వైభవీ మర్చంట్
వైభవి మర్చంట్ | |
---|---|
జననం | 1975/1976 (age 48–49) |
వృత్తి | కొరియోగ్రాఫర్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999 – ప్రస్తుతం |
బంధువులు |
|
వైభవి మర్చంట్ బాలీవుడ్ చిత్రాలకు పని చేస్తున్న భారతీయ కొరియోగ్రాఫర్. ఆమె 1999లో హమ్ దిల్ దే చుకే సనమ్‌లోని ధోలీ తారో ధోల్ బాజే.. పాటకు ఉత్తమ నృత్యదర్శకురాలిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1] తెలుగులోనూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018) చిత్రానికి ఆమె నృత్య దర్శకురాలుగా చేసింది.
కెరీర్
[మార్చు]తమిళనాడులోని చెన్నైలో రమేష్ మర్చంట్, హృదయ మర్చంట్ దంపతులకు ఆమె జన్మించింది. ఆమె కొరియోగ్రాఫర్ బి. హీరాలాల్ మనవరాలు, శృతి మర్చంట్ అక్క.[2]
ఆమె తన అంకుల్ చిన్ని ప్రకాష్‌కి సహాయం చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించింది.[2] 1999లో హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రం కోసం ధోల్ బాజే.. పాట కొరియోగ్రఫీ ఆమె మొదటి సోలో వర్క్. ఆమె దీనికి ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[3]
ఆమె 2000లో మలయాళ చిత్రం స్నేహపూర్వం అన్నలో తొలిసారిగా నటించింది.
ఆమె నాచ్ బలియే 3, ఝలక్ దిఖ్లా జా (సీజన్ 3), జరా నాచ్కే దిఖా 2, జస్ట్ డాన్స్ వంటి అనేక టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.[4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]కొరియోగ్రాఫర్‌గా
[మార్చు]1999: హమ్ దిల్ దే చుకే సనమ్ (ధోల్ బాజే) |
2002: ఫిల్హాల్ |
2002: నా తుమ్ జానో న హమ్ |
2002: దేవదాస్ |
2002: దీవాంగీ |
2002: కర్జ్: ది బర్డెన్ ఆఫ్ ట్రూత్ |
2002: గురు మహాగురు |
2003: దిల్ క రిష్ట |
2003: దమ్ |
2003: కాష్ ఆప్ హమారే హోతే |
2003: హాసిల్ |
2003: ముంబై సే ఆయా మేరా దోస్త్ |
2004: ఏట్‌బార్ |
2004: రుద్రాక్ష |
2004: మీనాక్సీ: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ |
2004: షాదీ కా లడ్డూ |
2004: గర్వ్ |
2004: క్యూన్! హో గయా నా... |
2004: ఫిదా |
2004: ధూమ్ |
2004: రఖ్త్ |
2004: దిల్ నే జిసే అప్నా కహా |
2004: మధోషి |
2004: తుమ్సా నహిం దేఖా |
2004: వీర్ జారా |
2004: స్వదేస్ |
2004: దిల్ మాంగే మోర్ |
2005: చెహ్రా |
2005: బంటీ ఔర్ బబ్లీ |
2005: నో ఎంట్రీ |
2005: రామ్‌జీ లండన్‌వాలీ |
2005: అతడు (తెలుగు) |
2005: షాదీ నం. 1 |
2005: నీల్ 'ఎన్' నిక్కి |
2005: శిఖర్ |
2006: రంగ్ దే బసంతి |
2006: హమ్కో తుమ్సే ప్యార్ హై |
2006: ఫనా |
2006: క్రిష్ |
2006: ఉమ్రావ్ జాన్ |
2006: బాబుల్ |
2006: చమ్కీ చమేలీ |
2006: ధూమ్ 2 |
2007: మేరిగోల్డ్ |
2007: హే బేబీ |
2007: ఆజా నాచ్లే |
2007: ఝూమ్ బరాబర్ ఝూమ్ |
2007: త ర రం పం |
2008: లవ్ స్టోరీ 2050 |
2008: రబ్ నే బనా ది జోడి |
2008: తోడా ప్యార్ తోడా మ్యాజిక్ |
2008: భూత్‌నాథ్ |
2008: దోస్తానా |
2008: తషాన్ |
2009: దిల్ బోలే హడిప్పా |
2009: లక్ బై ఛాన్స్ |
2009: ఢిల్లీ-6 |
2009: కుర్బాన్ |
2009: కంబఖ్త్ ఇష్క్ |
2010: నో ప్రాబ్లమ్ |
2010: బ్యాండ్ బాజా బారాత్ |
2011: డాన్ 2 |
2011: గేమ్ |
2011: జిందగీ నా మిలేగీ దొబారా |
2011: లేడీస్ vs రికీ బహ్ల్ |
2011: బాడీగార్డ్ |
2012: అయ్యా |
2012: ఏక్ థా టైగర్ |
2012: జబ్ తక్ హై జాన్ |
2013: బాంబే టాకీస్ |
2013: భాగ్ మిల్కా భాగ్ |
2013: ధూమ్ 3 |
2016: ఫ్యాన్ |
2016: సుల్తాన్ |
2016: బెఫిక్రే |
2017: జబ్ హ్యారీ మెట్ సెజల్ |
2017: ఓకె జాను |
2017: టైగర్ జిందా హై |
2018: హిచ్కీ |
2018: లవ్ రాత్రి |
2018: నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా (తెలుగు) |
2018: భారత్ |
2019: సాహో |
2019: దబాంగ్ 3 |
2022: రాధే శ్యామ్ |
2022: పఠాన్ |
నటిగా
[మార్చు]2000: సంగీత శివన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం స్నేహపూర్వం అన్న .
2012: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో డిస్కో దీవానే పాటలో స్పెషల్ అప్పియరెన్స్.
అవార్డులు
[మార్చు]- 2000లో ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డు - హమ్ దిల్ దే చుకే సనమ్ చిత్రంలోని ధోలీ తారో ధోల్ బాజే.. [1]
- 2006లో IIFA అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ - బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని కజ్రా రే..
- 2006లో జీ సినీ అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ - బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని కజ్రా రే..
- 2006లో బాలీవుడ్ మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ - బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని కజ్రా రే..
- 2006లో బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్ - బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని కజ్రా రే..
- 2008లో ఉత్తమ కొరియోగ్రఫీకి IIFA అవార్డు - ఆజా నాచ్లే చిత్రంలోని ఆజా నాచ్లే..
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 13 March 2012.
- ↑ 2.0 2.1 "I can't help if Saroj Khan is upset: Vaibhavi Merchant - Hindustan Times". Archived from the original on 2014-03-01. Retrieved 2014-09-28.
- ↑ "Directorate of Film Festival". 2014-05-05. Archived from the original on 5 May 2014. Retrieved 2020-01-28.
- ↑ Hindustan Times