వొంగిమళ్ళ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వొంగిమళ్ళ, వైఎస్ఆర్ జిల్లా, వీరబల్లె మండలానికి చెందిన గ్రామము. [1]వీరబల్లి మండల కేంద్రానికి ఉత్తర సరిహద్దు అయిన మాండవ్య నదికి ఉత్తర భాగము వంగిమళ్ళ గ్రామం. ఈ ప్రాంతంలో పాలకొండలు పశ్చిమానికి వంగడంవల్ల ఈ గ్రామానికి వొంగిమళ్ల అని పేరు వచ్చింది. గ్రామము పాలకొండల అడుగున గంగనవాగుకు ఎడమవైపున ఉంది. మాండవ్య నది వంపులు తిరిగిన గండిలో ప్రవేశించి గడికోట వైపు ప్రవహించడానికి ఒక కిలోమీటరు ముందు గంగనవాగు అందులో కలుస్తుంది. వొంగిమళ్ల రాయచోటి నుండి వీరబల్లె రోడ్డు ద్వారా 18 కిలోమీటర్ల దూరములో ఉంది. గ్రామములో ఒక సహకార సంఘమున్నది.

వొంగిమళ్ళ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం వీరబల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,688
 - పురుషుల సంఖ్య 2,846
 - స్త్రీల సంఖ్య 2,842
 - గృహాల సంఖ్య 1,479
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వొంగిమళ్లలో అనేక గుళ్లు ఉన్నాయి. వాటిలో ఊరికి ఉత్తరం వైపు పాలకొండల దగ్గర ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం అన్నింటికంటే పెద్దది. ఆలయం ముందున్న మంటపంలో 8 స్థంబాలపై కళాత్మకమైన విష్ణువున దేవతల విగ్రహములు చెక్కబడి ఉన్నాయి. గుడి ముందు విజయనగర కాలము నాటి (శా.1466 లేదా క్రీ.శ 1544) శిలాశాసనం ఉంది.

వొంగిమళ్ల దగ్గర కుగ్రామమైన రాచపల్లెలో అరిణమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంది. ఈ దేవత విగ్రహం భయంకరరూపంతో 9 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉంది. దేవత కళ్లు నారింజల పరిమాణములో, శరీరం తలలతో బీభత్సంగా ఉంది. ఇది దేవరాయల కాలం (శా.1336) నాటి ఆలయమని భావిస్తున్నారు.

పల్లెలు[మార్చు]

రామన్ వాండ్ల పల్లె

టెంకాయచెట్లపల్లె

దుగ్గనపల్లె

నాగిరెడ్డిగారిపల్లె

పెద్దమాదిగపల్లె

మూలాలు[మార్చు]

  • Madras District Gazetteers : District Gazetteer Cuddapah By C.F. Brackenbury.
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=వొంగిమళ్ళ&oldid=2055799" నుండి వెలికితీశారు