వై (నార్వే రైల్వే సంస్థ)
![]() | |
రకం | ప్రభుత్వ యాజమాన్య సంస్థ |
---|---|
పరిశ్రమ | రవాణా |
స్థాపన | 1996 డిసెంబరు 1 |
ప్రధాన కార్యాలయం | ఓస్లో, నార్వే |
సేవ చేసే ప్రాంతము | నార్వే, స్వీడన్ (ఓస్లో-గోథెన్‌బర్గ్ మార్గం) |
రెవెన్యూ | NOK 11 బిలియన్లు (2009) |
![]() | |
![]() | |
ఉద్యోగుల సంఖ్య | 10,646 (2006) |
మాతృ సంస్థ | నార్వే రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ |
అనుబంధ సంస్థలు | Vy బస్ Vy గ్యోవిక్‌బానెన్ Vy టాగ్ (స్వీడన్) కార్గోనెట్ |
వెబ్‌సైట్ | www.vy.no |
వైగ్రుప్పెన్, ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే సంస్థ. దీన్ని వై (Vy) అని అంటారు. ఇది నార్వేలో అత్యధిక ప్రయాణీకుల రైలు సేవలను, అనేక బస్సు సేవలనూ నిర్వహిస్తుంది. గతంలో దీన్ని నార్వేజియన్ స్టేట్ రైల్వేస్ (NSB) అనేవారు. ఈ సంస్థ నార్వేజియన్ రవాణా మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. దీని ఉప-బ్రాండ్లలో వై బస్ కోచ్ సేవలు, కార్గోనెట్ సరుకు రవాణా రైళ్లు, స్వీడిష్ రైలు రవాణా సంస్థ టాగ్కోంపానియెట్ లు ఉన్నాయి. 2009 లో NSB 52 మిలియన్ల రైలు ప్రయాణికులను, 104 మిలియన్ల బస్సు ప్రయాణికులను తీసుకెళ్లింది. 2019 ఏప్రిల్ 24 న ప్యాసింజర్ రైలు, బస్సు సర్వీసులను Vy గా రీబ్రాండ్ చేశారు.
ఈ కంపెనీని తొలుత నార్వేజియన్ స్టేట్ రైల్వేస్ (1883–1996) పేరుతో స్థాపించారు. 1996 లో కంపెనీని NSB, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జెర్న్‌బానెవర్‌కెట్, నార్వేజియన్ రైల్వే ఇన్‌స్పెక్టరేట్ అనే మూడు సంస్థలుగా విభజించారు. 2002 లో సరుకు రవాణా కార్యకలాపాలను విడదీసి అనుబంధ సంస్థ కార్గోనెట్ ఏర్పాటు చేసారు. నిర్వహణ విభాగం మాంటెనాగా మారింది. [1] 2019 లో దీనికి వివాదాస్పదమైన వైగ్రూప్పెన్ అని పేరు మార్చారు; అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఆ పేరు మార్పును రద్దుచేస్తామని ప్రతిజ్ఞ చేశాయి.
చరిత్ర
[మార్చు]
20వ శతాబ్దంలో నార్వేజియన్ రైల్వే చరిత్రలో అతిపెద్ద మార్పు 1996 డిసెంబరు 1 న సంభవించింది. పాత నార్వేజియన్ స్టేట్ రైల్వేను మూడు ప్రత్యేక ప్రభుత్వ సంస్థలుగా విభజించారు. ట్రాక్ యాజమాన్యం, నిర్వహణ, నిర్మాణం కొత్తగా సృష్టించబడిన ప్రభుత్వ సంస్థ నార్వేజియన్ నేషనల్ రైల్ అడ్మినిస్ట్రేషన్‌గా మార్చి, అదే సమయంలో దేశంలోని అన్ని రైల్వే కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కొత్తగా నార్వేజియన్ రైల్వే ఇన్‌స్పెక్టరేట్‌ను సృష్టించారు. NSB పేరును NSB BA గా మార్చారు. ఇది పూర్తిగా రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. అలాగే, NSB బిల్ట్రాఫిక్ (ఇప్పుడు Vy Buss) NSB ఐన్‌డోమ్ (తరువాత ROM ఐన్‌డోమ్, 2017 లో బేన్ NOR ఐన్‌డోమ్) అనే అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసారు.
1998 లో కొత్త ఓస్లో విమానాశ్రయం, గార్డెర్మోయెన్‌ను ప్రారంభించారు. 1980ల నుండి చాలా చిన్నదిగా ఉన్న పాత ఓస్లో విమానాశ్రయమైన ఫోర్నెబు స్థానంలో ఇది వచ్చింది. కొత్త విమానాశ్రయాన్ని నిర్మించే రాజకీయ నిర్ణయంలో భాగంగా, NSB ద్వంద్వ ఆదేశాలను ఎదుర్కొంది. ఒక వైపు, పర్యావరణపరంగా స్థిరమైన గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడం అత్యవసరం. దీనితో ఓస్లో సెంట్రల్ స్టేషన్ నుండి విమానాశ్రయం వరకు 56-కిలోమీటరు (35 మై.) ల పొడవున హై-స్పీడ్ రైల్వేను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రయాణ సమయం 19 నిమిషాలకు పడిపోతుంది. అదే సమయంలో, విమానాశ్రయ అభివృద్ధి పన్ను చెల్లింపుదారులపై ఆర్థికంగా భారం పడకూడదని రాజకీయ నిబంధనలు నిర్దేశించాయి; అందువల్ల, మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా విమానాశ్రయానికి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుబంధ సంస్థ ఓస్లో లుఫ్తావ్న్ AS నిధులు సమకూర్చడం, నిర్మించడం, నిర్వహించడం జరగ్గా, రైలు కనెక్షన్‌కు NSB అనుబంధ సంస్థ NSB గార్డెర్మోబనెన్ నిధులు సమకూర్చడం, నిర్మించడం, నిర్వహించడం జరిగింది. కానీ గార్డెర్మోయెన్ లైన్ నిర్మాణ సమయంలో రోమెరిక్ టన్నెల్‌లో లీకేజీ కారణంగా సమస్యలు తలెత్తాయి. ఫలితంగా బడ్జెట్ వ్యయం భారీగా పెరిగి సొరంగం పూర్తవడంలో ఆలస్యం జరిగింది. అయినప్పటికీ, నార్వే లోని మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే లైను 1998 అక్టోబరు 8న కొత్త విమానాశ్రయం ప్రారంభమైన సమయానికే సకాలంలో ప్రారంభించబడింది. అయితే రోమెరిక్ సొరంగాన్ని మాత్రం 1999 అక్టోబరు 22 వరకు తెరవలేదు. అంటే అనుకున్న సమయాని కంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆలస్యమైంది. ఈ రైలులో 168 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో, 210 km/h (130 mph) గరిష్ట వేగంతో 16 క్లాస్ 71 ఎలక్ట్రిక్ యూనిట్లను ఉపయోగిస్తారు.[2]
1990ల చివరలో కొత్త రోలింగ్ స్టాక్, కొత్త బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించడం ద్వారా NSB ని ఆధునికీకరించే ప్రయత్నాలు జరిగాయి. మొదటగా 22 El 18 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను సమకూర్చుకుంది. ఇవి దక్షిణ నార్వేలో ప్రయాణీకుల రైలు ట్రాఫిక్కు కోసం ఉద్దేశించారు. ఎల్ 16లు, ఎల్ 14లను సరుకు రవాణా విభాగానికి తరలించారు. ఎల్ 17లను రద్దు చేసి, షంటింగ్‌కు తగ్గించారు. లేదా ఫ్లాం లైన్‌కు విక్రయించారు. కొత్త లోకోమోటివ్‌లు 200 kilometres per hour (125 mph) వేగంతో నడిచేవి. డీజిల్ లైన్ల కోసం, NSB సీమెన్స్ నుండి 12 Di 6 ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఉత్తర నార్వేలో ఉండే శీతల వాతావరణంలో అవి సరిగా పనిచేయకపోవడంతో వాటిని వెనక్కి ఇచ్చేయవలసి వచ్చింది. NSB మూడు విశిష్టమైన పేర్లతో బ్రాండింగు చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంది: NSB సిగ్నేచర్ (ఎక్స్‌ప్రెస్ రైళ్లు), NSB అజెండా (ప్రాంతీయ రైళ్లు), NSB పల్స్ (స్థానిక రైళ్లు). అదే సమయంలో NSB, కొత్త ఎలక్ట్రిక్ బహుళ యూనిట్లను ఆర్డర్ చేసింది. వీటిలో మొదటిది కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవ, క్లాస్ 71 కోసం. దీని తర్వాత బెర్గెన్ లైన్, డోవ్రే లైన్, సోర్లాండెట్ లైన్‌లోని ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ఉపయోగించాల్సిన క్లాస్ 73 కి చెందిన 16 కొత్త సిగ్నేచర్ రైళ్లు టిల్టింగ్ టెక్నాలజీతో అమర్చబడ్డాయి. ఓస్లో, టెర్మినీ మధ్య ప్రయాణ సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమే తగ్గినప్పటికీ, ఇప్పటికే ఉన్న రైలు మార్గాన్ని ఉపయోగించి హై స్పీడ్ రైల్వే సేవను సృష్టించే ప్రయత్నం ఇది. ఈ రైళ్లు నీలం, బూడిద రంగులతో పెయింట్ చేయబడ్డాయి. దశాబ్దాలలో NSB నడుపుతున్న ఎరుపు రంగు కాని రైళ్లు మొదటివి ఇవే. అదే సమయంలో, NSB ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సేవలు, డీజిల్ సేవలను భర్తీ చేయడానికి అజెండాను ప్రవేశపెట్టినట్లు NSB ప్రకటించింది. క్లాస్ 70లను తిరిగి పెయింట్ చేసినప్పటికీ, 2001లో నార్డ్‌ల్యాండ్ లైన్, రౌమా లైన్, రోరోస్ లైన్‌లలోని డీజిల్ సర్వీసులను 15 కొత్త క్లాస్ 93 యూనిట్లతో అప్‌గ్రేడ్ చేశారు. ఇవి సౌకర్యంగా లేవని విమర్శలు వచ్చినప్పటికీ, రైల్వేలలో వేగాన్ని పెంచాయి. రౌమా లైన్, రోరోస్ లైన్‌లలో రాత్రి రైలు సేవలను కూడా NSB నిలిపివేసింది. 2002 నుండి, NSB 36 కొత్త ఎలక్ట్రికల్ లోకల్ రైళ్లను, క్లాస్ 72 ను కూడా అందుకుంది. వీటిని బూడిద/ఆకుపచ్చ రంగులో పెయింట్ చేసి (పల్స్ బ్రాండ్ పేరు ఉపయోగం కోసం). ఓస్లో కమ్యూటర్ రైల్, జెరెన్ కమ్యూటర్ రైల్‌లో వాడారుయ్. NSB ఇప్పుడు దాని రైలు ఉత్పత్తులపై బ్రాండ్ పేర్ల వాడకాన్ని నిలిపివేసింది.
2002 నాటికి బోండెవిక్ రెండవ మంత్రివర్గం నార్వేజియన్ రైల్వే రంగాన్ని మరింతగా నియంత్రించాలని భావించింది. జూలై 1న NSBని పరిమిత కంపెనీ NSB ASగా మార్చింది. IT విభాగాన్ని అనుబంధ సంస్థ అరైవ్‌గా మార్చింది. నిర్వహణ మాంటెనాగా మార్చారు. పాత సరుకు రవాణా రైలు విభాగాన్ని NSB గాడ్స్‌ను కార్గోనెట్‌గా మార్చగా, NSB స్వీడిష్ టాగ్‌కోంపానియెట్‌లో కొంత భాగాన్ని కూడా కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థలో 45% తరువాత స్టేటెన్స్ జార్న్‌వాగర్ వారస సంస్థ గ్రీన్ కార్గోకు విక్రయించబడింది. 2004 లో ప్రభుత్వం NSB గార్డెర్మోబానెన్‌ను రెండుగా విభజించి, కంపెనీ రుణాన్ని తొలగించి, దాని యాజమాన్యంలోని ట్రాక్‌ను జెర్న్‌బానెవర్‌కెట్‌కు, రైలు కార్యకలాపాలను కొత్తగా ప్రభుత్వ యాజమాన్యంలో ఏర్పరచిన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సంస్థకూ బదిలీ చేసింది.
2019 ఏప్రిల్ 24 న NSBని వైగ్రుప్పెన్ (Vygruppen) అని పేరు మార్చి, Vy గా రీబ్రాండ్ చేశారు (ఈ స్కాండినేవియన్ పదానికి అర్థం దృష్టి, దృక్పథం, అవలోకనం). [3] నార్వే భాషా మండలి నిర్వహించిన సర్వే ప్రకారం, పేరు మార్పుకు 7% మంది నార్వేజియన్లు మాత్రమే మద్దతు ఇచ్చారు.
సేవలు
[మార్చు]Vy మూడు ప్రధాన రకాల ప్రయాణీకుల రైలు రవాణాతో పనిచేస్తుంది: ఇంటర్‌సిటీ రైళ్లు, ప్రాంతీయ రైళ్లు, కమ్యూటర్ రైళ్లు.
నగరాల మధ్య సేవలు
[మార్చు]బెర్గెన్ లైన్‌లో సుదూర ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైళ్లు సేవలు అందిస్తాయి. ఈ నాలుగు రోజుల రైళ్లను సాంప్రదాయ లోకోమోటివ్ హాల్డ్ రైళ్లతో (ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు El18, కోచ్‌లు క్లాస్ 7 ) నడుపుతారు. ఈ మార్గాలలో WLAB2 స్లీపింగ్ కోచ్‌లతో కూడిన రాత్రి రైళ్ళు కూడా నడుస్తాయి.
ప్రాంతీయ సేవలు
[మార్చు]Vy కి రెండు ప్రాంతీయ రైలు సేవలు ఉన్నాయి. అన్ని ప్రాంతీయ రైళ్లకు కొత్త ఎరుపు, బూడిద రంగులు వేస్తారు. NSB గతంలో దాని ప్రాంతీయ సేవలలో అజెండా బ్రాండ్ పేరును ఉపయోగించింది.
ప్రాంతీయ సేవలు క్లాస్ 74 (R10 స్కీన్ – లిల్లేహమ్మర్ ), క్లాస్ 73b (R20 ఓస్లో S – హాల్డెన్ – ( గోథెన్‌బర్గ్ ))ని ఉపయోగిస్తాయి. ఈ సేవ ట్రంక్ లైన్, వెస్ట్‌ఫోల్డ్ లైన్, ఓస్ట్‌ఫోల్డ్ లైన్‌లలో గంటకోసారి అందించబడుతుంది. లిల్లేహామర్, స్కీన్‌ల మధ్య నడిచే రైళ్లు ఓస్లో విమానాశ్రయం, గార్డెర్మోయెన్‌కు సేవలు అందిస్తాయి. ఇది విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
- బెర్గెన్ - ఓస్లో (బెర్గెన్ లైన్)
- ఫౌస్కే - నార్విక్ (NSB-బస్సు)- స్టాక్‌హోమ్ (రైలు) (స్వీడన్)
- నార్విక్ - ట్రోమ్సో (NSB-బస్)
కమ్యూటర్ సేవలు
[మార్చు]బెర్గెన్, ఓస్లో, స్కీన్ వై నగరాల చుట్టూ క్లాస్ 69, క్లాస్ 72, క్లాస్ 74, క్లాస్ 75 ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు, క్లాస్ 92 డీజిల్ మల్టిపుల్ యూనిట్లను ఉపయోగించి కమ్యూటర్ రైలు సేవలను నిర్వహిస్తుంది. సేవలు సాధారణంగా గంట లేదా అర్ధ గంటకు ఒకసారి అందుబాటులో ఉంటాయి. NSB కమ్యూటర్ రైళ్లకు పల్స్ బ్రాండ్ పేరును ఉపయోగించేందుకు ప్రయత్నించింది. కొన్ని రైళ్లకు ఆకుపచ్చ రంగు వేసింది. పల్స్ బ్రాండ్ నిలిపివేయబడింది.
ఓస్లో కమ్యూటర్ రైలు క్లాస్ 69, క్లాస్ 72, క్లాస్ 75 తో కింది సేవలను అందిస్తుంది:
- L1 ( స్పిక్‌స్టాడ్ )– అస్కర్ –ఓస్లో– లిల్లెస్ట్రోమ్ (ట్రంక్ లైన్)
- L12 ఐడ్స్‌వోల్ –ఓస్లో–డ్రామెన్– కాంగ్స్‌బెర్గ్ (ట్రంక్ లైన్, సోర్లాండ్ లైన్)
- L13 డ్రామెన్– స్కోయెన్ –ఓస్లో– జెస్‌హీమ్ – డాల్ (ట్రంక్ లైన్, డ్రామెన్ లైన్)
- L14 అస్కర్– లిల్లెస్ట్రోమ్ – ఆర్నెస్ – కాంగ్స్వింగర్ ( కాంగ్స్వింగర్ లైన్ )
- L2 స్టాబెక్-ఓస్లో- స్కీ (ఓస్ట్‌ఫోల్డ్ లైన్)
- L21 స్టాబెక్ -ఓస్లో- మోస్ (ఓస్ట్‌ఫోల్డ్ లైన్)
- L22 స్కోయెన్–ఓస్లో– మైసెన్ –( రాకెస్టాడ్) (ఓస్ట్‌ఫోల్డ్ లైన్)
ఇతర ప్రయాణికుల రైలు సేవలు:
- బెర్గెన్ కమ్యూటర్ రైల్ : బెర్గెన్– వోస్ – క్లాస్ 69తో మిర్డాల్ (బెర్గెన్ లైన్)
- పోర్స్‌గన్ – నోటోడ్డెన్ (బ్రాట్స్‌బర్గ్ లైన్ ) Y1 క్లాస్ రైల్‌కార్‌తో
2005 లో నార్వేజియన్ రవాణా, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖతో పదేళ్ల ప్రజా సేవా బాధ్యత ఒప్పందం కోసం NSB అనుబంధ సంస్థ పబ్లిక్ టెండర్ బిడ్‌ను గెలుచుకున్న తర్వాత, గ్జోవిక్ లైన్‌లోని సేవలను NSB గ్జోవిక్‌బానెన్ (ఇప్పుడు వై గ్జోవిక్‌బానెన్)కు బదిలీ చేసారు. నార్వేజియన్ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రి లివ్ సిగ్నే నవర్సేట్ (సెంటర్ పార్టీ), ప్రభుత్వం (2006 నాటి) మరిన్ని రైలు మార్గాల కార్యకలాపాలను పబ్లిక్ టెండర్‌కు పెట్టడానికి మునుపటి ప్రభుత్వం చేసిన ప్రకటనలను నిలిపివేస్తుందని ప్రకటించారు.
రోలింగ్ స్టాక్
[మార్చు]


నార్వేజియన్ ప్యాసింజర్ రైలు విభాగంలో 36 క్లాస్ 72, 82 క్లాస్ 69 ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (EMU), 14 క్లాస్ 92 డీజిల్ మల్టిపుల్ యూనిట్లు (DMU) ఉన్నాయి. కంపెనీ ప్రాంతీయ, ఇంటర్‌సిటీ రైళ్ల కోసం మరో 22 క్లాస్ 73, 16 క్లాస్ 70 EMUలు, క్లాస్ 93 DMUలు ఉన్నాయి. వీటిని క్లాస్ 5, క్లాస్ 7 ప్యాసింజర్ కార్లను మోసుకెళ్లే 22 El 18, 5 Di 4 లోకోమోటివ్‌లు కూడా అందిస్తున్నాయి. దాని యజమాని నుండి లాభదాయకం కాని మార్గాలలో రైళ్ళు నడపడానికి Vy కి దాని యజమాని - ప్రభుత్వం - నుండి సబ్సిడీలు లభిస్తాయి. అయితే Gjøvik లైన్‌లోని సేవలు ప్రజా సేవా బాధ్యతలకు లోబడి ఉంటాయి. దీనిని Vy అనుబంధ సంస్థ Vy గ్యోవిక్‌బానెన్ నిర్వహిస్తుంది.
1990లలో NSB, రోలింగ్ స్టాక్‌ను ఆధునీకరించుకుంది. బహుళ యూనిట్ల సముదాయాన్ని విస్తరించింది. సాంప్రదాయ లోకోమోటివ్-హౌల్డ్ రైళ్లను విరమించుకుంది. చాలా లోకోమోటివ్‌లను సరుకు రవాణా సంస్థ కార్గోనెట్ ASకి విక్రయించారు. అయితే El18, Di4 మోడల్‌లు ప్యాసింజర్ రైళ్ల రవాణా కోసం ఉంచుకున్నారు. కొన్ని కొత్త రైళ్లు ఇబ్బందులతో సతమతమయ్యాయి. ముఖ్యంగా 2000 సంవత్సరంలో నేలాగ్ వద్ద లోహ ఫెటీగ్ కారణంగా ఇరుసు విరిగిపోవడం వల్ల కొత్త క్లాస్ 73 రైలు తక్కువ వేగం వద్ద పట్టాలు తప్పింది. అయితే, 2005 నాటికి, ఈ రైళ్లు సంతృప్తికరంగా పనిచేస్తున్నాయి.
2008 ఆగస్టులో NSB క్లాస్ 74, 75 రకాలకు చెందిన 50 కొత్త ఐదు-కార్ల ఎలక్ట్రిక్ బహుళ యూనిట్లను ఆర్డర్ చేసినట్లు ప్రకటించింది. [4] ఇవి గ్రేటర్ ఓస్లో ప్రాంతంలో స్థానిక సేవకు (24 సెట్లు), దక్షిణ నార్వేలో ప్రాంతీయ సేవకూ (26 సెట్లు) ఉపయోగించబడతాయి. 2012 కి వీయ్టిని డెలివరీ చెయ్యాల్సి ఉంది గానీ, పరీక్ష సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఆలస్యమైంది. ఆ సమయానికి రైలు నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగం డబుల్ ట్రాక్‌గా అప్‌గ్రేడ్ చేయబడుతుందని భావిస్తున్నారు, దీని వలన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. [5] ఈ ఒప్పందం విలువ దాదాపు 840 మిలియన్ల స్విస్ ఫ్రాంక్‌లు. NSBకి అదనంగా 100 సెట్‌లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. [6] ఈ రైళ్లు నార్వేజియన్ వాతావరణంలో పనిచేయడానికీ, గరిష్టంగా 200 km/h (125 mph) వేగంతో ప్రయాణించడానికీ తయారుచేసారు.
లోకోమోటివ్‌లు
[మార్చు]- 2 డి 2 తరగతి డీజిల్ షంటర్‌లు
- 9 El 17 తరగతి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, మూడు షంటింగ్ కోసం ఉపయోగించబడతాయి. ఆరు ఫ్లాం లైన్‌లో నడుస్తాయి.
- 22 El 18 తరగతి ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, అన్ని ప్రధాన విద్యుదీకరించబడిన లైన్లలో ఉపయోగించబడతాయి.
ఎలక్ట్రిక్ బహుళ యూనిట్లు
[మార్చు]- 80 క్లాస్ 69 క్లాస్ 2-కార్ లేదా 3-కార్ల కమ్యూటర్ రైళ్లు, ఓస్లో, బెర్గెన్ చుట్టూ ఉపయోగించబడతాయి.
- 16 క్లాస్ 70 క్లాస్ 4-కార్ల ఇంటర్‌సిటీ (మీడియం దూరం) రైళ్లు, ఓస్లో చుట్టూ ఉపయోగించబడతాయి.
- 36 క్లాస్ 72 క్లాస్ 4-కార్ల కమ్యూటర్ రైళ్లు, ఓస్లో చుట్టూ ఉపయోగించబడతాయి.
- 16 క్లాస్ 73A క్లాస్ 4-కార్ల ఇంటర్‌సిటీ రైళ్లు, ఓస్లో లోపల, వెలుపల సేవలకు ఉపయోగించబడతాయి.
- ఓస్ట్‌ఫోల్డ్ లైన్‌లో ఉపయోగించే క్లాస్ 73 కు చెందిన 6 క్లాస్ 73B క్లాస్ 4-కార్ ప్రాంతీయ వెర్షన్.
- స్టాడ్లర్ FLIRT ఆధారంగా 50 క్లాస్ 74 ఇంటర్‌సిటీ రైళ్లు, క్లాస్ 75 కమ్యూటర్ రైళ్లను ప్రవేశపెట్టారు. 2012 మే 2 న మొదటి ఆపరేషన్‌తో. [7]
డీజిల్ రైలు కారు
[మార్చు]- 3 Y1 స్కీన్, నోటోడెన్ మధ్య బ్రాట్స్‌బర్గ్ లైన్‌లో 2015 వరకు ఉపయోగించబడింది.
క్యారేజీలు
[మార్చు]- ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు లేని ప్రయాణీకుల బండ్లు B3-సిరీస్ (అతి పురాతనమైనవి), B5-సిరీస్, B7-సిరీస్. B5-, B7-సిరీస్‌లను సుదూర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వాడుతున్నారు. అయితే ఆకుపచ్చ రంగులో ఉన్న B3-సిరీస్‌లను ఫ్లాం లైన్ (మిర్డాల్-ఫ్లామ్)లోని పర్యాటక రైళ్లలో ఉపయోగిస్తారు.
అనుబంధ సంస్థలు
[మార్చు]- అరైవ్ (ఐటి సేవలు) - పూర్తి యాజమాన్యం
- Vy Buss (బస్సు కార్యకలాపాలు) - పూర్తి యాజమాన్యం
- Vy గ్యోవిక్‌బ్నానెన్ (Gjøvik లైన్‌లో రైలు సేవలు) - యాజమాన్యం
- Vy Tåg (స్వీడన్) - యాజమాన్యం
- కార్గోనెట్ AS - యాజమాన్యం
- ట్రాఫిక్‌సర్వీస్‌లో 55%, మిగిలిన 45% ISS (క్లీనింగ్ సర్వీసెస్) యాజమాన్యంలో ఉన్నాయి.
వై టోగ్
[మార్చు]2020 డిసెంబర్ నుండి ప్రారంభమైన నార్వేజియన్ రైల్వే డైరెక్టరేట్ ద్వారా బెర్గెన్ లైన్‌లోని అన్ని ప్యాసింజర్ రైళ్లకు కాంట్రాక్టును వై అనుబంధ సంస్థ వై టోగ్ AS 2019 డిసెంబరు 9 న ప్రదానం చేసింది. [8] ఇందులో F4 ఓస్లో–బెర్గెన్ అనే సుదూర రైళ్లు, R40 బెర్గెన్–వోస్–మిర్డాల్ అనే ప్రాంతీయ రైళ్లు, L4 బెర్గెన్–అర్నా అనే స్థానిక రైళ్లు ఉన్నాయి.
ముఖ్య కార్యనిర్వాహకులు
[మార్చు]- 1996–2000: ఓస్ముండ్ ఉలాండ్
- 2000–2000: రాండి ఫ్లెస్‌ల్యాండ్ (నటన)
- 2000–2001: ఆర్నే వామ్ (నటన)
- 2001–2011: ఐనార్ ఎంగర్
- 2011–2019: గీర్ ఇసాక్సెన్
- 2020–ప్రస్తుతం: గ్రో బక్‌స్టాడ్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Tor Wisting. "Norges Statsbaner AS". Store norske leksikon. Retrieved October 1, 2016.
- ↑ [1] Archived అక్టోబరు 18, 2006 at the Wayback Machine
- ↑ NSB Group rebrands as Vy Archived 2020-10-24 at the Wayback Machine Railway Gazette International 25 April 2019
- ↑ Berglund, Nina. "NSB invests in new trains". Aftenposten. Archived from the original on 2008-08-21. Retrieved 2008-08-21.
- ↑ [2] Archived సెప్టెంబరు 27, 2013 at the Wayback Machine
- ↑ Solholm, Rolleiv. "New trains for Norwegian Railways". The Norway Post. Archived from the original on June 23, 2009. Retrieved 2008-08-21.
- ↑ "Første Flirt med passasjerene - VG". Vg.no. Retrieved 2015-10-29.
- ↑ "Traffic Package 3". Norwegian Railway Directorate. 2020-03-12. Archived from the original on 2023-02-26. Retrieved 2023-02-26.