వై.ఎస్.వివేకానందరెడ్డి

వికీపీడియా నుండి
(వై.ఎస్.వివేకానంద రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వై.ఎస్.వివేకానందరెడ్డి
వై.ఎస్.వివేకానందరెడ్డి

వివేకానందరెడ్డి


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999-2009
ముందు వై.యస్. రాజశేఖరరెడ్డి
తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
నియోజకవర్గం కడప, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పదవీ కాలం
1989-1999
ముందు వై.యస్. రాజశేఖరరెడ్డి
తరువాత వై.యస్. రాజశేఖరరెడ్డి
నియోజకవర్గం పులివెందుల

వ్యక్తిగత వివరాలు

జననం (1950-08-08)1950 ఆగస్టు 8
పులివెందుల, ఆంధ్ర ప్రదేశ్
మరణం 2019 మార్చి 15(2019-03-15) (వయసు 68)
పులివెందుల
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వై.ఎస్.సౌభాగ్య
సంతానం 1
నివాసం పులివెందుల
మూలం [1]

వై.ఎస్.వివేకానందరెడ్డి ( జ: 8 ఆగష్టు, 1950 - మ. మార్చి 15, 2019 ) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 13వ, 14వ లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

ఇతడు 1989, 1994 ఎన్నికలలో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.

ఇతడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిన్న తమ్ముడు.ఈయన అజాత శత్రువు

ఇతడు కడప జిల్లాలో లింగాల కాలువను డిజైన్ చేశారు.

వీరు లైన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించి సమితి ప్రెసిడెంటుగా, తరువాత శాసన సభ్యునిగా, తరువాల లోక్‌సభ సభ్యునిగా ఎదిగారు.

2010 డిసెంబరు 1 రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమండలిలో స్థానం పొందినారు.

మరణం[మార్చు]

2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య చెయ్యబడ్డాడు. తొలుత గుండెపోటుగా వార్తలు వచ్చినప్పటికీ, తరువాత అది హత్యగా తేలింది. ఈ హత్యకు కారణాలు లేకుండా చేశాడని జగన్ గారి మామ గంగిరెడ్డి మీద ఆరోపణలు పెద్దయెత్తున జరిగాయి. మరో నెల రోజుల లోపు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో జరిగిన ఈ హత్య రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలకు దారితీసింది.[1][2]

మూలాలు[మార్చు]

  1. నాగరాజు, పెనుమల (15 March 2015). "చంద్రబాబు సూత్రధారి, ఆదినారాయణరెడ్డి పాత్రధారి: వైఎస్ వివేకా హత్యపై విజయసాయిరెడ్డి".[permanent dead link]
  2. "హత్యను దాచిపెట్టేందుకు ఎందుకు యత్నించారో జగన్ చెప్పాలి: సీఎం చంద్రబాబు - ప్రెస్ రివ్యూ". 16 March 2019.

బయటి లింకులు[మార్చు]