వోఖా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వోఖా
ముద్దుపేరు(ర్లు): 
ల్యాండ్ ఆఫ్ ప్లెంటీ
వోఖా is located in Nagaland
వోఖా
వోఖా
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
నిర్దేశాంకాలు: 26°06′N 94°16′E / 26.1°N 94.27°E / 26.1; 94.27Coordinates: 26°06′N 94°16′E / 26.1°N 94.27°E / 26.1; 94.27
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లావోఖా
సముద్రమట్టం నుండి ఎత్తు
1,313 మీ (4,308 అ.)
జనాభా
(2011)[1]
 • మొత్తం35,004
భాషలు
 • స్థానికిలోథా
 • అధికారికఇంగ్లీష్
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
797111
వాహనాల నమోదు కోడ్ఎన్ఎల్ - 05
జాలస్థలిnagaland.gov.in

వోఖా, నాగాలాండ్ రాష్ట్రంలోని వోఖా జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. మున్సిపాలిటీగా కూడా మారింది. ఇది రాష్ట్ర రాజధాని కోహిమాకు ఉత్తరాన 75 కి.మీ.ల దూరంలో ఉంది.

లోథా భాషలో వోఖా అంటే జన గణన లేదా జనాభా లెక్క అని అర్థం. ఈ పట్టణంలో 35,004 జనాభా ఉంది.[1] ఇక్కడ ప్రధానంగా లోథా నాగా ప్రజలు నివసిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

ఈ వోఖా ప్రాంతం 1876లో బ్రిటిష్ కాలంలో అస్సాం పరిధిలోని నాగా కొండల జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేయబడింది. 1878 నాటికి కోహిమా నగరాన్ని ప్రధాన కార్యాలయంగా మార్చడంతో, వోఖా ఉపవిభాగంగా ఉండిపోయింది. 1889లో ఈ ఉపవిభాగం కూడా మొకొక్‌ఛుంగ్ కు మార్చబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1957లో వోఖా పట్టణం నాగా హిల్స్ తుఏన్‌సాంగ్ పరిధిలోని ఉప విభాగంగా మారింది. 1973లో జిల్లాగా ఏర్పడింది.

భౌగోళికం, వాతావరణం[మార్చు]

వోఖా పట్టణం 26°06′N 94°16′E / 26.1°N 94.27°E / 26.1; 94.27 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 1,313 మీటర్ల (4,793 అడుగుల) ఎత్తులో ఉంది. ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. వోఖా పట్టణంలో వేసవికాలంలో 16.1-32 డిగ్రీల ఉష్ణోగ్రత, శీతాకాలంలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత 17.8 డిగ్రీలు ఉండగా, సగటు వార్షిక వర్షపాతం 1,940 మి.మీ. ఉంటుంది.

జనాభా[మార్చు]

నాగాలాండ్‌ రాష్ట్రంలో దీమాపూర్, కోహిమా తరువాత వోఖా మూడవ అతిపెద్ద పట్టణం. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్ణంలో 35,004 జనాభా ఉంది. పట్టణంలో 96% అక్షరాస్యత ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 97% కాగా, స్త్రీ అక్షరాస్యత 95% గా ఉంది. మొత్తం జనాభాలో 10.57% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ జనాభాలో 92% మంది క్రైస్తవులు, 5% మంది హిందువులు, 2% మంది ముస్లింలు ఉన్నారు.[1]

ఇక్కడి ప్రజలు, ఈ ప్రాంత స్థానిక భాషైన లోథా భాషను ఎక్కువగా మాట్లాడుతారు. అలాగే నాగమి, ఇంగ్లీష్ భాషలు కూడా మాట్లాడతారు. వోఖా పట్టణంలో డోయాంగ్ నది ఉంది. దానిపై జల విద్యుత్ కేంద్రం కూడా నిర్మించారు.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Wokha City Population Census 2011 - Nagaland". www.census2011.co.in. 2015.
  2. "Falling Rain Genomics, Inc - Wokha". Fallingrain.com. Retrieved 5 January 2021.
  3. "Wokha lauded for zero killing of Amur Falcons". www.easternmirrornagaland.com. 4 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=వోఖా&oldid=3091414" నుండి వెలికితీశారు