Jump to content

వైస్రాయి కార్యనిర్వాహక మండలి

వికీపీడియా నుండి

వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి అనేది భారత వైస్రాయ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ మంత్రివర్గం. దీనిని ఇంగ్లీషులో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనీ, కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. [1] ఇది 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో వ్యవస్థకు గుర్తింపునిస్తూ, సలహా మండలి నుండి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ద్వారా రెవెన్యూ, మిలిటరీ, లా, ఫైనాన్స్, హోమ్ వంటి ఐదుగురు సభ్యులతో కూడిన క్యాబినెట్‌గా రూపాంతరం చెందింది. 1874లో, పబ్లిక్ వర్క్స్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఆరవ సభ్యుడుగా చేర్చారు.

చరిత్ర

[మార్చు]

భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా భారతదేశ పరిపాలనను ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటీష్ క్రౌన్‌కు బదిలీ అయింది. ఇది భారతదేశంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించే వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్‌ను నియమించే అధికారం క్రౌన్‌కు లభించింది. గవర్నర్-జనరల్ సలహా మండలి, అప్పటి రాజధాని కలకత్తాలో ఉండేది. అందులో నలుగురు సభ్యులు ఉండేవారు, వీరిలో ముగ్గురిని భారతదేశ కార్యదర్శి, ఒకరిని సార్వభౌమాధికారి నియమించేవారు.

ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 చట్టంతో వైస్రాయ్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ కౌన్సిల్‌ను పోర్ట్‌ఫోలియో వ్యవస్థగా నడిచే క్యాబినెట్‌గా మారింది. సభ్యుల సంఖ్యను ఒకటి పెంచింది. ముగ్గురు సభ్యులను భారత విదేశాంగ కార్యదర్శి, ఇద్దరిని సార్వభౌమాధికారి నియమిస్తారు. ఐదుగురు సాధారణ సభ్యులు గృహ, రెవెన్యూ, సైనిక, చట్టం, ఆర్థిక విభాగాల బాధ్యతలు చేపడతారు. మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ కౌన్సిల్‌లో అసాధారణ సభ్యునిగా ఉంటారు. చట్టంలోని నిబంధనల ప్రకారం, అవసరమని భావించిన వ్యవహారాల్లో, కౌన్సిల్‌ నిర్ణయాన్ని అతిక్రమించడానికి వైస్రాయ్‌కు అధికారం ఉంది. 1869లో, మొత్తం ఐదుగురు సభ్యులనూ నియమించే అధికారం క్రౌన్‌కు ఇచ్చారు. 1874లో, ప్రజా పనులకు ఇన్‌ఛార్జ్‌గా కొత్త సభ్యుడిని చేర్చారు.

ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 చట్టం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు ఒక భారతీయ సభ్యుడిని నామినేట్ చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్‌కు కట్టబెట్టింది. దానికి అనుగుణంగా ఎంపికైన మొదటి భారతీయ సభ్యుడు సత్యేంద్ర ప్రసన్న సిన్హా. భారత ప్రభుత్వ చట్టం 1919, కౌన్సిల్‌లో భారతీయుల సంఖ్యను మూడుకు పెంచింది.

కౌన్సిల్‌లో భారతీయులు (1909 – 1940)

[మార్చు]
  • న్యాయ సభ్యులు: సత్యేంద్ర ప్రసన్న సిన్హా (1909–1914), PS శివస్వామి అయ్యర్ (1912–1917), సయ్యద్ అలీ ఇమామ్, ముహమ్మద్ షఫీ (1924–1928), తేజ్ బహదూర్ సప్రు (1920–1923), సతీష్ రంజన్ దాస్ (19 బ్రోజ్జన్ 19 –1934), నృపేంద్ర నాథ్ సిర్కార్ (1934–1939), బెపిన్ బెహరీ ఘోస్ (1933), నళిని రంజన్ ఛటర్జీ [2]
  • సి. శంకరన్ నాయర్ (1915–1919): విద్య
  • ముహమ్మద్ షఫీ : విద్య (1919–1924)
  • BN శర్మ (1920–1925): రెవెన్యూ, వ్యవసాయం
  • భూపేంద్ర నాథ్ మిత్ర : పరిశ్రమలు, కార్మిక
  • నరసింహ చింతామన్ కేల్కర్ (1924–1929)
  • ముహమ్మద్ హబీబుల్లా (1925–1930): విద్య, ఆరోగ్యం, భూములు
  • ఫజల్-ఇ-హుస్సేన్ (1930–1935)
  • CP రామస్వామి అయ్యర్ : చట్టం (1931–1932), వాణిజ్యం (1932), సమాచారం (1942)
  • కూర్మా వెంకట రెడ్డి నాయుడు (1934–1937)
  • ముహమ్మద్ జఫరుల్లా ఖాన్ (1935–1941): వాణిజ్యం (–1939), చట్టం (1939–), రైల్వే, పరిశ్రమలు, కార్మిక,, యుద్ధ సరఫరా
  • ఆర్కాట్ రామసామి ముదలియార్ : వాణిజ్యం, లేబర్ (1939–1941), సప్లై (1943)
  • కున్వర్ సర్ జగదీష్ ప్రసాద్: ఆరోగ్యం, విద్య, భూములు
  • గిరిజా శంకర్ బాజ్‌పాయ్ (1940): ఆరోగ్యం, విద్య
  • అత్తావుల్లా తరార్ (1931 – 1941 ?)  [ <span title="The material near this tag possibly uses too-vague attribution or weasel words. (February 2018)">ఎవరు?</span>]

1941, 1942 ల్లో విస్తరణ

[మార్చు]

1940 ఆగష్టు 8 న, వైస్రాయ్ లార్డ్ లిన్లిత్‌గో చేసిన ఆగస్ట్ ఆఫర్ అనే ప్రతిపాదనలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను విస్తరించి మరింత మంది భారతీయులను చేర్చాలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్-ఇండియా ముస్లిం లీగ్, హిందూ మహాసభ తిరస్కరించాయి.

అయితే, మరుసటి సంవత్సరం లిబరల్ పార్టీకి చెందిన సర్ తేజ్ బహదూర్ సప్రూ వాటిని పునరుద్ధరించాడు. వైస్రాయ్ వాటిని ఆమోదించాడు. 1941 జూలై 22 న పునర్నిర్మించిన కార్యనిర్వాహక మండలిని ప్రకటించాడు. ఇందులో మొదటిసారిగా భారతీయులు బ్రిటన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు (వీటిలో నాలుగింటికి ఎన్నికైన ప్రభుత్వాలున్నాయి) సంస్థానాల మధ్య యుద్ధ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఉద్దేశించిన 30 మంది సభ్యుల జాతీయ రక్షణ మండలి ఏర్పాటును కూడా అతడు ప్రకటించాడు.

ఈ మండళ్ళ కూర్పులో మతపరమైన సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేసరు. అయితే జిన్నా, భారతీయ ముస్లిం సమాజానికి తానే ఏకైక ప్రతినిధిని అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా, వైస్రాయ్ కార్యనిర్వాహక, జాతీయ రక్షణ మండలి నుండి రాజీనామా చేయవలసిందిగా AIML సభ్యులందరినీ ఆదేశించాడు. ఆ మండళ్ళలో ముస్లిములకు 50% ప్రాతినిధ్యం ఉండాలని అతని డిమాండు. పైగా ముస్లిం సభ్యుల ఎంపిక విషయమై వైస్రాయి జిన్నాను సంప్రదించలేదనేది అతని ఇంకో ఆరోపణ.

1942 జూలై 2 న వైస్రాయ్ కౌన్సిల్‌ను మళ్లీ 12 నుండి 15 కు విస్తరించారు. సర్ మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్ (ICS అధికారి, లండన్‌లోని హైకమిషనర్) డిఫెన్స్ సభ్యునిగా నియమితుడయ్యాడు. ఈ పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడతడు (కీలకమైన కాంగ్రెస్ డిమాండది). తమిళ రాజకీయ నాయకుడైన సర్ రామస్వామి ముదలియార్, జామ్‌నగర్‌ మహారాజా జామ్ సాహెబ్ శ్రీ దిగ్విజయ్‌సింహ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ లను లండన్‌లోని ఇంపీరియల్ వార్ క్యాబినెట్‌కు, వాషింగ్టన్ DCలోని పసిఫిక్ వార్ కౌన్సిల్‌కూ భారత ప్రభుత్వ ప్రతినిధులుగా కొత్తగా నియమితులయ్యారు.

కౌన్సిల్‌లో ఇప్పుడు కింది వారున్నారు: [3] [4] [5]

పోర్ట్‌ఫోలియో పేరు పదవీకాలం
వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్ ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో 18 ఏప్రిల్ 1936 – 1 అక్టోబర్ 1943
ది విస్కౌంట్ వేవెల్ 1 అక్టోబర్ 1943 - 21 ఫిబ్రవరి 1947
కమాండర్-ఇన్-చీఫ్, ఇండియా జనరల్ సర్ ఆర్కిబాల్డ్ వేవెల్ 5 జూలై 1941 – 5 జనవరి 1942
జనరల్ సర్ అలాన్ హార్ట్లీ 5 జనవరి 1942 – 7 మార్చి 1942
ఫీల్డ్ మార్షల్ సర్ ఆర్కిబాల్డ్ వేవెల్ 7 మార్చి 1942 – 20 జూన్ 1943
జనరల్ సర్ క్లాడ్ ఆచిన్‌లెక్ 20 జూన్ 1943 – 21 ఫిబ్రవరి 1947
హోమ్ సర్ రెజినాల్డ్ మాక్స్‌వెల్ 1941–1944
సర్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ముడీ 1944–1946
ఫైనాన్స్ సర్ జెరెమీ రైస్మాన్ 1941–1946
రక్షణ సర్ మాలిక్ ఫిరోజ్ ఖాన్ నూన్ 1942–1944
పౌర రక్షణ డాక్టర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు 1941–1942
సర్ జ్వాలా ప్రసాద్ శ్రీవాస్తవ 1942–1943
చట్టం సర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్ 1941–1943
అశోక్ కుమార్ రాయ్ 1943–1946
సమాచారం సర్ అక్బర్ హైదరీ 1941–1942
సర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్ 1943–
కమ్యూనికేషన్స్ సర్ ఆండ్రూ క్లౌ 1941
సరఫరా సర్ హోమీ మోడీ 1941–1942
సర్ ఆర్కాట్ రామసామి ముదలియార్ 1943
వాణిజ్యం సర్ ఆర్కాట్ రామసామి ముదలియార్ 1941
నళిని రంజన్ సర్కార్ 1942
ఆరోగ్యం, విద్య, భూములు నళిని రంజన్ సర్కార్ 1941
జోగేంద్ర సింగ్ 1942–1946
శ్రమ ఫిరోజ్ ఖాన్ నూన్ 1941
బిఆర్ అంబేద్కర్ 1942–1946
ప్రవాస భారతీయులు, కామన్వెల్త్ సంబంధాలు మాధవ్ శ్రీహరి అనీ 1941–1943
నారాయణ్ భాస్కర్ ఖరే 1943–1946
బ్రిటిష్ వార్ క్యాబినెట్, పసిఫిక్ వార్ కౌన్సిల్‌లో భారతదేశ ప్రతినిధి ఆర్కాట్ రామసామి ముదలియార్ 1942–1944
ఫిరోజ్ ఖాన్ నూన్ 1944–1945
యుద్ధ రవాణా సర్ EC బెంతాల్ 1942–1946
తపాలా, ఎయిర్ మహ్మద్ ఉస్మాన్ 1942–1946
గురునాథ్ వెంకటేష్ బేవూరు 1946
ఆహారం సర్ జ్వాలా ప్రసాద్ శ్రీవాస్తవ 1943–1946
వాణిజ్యం, పరిశ్రమలు, పౌర సరఫరాలు మహ్మద్ అజీజుల్ హుక్ 1943–1945
యుద్ధానంతర పునర్నిర్మాణం అర్దేషిర్ దలాల్ 1944–1945

మధ్యంతర ప్రభుత్వం

[మార్చు]

1946 జూన్ మధ్యలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం, కార్యనిర్వాహక మండలి వైస్రాయ్, కమాండర్-ఇన్-చీఫ్ మినహా మిగిలిన సభ్యులంతా భారతీయులే ఉండేలా విస్తరించారు. అధికార బదిలీ జరిగే వరకూ ఉండేలా ఈ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. వైస్రాయ్, విస్కౌంట్ వేవెల్ 14 మంది సభ్యులకు ఆహ్వానాలను అందించాడు.

భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాలను స్వీకరించిన తర్వాత 1946 సెప్టెంబరు 2 నుండి మధ్యంతర ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. అయితే, 1946 అక్టోబరు 26 వరకు ఆల్-ఇండియా ముస్లిం లీగ్ అందులో పాల్గొనడానికి నిరాకరించింది. 1947 ఆగస్టు 15న అధికారాన్ని భారతదేశ డొమినియన్, పాకిస్తాన్ డొమినియన్‌కు బదిలీ చేసే వరకు మధ్యంతర ప్రభుత్వం పనిచేసింది.

తాత్కాలిక ప్రభుత్వ సభ్యులు

[మార్చు]
పోర్ట్‌ఫోలియో పేరు పార్టీ
వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్ ది విస్కౌంట్ వేవెల్

లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్
ఏదీ లేదు
కమాండర్-ఇన్-చీఫ్, ఇండియా జనరల్ సర్ క్లాడ్ ఆచిన్‌లెక్ ఏదీ లేదు
కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు
విదేశీ వ్యవహారాలు & కామన్వెల్త్ సంబంధాలు
జవహర్‌లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్
గృహ వ్యవహారాలు
సమాచారం & ప్రసారం
వల్లభాయ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
రక్షణ బల్దేవ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
పరిశ్రమలు, సరఫరాలు జాన్ మథాయ్ భారత జాతీయ కాంగ్రెస్
చదువు సి.రాజగోపాలాచారి భారత జాతీయ కాంగ్రెస్
పనులు, గనులు, శక్తి శరత్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్
పనులు, గనులు, శక్తి CH భాభా భారత జాతీయ కాంగ్రెస్
ఆహారం, వ్యవసాయం రాజేంద్ర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
రైల్వేలు, రవాణా అసఫ్ అలీ భారత జాతీయ కాంగ్రెస్
శ్రమ జగ్జీవన్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
ఫైనాన్స్ లియాఖత్ అలీ ఖాన్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్
వాణిజ్యం ఇబ్రహీం ఇస్మాయిల్ చుండ్రిగారు ఆల్-ఇండియా ముస్లిం లీగ్
ఆరోగ్యం గజన్‌ఫర్ అలీ ఖాన్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్
తపాలా, ఎయిర్ అబ్దుర్ రబ్ నిష్తార్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్
చట్టం జోగేంద్ర నాథ్ మండల్ ఆల్-ఇండియా ముస్లిం లీగ్

మూలాలు

[మార్చు]
  1. "Government of India Act, 1858: Key Features". Jagranjosh.com. 2017-11-21. Retrieved 2019-02-04.
  2. "Nalini Ranjan's Portrait Unveiled". Statesman. 24 December 2001.
  3. Grover, Verinder; Arora, Ranjana (1994). Constitutional Schemes and Political Development in India. p. 21. ISBN 9788171005390.
  4. "THE VICEROY'S EXECUTIVE COUNCIL IS EXPANDED". The Straits Times. 23 July 1941. Retrieved 8 September 2014.
  5. "Viceroy's Executive Council - HC Deb 10 November 1942 vol 383 cc2293-4W".