వేర్ ఈజ్ విద్యా బాలన్
స్వరూపం
వేర్ ఈజ్ విద్యా బాలన్ | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాస్ గుత్తుల |
నిర్మాత | ఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి ఎల్.వేణుగోపాల్ రెడ్డి పి. లక్ష్మి నరసింహ రెడ్డి ఆలూరు చిరంజీవి |
తారాగణం | ప్రిన్స్ సిసిల్ జ్యోతి సేథి సంపూర్ణేష్ బాబు |
ఛాయాగ్రహణం | చిట్టి బాబు కె. |
సంగీతం | కమ్రాన్ అహ్మద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 26 June 2015 |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వేర్ ఈజ్ విద్యా బాలన్ 2015లో విడుదలైన సినిమా. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్.వేణుగోపాల్ రెడ్డి, పి. లక్ష్మి నరసింహ రెడ్డి, ఆలూరు చిరంజీవి నిర్మించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గుత్తుల దర్శకత్వం వహించగా ప్రిన్స్ సిసిల్, జ్యోతి సేథి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూన్ 26న విడుదలైంది.[1]
కథ
[మార్చు]కిరణ్( ప్రిన్స్) పిజ్జా సెంటర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. డాక్టర్ స్వాతి (జ్యోతి సేథ్)తో ప్రేమలో పడతాడు. స్వాతి బంధువు వాల్తేర్ వాసు (మధునందన్) వీరిని విడగొట్టాలని చూస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరూ విద్యాబాలన్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు వెనుక మంత్రి పులి నాయుడు (జయప్రకాష్ రెడ్డి), డాన్ గంటా (సంపూర్ణేష్ బాబు) ఉంటారు. ఆ కేసు నుంచి కిరణ్, వాల్తేర్ వాసు ఎలా బయిటపడ్డారు? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- కిరణ్ గా ప్రిన్స్
- స్వాతిగా జ్యోతి సేథి[3]
- వాసుగా మధునందన్
- మంత్రి పులి నాయుడుగా జయప్రకాశ్ రెడ్డి
- డాక్టర్ హర్షగా రావు రమేష్
- గంటాగా సంపూర్ణేష్ బాబు
- పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆశిష్ విద్యార్థి
- వాసు గ్యాంగ్మేట్గా సుడిగాలి సుధీర్
- కిరణ్ గ్యాంగ్ మేట్‌గా గెటప్ శ్రీను
- డాక్టర్‌గా రవిప్రకాష్
- శ్రీనుగా కారుమంచి రఘు
- తాగుబోతు రమేష్
- సప్తగిరి
- ప్రభాస్ శ్రీను
- శంకర్ మెల్కోటే
- రవివర్మ అడ్డూరి
మూలాలు
[మార్చు]- ↑ "Where Is Vidya Balan?A". The Times of India. 2015. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "Where is Vidya Balan: Nothing to do with Vidya" (in Indian English). The Hindu. 26 June 2015. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
- ↑ "Telugu industry has given me a warm welcome: Jyotii Sethi". The Indian Express. 2025-02-13. Archived from the original on 19 January 2025.