Jump to content

వైఫ్ ఆఫ్ రణసింగం

వికీపీడియా నుండి
వైఫ్ ఆఫ్ రణసింగం
దర్శకత్వంపి.విరుమాండి
రచనపి. విరుమాండి
షణ్ముగం ముత్తుసామి (డైలాగ్స్)
నిర్మాతకోటపాడి జె.రాజేష్
తారాగణం
ఛాయాగ్రహణంఎన్. కె. ఏకాంబరం
కూర్పుటి. శివనాదీశ్వరన్
సంగీతంగిబ్రాన్
నిర్మాణ
సంస్థ
కె.జె.ఆర్ స్టూడియోస్
పంపిణీదార్లుజీ స్టూడియోస్
జీ ప్లెక్స్
విడుదల తేదీ
2 అక్టోబరు 2020 (2020-10-02)
సినిమా నిడివి
176 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వైఫ్ ఆఫ్ రణసింగం 2020లో విడుదల అయిన తెలుగు సినిమా. కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై కోటపాడి జె.రాజేష్ నిర్మించిన ఈ సినిమాకి పి.విరుమాండి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఈ సినిమా తమిళ "కా పే రణసింగం" కి అనువాదం.

నటవర్గం

[మార్చు]

రణసింగం దుబాయిలో పనిచేస్తుంటాడు. రణసింగం భార్య సీత, తన కుటుంబంతో ఉంటుంది. రణసింగం దుబాయి వెళ్ళేటప్పుడు తన చేతి మీద సీత అని పచ్చబొట్టు వేయించుకుంటాడు. సీత తన కూతురికి చెవులు కుట్టించే ఫంక్షన్ చేస్తున్నప్పుడు రణసింగం చనిపోయాడని పోలీసులు రణసింగం చెల్లెలు మల్లికి చెపుతారు. మల్లి ఏడుస్తూ వచ్చి సీతకు చెపుతుంది. సీత దుబాయిలో ఉన్న రణసింగం స్నేహితులకు ఫోన్ చేస్తే అతను ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో చనిపోయాడని చెప్తారు. రణసింగం మృతదేహాన్ని భారతదేశానికి తీసుకరావాలని సీత చేసిన ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. ఎమ్మెల్యే, సీఎంలతో మాట్లాడిన ఏమి ఫలితం ఉండదు. 10 నెలలు గడిచిపోతాయి, ఆపై సీత ఆత్మహత్య చేసుకోవాలని డ్యామ్ పై నిలబడుతుంది. మీడియా వాళ్ళు రావడంతో ఇది పెద్ద విషయంగా మారి ప్రధాని దాక పోతుంది. ప్రధాని వెంటనే రణసింగం మృతదేహాన్ని తెప్పిస్తాడు. శవాన్ని దహనం చేస్తున్నప్పుడు రణసింగం చేతిమీద పచ్చబొట్టు లేకపోవడంతో అది రణసింగం కాదు అని అనుకుంటుంది. ఇంటికి వెళ్లి రణసింగం ఫోటో దగ్గర క్షమించమని అడుగుతుంది.[3]

పాటలు

[మార్చు]
  • పాడిపంట పండకుండా
  • ఉప్పనలే ఉప్పనలే
  • ఈ ఊరే రణసింగం

మూలాలు

[మార్చు]
  1. "Watch Telugu Full Movie W/O RanaSingam 2020 Online". www.cinemasonly.com. Retrieved 2022-07-09.
  2. "Vijay Sethupathi and Aishwarya Rajesh film w/o ranasingam". The New Indian Express. Retrieved 2022-07-09.
  3. w/o ranasingam Movie Review: Well-meaning drama that is also quite overlong, retrieved 2022-07-09