారమైన కూలీ (గంటకు 27.63 డాలర్లు) తీసుకునేందుకు మినహాయింపు ఉంది. బయట పనిచేసే అమ్మకపు ఉద్యోగులకు కనీస వేతన (455 డాలర్లు వారానికి) పరీక్ష అవసరం లేదు. అలాగే వృత్తి నిపుణులకు సంబంధించిన కొన్ని ఉపతరగతులకు చెందిన ఉద్యోగులకు కూడా ఇది అవసరం లేదు.

నియమిత వేతనాలకు, గంటలవారీ కూలీకి మధ్య తేడాను పోల్చడానికి వారానికి 40 గంటలు, సంవత్సరానికి 50 పనివారాలు అనే ప్రామాణికంపై ఆధారపడతారు (రెండు వారాలను సెలవు కాలంగా పరిగణిస్తారు). (ఉదాహరణకు 40,000 డాలర్ల వార్షిక వేతనాన్ని 50 వారాల లెక్కన వారానికి 800 డాలర్లుగా విభజిస్తారు. 800 డాలర్లును 40 ప్రామాణిక పనిగంటలకుగాను గంటకు 20 డాలర్ల చొప్పున విభజిస్తారు). మధ్యస్తంగా ఉండే గృహ ఆదాయం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2006, 2007 సంవత్సరాలలో 1.3శాతం పెరిగి 50,233 డాలర్లు చేరుకున్నట్లుగా అమెరికా జనాభా లెక్కల నివేదిక ద్వారా తెలుస్తున్నది. వారి ఆదాయం పెరగడం ఇది మూడవసారి.

జపాన్‌లోని వేతనాలు[మార్చు]

జపాన్‌లో ఉద్యోగుల వేతనాల పెంపును గురించి వారి యాజమానులు జీరీ ద్వారా తెలియజేస్తారు". ఇప్పటికీ ఇలానే చేస్తున్నప్పటికీ దీని స్థానాన్ని పెద్ద కంపెనీలలో ఎలక్ట్రానిక్ రూపం లేదా ఈ మెయిల్ ఆక్రమించింది.

ఇండియాలో వేతనాలు[మార్చు]

భారతదేశంలో వేతనాలను సాధారణంగా మాసాంతపు పనిదినాన చెల్లిస్తారు (ప్రభుత్వ, పబ్లిక్ రంగంలోని శాఖలు, బహుళ జాతి సంస్థలు, ఇంకా ప్రైవేట్ రంగంలోని శాఖలు). చాలా కంపెనీలు నెల పూర్తయ్యాక చెల్లిస్తాయి. ఇది ప్రతీ నెలా ఐదవ రోజున ఉంటుంది. కొన్ని కంపెనీలలో ఆ తర్వాత కూడా చెలిస్తుంటారు. గోద్రేజ్ గ్రూప్ కంపెనీలలో వేతనాన్ని తదుపరి నెలలో తొమ్మిదవ రోజున చెల్లిస్తారు. 9 సెలవుదినం అయినట్లయితే, 10న చెల్లిస్తారు, 9, 10 రెండూ కూడా సెలవులే అయినట్లయితే 8న చెల్లిస్తారు.

భారతదేశంలో కనీసవేతనాలను 1948 కనీస వేతన చట్టాన్ని అనుసరించి ఇస్తారు. దీనికి సంబంధించిన వివరాలను httplabourbureau.nic.inwagetab.htm వెబ్‌‍‌సైట్ లో చూడవచ్చు. వేతనాలపెంపుకు సంబంధించిన సమాచారాన్ని హార్డుకాపీల ద్వారా వారికి తెలియజేస్తారు[ఉల్లేఖన అవసరం].

వీటిని కూడా చూడండి[మార్చు]

  • కార్యనిర్వాహక ప్రతిఫలం
  • ఒక దేశానికి సరాసరి వేతనముల జాబితా
  • సింగిల్ డిజిట్ వేతనాలు సంపాదించే వారి జాబితా
  • అతి పెద్ద క్రీడా ఒప్పందాల జాబితా
  • వేతన జీవులు (జపాన్)
  • అత్యధికంగా సంపాదించే సంవత్సరాలు

సూచనలు[మార్చు]

  1. Early writing tablet recording the allocation of beer, British Museum. "BBC History of the World in 100 Objects". Retrieved 2010 - 11 - 11. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
  2. http://www.dol.gov/whd/regs/compliance/fairpay/main.htm Archived 2012-05-26 at the Wayback Machine. DOL'యొక్క ఫెయిర్ పే ఓవర్‌టైమ్ ఇనిషియేటివ్

మూస:Employment

"https://te.wikipedia.org/w/index.php?title=వేతనం&oldid=2813238" నుండి వెలికితీశారు