Jump to content

వైభవ్ అరోరా

వికీపీడియా నుండి
వైభవ్ అరోరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వైభవ్ గోపాల్ అరోరా
పుట్టిన తేదీ (1997-12-14) 1997 డిసెంబరు 14 (వయసు: 28)
అంబాలా, హర్యానా, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడి చేయి మీడియం-ఫాస్ట్ బౌలింగ్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019–ప్రస్తుతంహిమాచల్ ప్రదేశ్
2021, 2023-ప్రస్తుతంకోల్‌కతా నైట్‌రైడర్స్
2022పంజాబ్ కింగ్స్
మూలం:

వైభవ్ గోపాల్ అరోరా (జననం 14 డిసెంబర్ 1997) భారతీయ క్రికెటర్. ఆయన దేశీయ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్ తరపున, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.[1][2][3] వైభవ్ 2019 డిసెంబర్ 9న హిమాచల్ ప్రదేశ్ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్,[4][5] 2021 జనవరి 10న ట్వంటీ20లో అరంగేట్రం చేసి, 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ తరపున ఆడాడు.[6][7][8]

వైభవ్ అరోరా ఫిబ్రవరి 2021లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.[9][10] ఆయన ఫిబ్రవరి 21న హిమాచల్ ప్రదేశ్ తరపున 2020–21 విజయ్ హజారే ట్రోఫీలో తన లిస్ట్ ఏ అరంగేట్రం చేసి[11] ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు.[12] వైభవ్ అరోరా ఫిబ్రవరి 2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.[13]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

వైభవ్ అరోరా 1997 డిసెంబర్ 14న హర్యానాలోని అంబాలాలో జన్మించాడు. ఆయన అంబాలా కంటోన్మెంట్‌లోని లార్డ్ మహావీర్ జైన్ పబ్లిక్ స్కూల్, చండీగఢ్‌లోని డీఏవీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి చండీగఢ్ విశ్వవిద్యాలయంలో బిఎ-బి. ఈడీ పూర్తి చేశాడు.[14]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Vaibhav Arora's dream ride: From Ambala Cantt to Kolkata Knight Riders via Chandigarh and Himachal Pradesh". The Times of India. 21 February 2021. Archived from the original on 27 November 2024. Retrieved 27 March 2025.
  2. ↑ "Special to be back with KKR, didn't want to play for another team: Vaibhav Arora" (in ఇంగ్లీష్). India Today. 11 February 2025. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.
  3. ↑ "Vaibhav Arora". ESPNcricinfo. Retrieved 9 December 2019.
  4. ↑ "Elite, Group B, Ranji Trophy at Dharamsala, Dec 9-12 2019". ESPNcricinfo. Retrieved 9 December 2019.
  5. ↑ "IPL 2022: Who is Vaibhav Arora, Punjab Kings' star debutant pacer who swings it both ways?". Firstpost. 4 April 2022.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  6. ↑ "Elite C, Vadodara, Jan 10 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 10 January 2021.
  7. ↑ "Vaibhav Arora: From thinking about quitting cricket, knocking off Pujara's middle stump to playing in IPL" (in ఇంగ్లీష్). The Indian Express. 4 April 2022. Archived from the original on 6 May 2022. Retrieved 27 March 2025.
  8. ↑ "IPL 2021: From milk deliveries to IPL pacer, Vaibhav Arora's journey". Hindustan Times. 23 February 2023. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.
  9. ↑ "IPL 2021 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 18 February 2021.
  10. ↑ "Vaibhav Arora's dream ride: From Ambala Cantt to Kolkata Knight Riders via Chandigarh and Himachal Pradesh". Times of India. Retrieved 21 February 2021.
  11. ↑ "Elite, Group D, Jaipur, Feb 21 2021, Vijay Hazare Trophy". ESPNcricinfo. Retrieved 21 February 2021.
  12. ↑ "Shaw tons up as Mumbai beat Delhi; Vaibhav Arora's hat-trick in vain". CricBuzz. Retrieved 21 February 2021.
  13. ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  14. ↑ "The Inspiring Journey of Vaibhav Arora" (in ఇంగ్లీష్). KKR. 17 May 2023. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.