వేమన జ్ఞానమార్గ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేమన జ్ఞానమార్గ అనేది వేమన రచించిన 3002 పద్యముల సంకలనము. దీనిని ముత్యాల నారసింహ యోగి సమకూర్చెను. అప్పటికి విడుదలైన అన్నింటి కన్నా ఎక్కువగా 3002 వేమన పద్యాలను ఈతడు కూర్చెను. విద్వాన్ పి.సి.మునుస్వామి గారు దీనికి ఆముఖము రచించిరి. ఇది 1958 సంవత్సరంలో మదరాసులోని సి.వి.కృష్ణా బుక్ డిపో వారు ముద్రించారు. ముందుగా వేమనయోగి జీవిత చరిత్రమును విపులముగా తెలిపెను. పద్యాలన్నింటిని ఆకారాదిగా సమకూర్చుట వలన సులభంగా పద్యాలను వెతకుటకు కష్టపడనవసరము లేదు.