వైస్ పారా అయస్కాంతత్వం సిద్ధాంతము ప్రయోగాత్మక నిరుపమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పారా అయస్కాంత నమూన

క్యూరీ- వైస్ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా అన్ని పారా అయస్కాంత పదార్ధాలు పాటిస్తాయని రుజువుచేసారు. కామర్ లింగ్ ఆన్శ్ అధిక సంపీడ్య ఆమ్లజని మీద చేసిన ప్రయోగాత్మక ఫలితాలు వీటిని స్థిరపరచినాయి. ఈయన 147 డిగ్రీ నుంచి 249 డిగ్రీ పరమ ఉష్ణోగ్రతల మధ్య చేసిన ప్రయోగ ఫలితాలనుబట్టి xM (T+5.4) = CM (స్థిరాంకం) అని నిరూపించాడు. సాధారణ పీడణాల వద్ద CM విలువ 316 అని చూపించాడు. దీనివల్ల అధిక సాంపీడ్య ఆమ్లజని క్యూరీ-వైస్ నియమాన్ని పాటిస్తుందని, దీని క్యూరీ ఉష్ణోగ్రత 𝛳 = -5.4డిగ్రీ కె, అంటే పరమశూన్య ఉష్ణోగ్రతకు 5.4డిగ్రీ తక్కువగా వుంటుందని తేలింది. కనుక అధిక సంపీడ్య ఆమ్లజనిలో వుండే అంతర్గత అణుక్షేత్రము ఋణాత్మకంగా ఉంటుందని తెలిసింది.

క్యూరీ బిందువు కనుగొనుట[మార్చు]

సమీకరనమును క్రింది విధంగా వ్రాయవచ్చును. 1/xM = T/CM - 𝛳 /CM

1/xM, T విలువలను గ్రాఫ్ రూపంలో చూపిస్తే క్యూరీ సిద్ధాంతాన్ని పాటించే పదార్ధాలకు మూలబిందువు ద్వారా వెళ్ళని సరళరేఖాలబిస్తాయి. ఉష్ణోగ్రత అక్షంమీదచేసిన అంతః ఖండనము క్యూరీబిందువును తెలుపుతుంది.

చాలా అయస్కాంత పదార్ధాలుకు క్యూరీబిందువు విలువ స్వల్పము. అది ధణాత్మకమైనా, ఋణాత్మకమైనా కావచ్చు. ఋణాత్మకంగాఉన్న పదార్ధాలకు ఇది మిద్ధ్యబిందువై, వాటిఅంతర్గత అణుక్షేత్రాన్ని ఋణాత్మకంగా చేస్తుంది. క్యూరీ బిందువు ధనాత్మకంగాఉన్న పదార్ధాలుకూడా అతి స్వల్ప ఉష్ణోగ్రత వద్ద ఫెరో అయస్కాంత ధర్మాలను పొందుతాయని అనుకొనేటందుకు వీలులేదు. ఎందువల్లనంటే 1/xM, T గ్రాఫ్ క్యూరీ బిందువును సమీపించేకొద్ది సరలరేఖ ధర్మాన్ని కోల్పోతుంది.

ఇవి కూడా చూడండ[మార్చు]

మూలాలు[మార్చు]

  • {{స్థిర విద్యుత్ శాస్త్రము - ద్రవ్యాయస్కాంత ధర్మాలు , తెలుగు అకాడమి 1972 సంపాదకుడు:-బి. రామచంద్రరావు}}

బయటి లంకెలు[మార్చు]