Jump to content

వైఫ్ అఫ్ అనిర్వేశ్

వికీపీడియా నుండి
వైఫ్ అఫ్ అన్విరేష్
దర్శకత్వంగంగ సప్తశిఖర
స్క్రీన్ ప్లేబాబీ కేఎస్ఆర్
కథగంగ సప్తశిఖర
నిర్మాత
  • వెంకటేశ్వర్లు మెరుగు
  • శ్రీ శ్యామ్ గజేంద్ర
తారాగణం
  • రాంప్రసాద్
  • జెమినీ సురేష్
  • కిరీటి
  • సాయి ప్రసన్న
ఛాయాగ్రహణంవి.ఆర్.కె నాయుడు
కూర్పుహేమంత్ నాగ్
సంగీతంషణ్ముఖ్
విడుదల తేదీ
2025 మార్చి 7 (2025-03-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

వైఫ్ అఫ్ అనిర్వేశ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. మహేంద్ర గజేంద్ర సమర్పణలో గజేంద్ర ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించాడు.[1] రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను మార్చి 1న విడుద‌ల చేయగా,[2] సినిమాను మార్చి 7న విడుదల చేశారు.

అనిర్వేశ్ (జబర్దస్త్ రామ్ ప్రసాద్) తనను తన భార్య విచెలిత (సాయి ప్రసన్న) వేధిస్తోందని సిఐ వరదరాజులు (జెమిని సురేష్)కి ఫిర్యాదు చేయగా తన భర్తే తనను అనుమానంతో వేధిస్తున్నాడంటూ సీఐకు ఫిర్యాదు చేస్తుంది. అదే అపార్ట్ మెంట్ లో వున్న రాబర్ట్ (సాయికిరణ్ కోనేరి) వీరిద్దరూ కలిసి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని సీఐకు చెబుతాడు. ఈ క్రమంలో ధనుర్భాక్షి(కిరిటీ) ఓ వేశ్యతో సన్నిహితంగా వుంటూ ఆ యువతని లోబరుచుకుని అతి కిరాతకంగా హత్య చేస్తాడు. ఈ కేసుల వెనుక ఉన్న కారణాలను ఎంక్వయిరీ చేసేందుకు సిఐ వరదరాజులు తన సహచరుడైన పోలీసు ఆఫీసర్ (కిశోర్ రెడ్డి)ను నియమిస్తాడు. పోలీసు ఆఫీసర్ (కిశోర్ రెడ్డి) దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3][4][5]

నటీనటులు

[మార్చు]
  • రాంప్రసాద్
  • నజియా ఖాన్
  • జెమినీ సురేష్
  • కిరీటి దామరాజు
  • సాయి ప్రసన్న
  • సాయికిరణ్ కోనేరి
  • దివ్య డి
  • అద్వైత చౌదరి
  • కిశోర్ రెడ్డి చెలివేరి
  • రిధి ఒబెరాయ్
  • వెంకట్ దుగ్గిరెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం." Chitrajyothy. 1 February 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  2. "జబర్దస్త్ రాంప్రసాద్ క్రైమ్ థ్రిల్లర్ W/O అనిర్వేశ్ ట్రైలర్ చూశారా?". 2 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  3. "W/O అనిర్వేశ్ మూవీ రివ్యూ". Sakshi. 8 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  4. "'W/o Anirvesh' movie review: Keeps you hooked" (in ఇంగ్లీష్). 8 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  5. "జబర్దస్త్ రామ్‌ప్రసాద్ 'W/O అనిర్వేశ్' రివ్యూ.. ఊహించని ట్విస్టులతో థ్రిల్". Zee News Telugu. 8 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.

బయటి లింకులు

[మార్చు]