వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
(వైజర్స్‌ బాలసుబ్రహ్మణ్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వైజర్సు బాలసుబ్రహ్మణ్యం
వైజర్సు బాలసుబ్రహ్మణ్యం
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరువైజర్సు బాలసుబ్రహ్మణ్యం
జననం (1971-05-04) 1971 మే 4 (వయసు 52)
తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ
వృత్తిసంగీతకారుడు, రచయిత
క్రియాశీల కాలం1996 నుండి

వైజర్సు బాలసుబ్రహ్మణ్యం సుప్రసిద్ధ కర్ణాటక సంగీతకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన మే 4 1971న తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడలో జానకి, శేషగిరిరావు దంపతులకు జన్మించారు.ప్రాథమిక విద్య కాకినాడలోనూ, ఉన్నత విద్య తిరుపతిలోనూ సాగింది. ఆయన సంగీతంలో ఎం.ఎ., ఎం.ఫిల్ చేసారు. బాల్యంలో ఆయన తల్లిదండ్రులు భజనలకు హాజరయ్యేవారు. వారి తల్లికి సంగీతంపై మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుండి ఆయనకు వారి తల్లిదండ్రులద్వారా సంగీతంపై మక్కువ యేర్పడింది. తెలుగు భాష పరంగా కాకుండా సంగీత పరంగా వారి తల్లి దండ్రులద్వారా ప్రోత్సాహం ఉండేది. వారికి కాకినాడలో నివసించేవారు. పొద్దున్నే ఉదయం కాకినాడలో కృష్ణ మందిరానికి వెళ్ళేవారు. అచ్చట కొన్ని భజన పాటలు పాడేవారు. ఈయనకు గల సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించి ఆయనను అల్లం రాజు సోమేశ్వరం వద్దకు పంపించారు. ఆయన వద్ద సరళస్వరాలను నేర్చుకున్నారు. తరువాత బి.ఎ సంగీతం చేయడానికి తిరుపతి వెల్లారు. అచట పుదుక్కొట కృష్ణమూర్తి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆయన ఎం.ఎ మ్యూజిక్ తెలుగు విశ్వవిద్యాలయంలో చేయడానికి హైదరాబాదు వచ్చారు. ఎం.ఎ పూర్తి చేసిన తరువాత ఆయన తంపెల సూర్యనారాయణ గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. ఆ తరువాత ఆకలి మల్లిఖార్జునశర్మ గారి వద్ద "లయ" పై శిక్షణ పొందారు. నేదునూరి కృష్ణమూర్తి సంగీతాన్ని ఎక్కువగా వినేవారు. దానివల్ల ఆయన సంగీత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు.[1] 1996లో జరిగిన తిరుపతి బ్రహ్మీత్సవాలలో తొలి కచేరీని శ్రీవారి చెంతనె చేసారు. ఆయన తొలి ఆల్బం "బ్రోవవమ్మా". ఆయనకు "బ్రోవవమ్మా", "జావళీ ఝరి" మంచి పీరును తీసుకొని వచ్చాయి. అనేక ఆల్బం లను రూపొందిన వీరు 100కు పైగా ప్రైవేటు ఆల్బం లను రూపొందించారు. ఆయన సంగీత త్రైమాసిక పత్రికకు సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన "భైరవి సంగీత అకాడమీ" అనే సంస్థను స్థాపించి అనేక మందికి సంగీత జ్ఞానాన్ని నేర్పుతున్నారు. వీరు మద్రాసు, ఢిల్లీ విశ్వవిద్యాలయాలనుండి డాక్టరేట్ అందుకున్నారు. [2]

ఆనాటి నుండి మననాటి వరకు, అన్నమయ్యవారి దగ్గరి నుండి హైదరాబాద్ సోదరులు రాఘవాచారి, శేషాచారి గార్ల దాకా, కర్ణాటక హిందుస్తానీ సంగీత కళామూర్తులు గాత్ర, తంత్రీవాద్య విశేష ప్రతిభావంతులైన 186 మంది జీవిత విశేషాలను అనల్ప పదాలలో విశేషంగా రచించారు.[3] [4]

ఆయన ఎన్నో సంగీత కార్యక్రమాలను రూపకల్పన చేసిన వీరికి తొలి మజిలీ మాత్రం "సంహిత" ఆల్బం విజయం సాధించడం. ఆయన అజ్ఞాతంగా ఉన్న సంగీత కారులపై డాక్యుమెంటేషన్ చేసారు. ఆయన ఏడు నరసింహదాసు కీర్తనలలు ట్యూన్, రికార్డింగ్ చేసారు. అందులో "మంగళం అంగజ జానక సారంగ నాయక" (కేదారగౌళ) లో కంపోజ్ చేసారు.[5]

పుస్తకాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

  • కంచి కామకోటి పీఠం నుండి అవార్డు.
  • యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుండి ఎక్సలన్సీ అవార్డు.
  • మహారాష్ట్ర లోని గంధర్వ విశ్వవిద్యాలయం నుండి "సంగీతాచార్య" బిరుదు.
  • కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి రీసెర్చ్ ఫెలోషిప్.
  • 2015 మన్మధ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.[7]
  • 2019 వికారి నామ సంవత్సర కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారు ఉగాది పురస్కారంతో గౌరవించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన భార్య పావని, పిల్లలు ప్రణవ్, ప్రణతి.

మూలాలు[మార్చు]

  1. Swararchana - Dr.Vyzarsu Balasubrahmanyam Special_Part 1
  2. Swararchana - Dr.Vyzarsu Balasubrahmanyam Special_Part 3
  3. "గీతానాదం". పుస్తక పరిచయం. సాక్షి. May 16, 2015. Retrieved 15 January 2016.
  4. Ajnatha Vaggeyakarulu
  5. "Precocious and a versatile composer". ARUNA CHANDRARAJU. thehindu. February 28, 2014. Retrieved 15 January 2016.
  6. గీతానాదం Sakshi | Updated: May 16, 2015 22:57 (IST)
  7. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Published On:20-03-2015". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-16.

ఇతర లింకులు[మార్చు]