వేములవాడ రెవెన్యూ డివిజను
వేములవాడ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల |
వేములవాడ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. రాజన్న జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం వేములవాడలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం, వేములవాడ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
[మార్చు]వేములవాడ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | వేములవాడ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | వేములవాడ మండలం | 8 రెవెన్యూ గ్రామాలు |
2 | వేములవాడ గ్రామీణ మండలం | 15 రెవెన్యూ గ్రామాలు |
3 | చందుర్తి మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
4 | బోయినపల్లి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
5 | కోనరావుపేట మండలం | 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
6 | రుద్రంగి మండలం | 2 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-14.
- ↑ "Revenue Division | Rajanna Sircilla | India". www.rajannasircilla.telangana.gov.in. Archived from the original on 2022-01-30. Retrieved 2022-04-14.
- ↑ "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-04-14.