Jump to content

వేముల శ్రీనివాసులు

వికీపీడియా నుండి

వేముల శ్రీనివాసులు, తెలంగాణా ముఖ్యమంత్రి కార్యాలయం అనుముల రేవంత్ రెడ్డి వద్ద 2024 జనవరి 4 నుండి ఓ యస్ డీ గా పనిచేస్తున్నారు. [1]news|url=https://www.dishadaily.com/telangana/vemula-srinivasulu-as-cm-osd-285811|title=సీఎం[permanent dead link] ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు|last=Nagaiah|first=Bhoopathi|date=2024-01-03|access-date=2026-01-20|language=te-IN}}</ref> హన్మకొండ జిల్లా, భీమదేవర పల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసులు ముల్కనూరులో తన చిన్ననాటి స్నేహితులతో కలిసి గ్రంథాలయం నెలకొల్పారు. ఈ గ్రంథాలయం నుండి పేద విద్యార్థులు పుస్తక పఠనంతో తమ విజ్ఞానాన్ని పెంచుకుంటూ, పోటీ పరీక్షలలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుంది. ఈ గ్రంథాలయంలో ఎప్పటికప్పుడు నూతన పోటీ పరీక్షల పుస్తకాలతో పాటుగా, కంప్యూటర్లను విద్యార్దుల అభ్యాసం నిమిత్తం ఏర్పాటు చేసారు. ఈ పదవిలో అతను 2024 జనవరిలో నియమితులు అయ్యారు [2][3]

బాల్యం

[మార్చు]

ఇతను జననం వరంగల్ నగరంలో జన్మించాడు ప్రస్తుతం ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివసిస్తున్నారు తల్లి అనసూయ తండ్రి చలమయ్య. ఇతను తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి పిల్లలతో తల్లిగారి స్వగ్రామం భీమదేవర మండలం, ములకనూరుకు వెళ్ళి కిరాణం దుకాణం పెట్టుకుని కష్టపడి పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించింది. శ్రీనివాసులు పది వరకు ముల్కనూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. భార్య: అరుణ, గృహిణి. ఇద్దరు అబ్బాయిలు

జీవిత విశేషాలు

[మార్చు]

వరంగల్, హైదరాబాద్ లో ఉన్నత విద్య పూర్తి చేసి, ఎల్ ఎల్ బీ చేసి లా పట్టా కూడా పుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి క్రమశిక్షణతో, నిబద్ధతతో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన పనితనం, నిజాయితీని గుర్తించిన ప్రభుత్వం అతనిని తెలంగాణా ముఖ్యమంత్రి ఓ యస్ డీ గా నియమించింది.Revanth Picks Clean Trio' for CMO in Bureaucrat RejigDeccan Chronicle

ప్రస్తుత విధులు

[మార్చు]

అతను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి, ప్రజల సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విద్యా సంస్థల పెండింగ్ బిల్లుల సమీక్ష వంటి కీలక అంశాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రవృత్తి

[మార్చు]

సాహిత్యోపాసకుడు. సాహితీ పోషకుడు. ములకనూరు సాహితీ పీఠాన్ని తన చిన్ననాటి స్నేహితులతో కలిసి స్థాపించి, స్వంత డబ్బులను వెచ్చించి ప్రతి ఏటా నమస్తే తెలంగాణా వారితో కల్సి కథల పోటీ నిర్వహించి పెద్ద ఎత్తున బహుమతుల నిచ్చి రచయితలను ప్రోత్సహిస్తున్నారు. గ్రంథాలయం లో కూడా ప్రతీ ఏటా విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి వారిలో దాగిన ప్రతిభను వెలికి తీస్తున్నారు, బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.

ఈ గ్రంథాలయంలో చదువుకుని 20 మందికి పైగా విద్యార్థులు కానిస్టేబిల్స్ గా ఎన్నికైనట్లు తెలుస్తుంది. చాలా మంది విద్యార్థులు రకరకాల రంగాలలో ఉద్యోగాలు పొందారు. కంప్యుటర్, పుస్తకాలు, పత్రికలు, పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఇలా విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని వెంటనే సమకూర్చి వారికి తోడ్పాటు అందించడంలో ఈ గ్రంథాలయం ఎప్పుడు ముందు వరసలో ఉంటుంది. ఈ సమాజ సేవను, గ్రంథాలయ సేవలను గుర్తించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (ప్రస్తుతం సురవరం ప్రతాప రెడ్డి విశ్వా విద్యాలయం) ఉత్తమ గ్రంథాలయం క్రింద ములకనూరును గుర్తించి, వ్యవస్థాపకులైన వేముల శ్రీనివాసులుకు కీర్తి పురస్కారాన్ని అందజేశారు.[citation needed]

మూలాలు

[మార్చు]
  1. krishna (2024-01-04). "సిఎం ఓఎస్‌డిగా శ్రీనివాసులు". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-20.
  2. "వేముల శ్రీనివాసులు ఓ యస్ డీ గా నియామకం -". EENAADU. 2026-01-10.
  3. "Telangana Secretariat – Official Department Contacts". Telangana State Portal (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-20.