వేయిలింగాల కోన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీకాళహస్తి నుంచి వేయిలింగాలకోనకు వెళ్ళేదారి

వేయిలింగాల కోన ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తికి సమీపంలోని ఒక దేవాలయం, ఒక చిన్న జలపాతం.[1][2] ఈ ఆలయంలో ఒకే శివలింగంపై చెక్కిన వేయి లింగాలను గమనించవచ్చు. ఈ మూర్తిని యక్షేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ ఆలయం తిరుపతి నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోనూ, శ్రీకాళహస్తి ఆలయం నుంచి సుమారు పదికిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ముందుగా ఆటోలు, బస్సులు లేదా స్వంత వాహనాల్లో రామాపురం గ్రామాన్ని చేరుకోవాలి. ఆ గ్రామాన్ని దాటిన తర్వాత ఒక కొండను ఎక్కి దిగి మరల కొండ ఎక్కితే ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం పక్కనే ఓ జలపాతం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి మహాశివరాత్రి పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు.

ఇక్కడి జలపాతంలోని నీళ్ళకు అనారోగ్యాల్ని, ముఖ్యంగా చర్మ వ్యాధులను నయం చేసే గుణముందని సందర్శకుల విశ్వాసం.[3] కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు ఎక్కువమంది జలపాతంలో స్నానం చేయడం ఆనవాయితీ. వర్షాకాలంలోనూ, దాని తరువాత కొద్ది నెలలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన సమయం.[4]

మూలాలు[మార్చు]

  1. "సన్నిదానం వెబ్ సైటులో శ్రీకాళహస్తి గురించిన సమాచారం". sannidanam.com. Retrieved 12 October 2016.[permanent dead link]
  2. "శ్రీకాళహస్తిలో చూడతగిన స్థలాలు". nativeplanet.com. Archived from the original on 10 అక్టోబరు 2016. Retrieved 12 October 2016.
  3. "వేయిలింగాల కోన జలపాతం శ్రీకాళహస్తి". templesinindiainfo.com. Archived from the original on 18 మార్చి 2017. Retrieved 12 October 2016.
  4. "వేయిలింగాల కోన, శ్రీకాళహస్తి". gotirupati.com. Archived from the original on 17 మే 2015. Retrieved 12 October 2016.

బయటి లింకులు[మార్చు]