వై.వి. మల్లారెడ్డి
వై.వి. మల్లారెడ్డి సామాజిక సేవకుడు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) డైరెక్టర్. 2022 సంవత్సరానికి గాను వై వి మల్లారెడ్డికి వైయస్సార్ లైఫ్ ఆచీవ్మెంట్ అవార్డు లభించింది.
వై.వి. మల్లారెడ్డి | |
|---|---|
| జననం | 1954 జనవరి 7 |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి | సామాజిక సేవకుడు |
| పేరుపడ్డది | రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) డైరెక్టర్ |
| భాగస్వామి | డోరీన్ రెడ్డి |
| పిల్లలు | 1 (భరత్) |
| పురస్కారాలు |
|
బాల్యం, విద్యా భాస్యం
[మార్చు]వై.వి. మల్లారెడ్డి 1954 జనవరి 7న అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా లోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల గ్రామపంచాయతీలోని నీరుకుంట్లపల్లిలో హరి నారాయణ రెడ్డి వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. .వై.వి మల్లారెడ్డి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. ఐదుగురిలో మల్లారెడ్డి మూడవ వాడు. వై వి మల్లారెడ్డి తండ్రి హరి నారాయణ రెడ్డి తన కొడుకులలో ఒకరైన బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని అనుకున్నాడు. దీంతో హరి నారాయణ రెడ్డి తన పెద్ద కొడుకును చదివించడం మొదలుపెట్టాడు. వైవి మల్లారెడ్డి అన్న నల్లచెరువు లో చదువుకుంటూ ఉండేవాడు. వైవి మల్లారెడ్డి అన్న చదువును మధ్యలోనే ఆపేయడంతో వైవి మల్లారెడ్డి విద్యను అభ్యసించడం మొదలుపెట్టాడు. మల్లారెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం తన సొంత గ్రామమైన నీరుకుంట్లపల్లిలోనే కొనసాగింది.ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం వైవి మల్లారెడ్డి కదిరి బాలుర ఉన్నత కళాశాలలో చేరాడు. అక్కడ ఆయన సీఈసీ గ్రూప్ తీసుకున్నాడు. తరువాత మల్లారెడ్డి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యాడు.జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంతటా పర్యటించాడు.
కెరీర్
[మార్చు]విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1974లో వై.వి. మల్లారెడ్డి విసెంక్ ఫెర్రర్ మోంచో స్థాపించిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) లో చేరాడు. తర్వాత కొంతకాలానికి వైవి మల్లారెడ్డి ఆర్డిటి డైరెక్టర్ గా నియమితుడయ్యాడు.గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ (ఆర్డిటి) దాని అనుబంధ సంస్థ అయిన అసియన్ ఫ్రాటెర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ గా వైవి మల్లారెడ్డి 42 సంవత్సరాలు పనిచేశారు. వైవి మల్లారెడ్డి ఆర్డిటి డైరెక్టర్ గా అనంతపురం జిల్లాలో వెనకబడిన గ్రామాల ను అభివృద్ధి చేయడంలో వైవి మల్లారెడ్డి కీలకపాత్ర పోషించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]వైవి మల్లారెడ్డి డోరీన్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి డోరీన్ రెడ్డి కూడా 40 సంవత్సరాలుగా ఆర్డిటిలో పనిచేస్తున్నారు. డోరీన్ రెడ్డి ఆర్డిటి మహిళా విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లాలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆమె కృషి చేశారు. మల్లారెడ్డి డోరీన్ రెడ్డి దంపతులకు ఏకైక సంతానం. మల్లారెడ్డి కుమారుడు భరత్ ఆయన భార్య సంధ్య బెంగళూరు లో నివాసం ఉంటున్నారు. వారు వ్యాపారవేత్తలుగా కొనసాగుతున్నారు.
రచనలు
[మార్చు]అనంత ప్రస్థానం (2009) అనంతపురం జిల్లాలోని రైతుల పరిస్థితి వ్యవసాయం అనంతపురం జిల్లా చరిత్ర గురించి వై.వి. మల్లారెడ్డి అనంత ప్రస్థానం అనే పుస్తకాన్ని రాశాడు. ముఖ్యంగా వైవి మల్లారెడ్డి గ్రామీణ అభివృద్ధి వ్యవసాయం కరువు కాటకాలు లాంటి అంశాలపై అనేక వ్యాసాలు రాశాడు.
పదవులు
[మార్చు]సభ్యుడు (2003-07) - నేషనల్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ఫండ్ నాబార్డ్ రాష్ట్ర స్థాయి వాటర్‌షెడ్ కన్సల్టేటివ్ కమిటీ.
సభ్యుడు - రైతు సంక్షేమ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (2004), రైతుల సంక్షోభాలకు గల కారణాలను అధ్యయనం చేయడానికి రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి విధానపరమైన చొరవలను సిఫార్సు చేయడానికి డాక్టర్ జయతి ఘోష్ నేతృత్వంలోని రైతు సంక్షోభాలు, వ్యవసాయం దుస్థితిపై జాతీయ స్థాయి నిపుణులతో కూడిన 13 మంది సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేయబడింది.
అనంత గ్రామీణ బ్యాంక్ (ఇప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్) డైరెక్టర్ (2003-06)
సభ్యుడు (2019) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు.
అవార్డులు
[మార్చు]థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో న్యూఢిల్లీలోని గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్ 2013లో జాతీయ సమైక్యత అవార్డును ఇచ్చి వైవి మల్లారెడ్డిని సత్కరించింది.
గ్లోబల్ అచీవర్స్ ఫౌండేషన్, న్యూఢిల్లీ వారిచే జాతీయ సామాజిక సేవ ఎక్సలెన్స్ అవార్డు (2012)
జలమిత్ర అవార్డు బంగారు పతకం & రూ. 50,000/- (2003)
వైయస్సార్ లైఫ్ ఆచీవ్మెంట్ అవార్డు (2022)
మూలాలు
[మార్చు]- ↑ Maa Nava Lokam (2025-01-28), Conversations with Dr. Y.V. Malla Reddy | AF Ecology | Ananthapur | Part 1, retrieved 2025-02-09