వోరార్ల్‌బెర్గ్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
Vorarlberg | |
---|---|
![]() | |
Country | ![]() |
Capital | Bregenz |
ప్రభుత్వం | |
• Governor | Herbert Sausgruber (ÖVP) |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,601 కి.మీ2 (1,004 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 3,72,791 |
• సాంద్రత | 140/కి.మీ2 (370/చ. మై.) |
ప్రామాణిక కాలమానం | UTC+1 (CET) |
• Summer (DST) | UTC+2 (CEST) |
ISO 3166 కోడ్ | AT-8 |
NUTS Region | AT3 |
Votes in Bundesrat | 3 (of 62) |
జాలస్థలి | vorarlberg.at |
వోరార్ల్‌బెర్గ్ అనేది ఆస్ట్రియాలో పాశ్చాత్య సమాఖ్య-రాష్ట్రం (భూమి ). ఇది భూభాగ విస్తీర్ణం పరంగా (వియన్నా చాలా చిన్నది) మరియు జనాభా పరంగా (బర్జెన్‌ల్యాండ్ తక్కువ జనాభాను కలిగి ఉంది) రెండవ అతిచిన్న రాష్టమైనప్పటికీ, ఇది మూడు దేశాలకు సరిహద్దుగా ఉంది: జర్మనీ (బావారియా మరియు కాంస్టాన్స్ సరస్సు ద్వారా బాడెన్-వుట్టెంబర్గ్), స్విట్జర్లాండ్ (గ్రౌబండెన్ మరియు సెయింట్ గాలెన్) మరియు లిచెస్టెన్‌సైన్. వోరార్ల్‌బర్గ్‌తో ఒక సరిహద్దును పంచుకుంటున్న ఏకైక ఆస్ట్రియా సమాఖ్య రాష్ట్రం టేరోల్, ఇది తూర్పు సరిహద్దును పంచుకుంటుంది.
వోరార్ల్‌బర్గ్ యొక్క రాజధాని బ్రెజెంజ్, అయితే డోర్న్‌బిర్న్ మరియు ఫెల్డ్కిర్చ్‌లు జనాభా పరంగా అతిపెద్ద నగరాలు. వోరార్ల్‌బర్గ్ అనేది అలెమానిక్ యాస మినహా ఒక ఆస్ట్రో-బావారియాన్ భాషను మాట్లాడని ఆస్ట్రియాలోని ఏకైక ప్రావెన్సీగా చెప్పవచ్చు; కనుక ఇది సాంస్కృతికంగా బావారియా మరియు మిగిలిన ఆస్ట్రియా మినహా దాని అలెమానిక్ మాట్లాడే సమీప స్విట్జర్లాండ్, లిచెస్టెన్‌సైన్ మపియు స్వాబియాలతో అత్యధిక సారూప్యతలను కలిగి ఉంది.
విషయ సూచిక
భౌగోళిక స్థితి[మార్చు]
వోరార్ల్‌బర్గ్‌లో ప్రధాన నదుల్లో Ill (రైన్‌లోని మోంటాఫోన్ మరియు వాల్గౌ లోయల్లో ప్రవహిస్తుంది), రైన్ (స్విట్జర్లాండ్‌కు సరిహద్దును ఏర్పరుస్తుంది), బ్రెజెంజెర్ యాక్ మరియు డోర్న్‌హిర్నెర్ యాక్‌లు ఉన్నాయి. కాన్‌స్టాన్స్ సరస్సు మినహా ముఖ్యమైన సరస్సుల్లో లునార్ సరస్సు, సిల్వ్రెట్టా సరస్సు, వెర్ముంట్ సరస్సు, స్పుల్లెర్ సరస్సు, కోప్స్ బాసిన్ మరియు ఫార్మారిన్ సరస్సులు ఉన్నాయి; మొదటి నాలుగు సరస్సులను జలవిద్యుత్తు శక్తి ఉత్పత్తి కోసం రూపొందించారు. అయితే విద్యుత్తు కర్మాగారం కోసం ఆనకట్టను నిర్మించడానికి ముందు, లునార్ సరస్సు ఆల్ప్స్‌లో అతిపెద్ద పర్వత సరస్సుగా ఉండేది. ఈ జలవిద్యుత్తు శక్తిలో అత్యధిక భాగాన్ని రద్దీ సమయాల్లో జర్మనీకి ఎగుమతి చేస్తారు. రాత్రి సమయాల్లో, జర్మనీలోని కర్మాగారాల నుండి విద్యుత్‌ను కొన్ని సరస్సులోకి మళ్లీ నీటికి పంపేందుకు ఉపయోగిస్తారు.
వోరార్ల్‌బర్గ్‌లో పలు ముఖ్యమైన పర్వత శ్రేణులు ఉన్నాయి, వాటిలో సిల్వ్రెట్టా, రాటికాన్, వెర్వాల్ మరియు ఆర్ల్‌బెర్గ్‌లు ఉన్నాయి, ఇక్కడ పలు ప్రజాదరణ పొందిన స్కైయింగ్ ప్రాంతాలు (ఆర్ల్‌బెర్గ్, మోంటాఫాన్, బ్రెజెంజెర్ వాల్డ్) మరియు స్కై రిసార్ట్‌లు (లెచ్, జుర్స్, శ్రురన్స్, వార్త్, డాముల్స్, బ్రాండ్ మరియు మరిన్ని) ఉన్నాయి. డాముల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వార్షిక హిమపాతాన్ని కలిగి ఉన్న పురపాలక సంఘం వలె కూడా పేరు గాంచింది (సగటున 9.30 మీటర్లు). అత్యధిక ఎత్తు గల పర్వతం పిజ్ బుయిన్, దీని రాళ్ల అగ్రభాగం 3,312 మీటర్ల ఎత్తులో మంచుదిబ్బలతో నిండి ఉంటుంది. వోరార్ల్‌బర్గ్ మొత్తం తూర్పు ఆల్ప్స్‌లో పరిమిత నిరోధాల్లో అత్యంత అందమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది. కాన్‌స్టాన్స్ సరస్సు మరియు రైన్ లోయ నుండి మధ్యస్థ ఎత్తు మరియు ఉన్నత ఆల్పైన్ మండలాల గుండా సిల్వ్రెట్టే పరిధి యొక్క మంచుదిబ్బలకు మధ్య దూరం సుమారు 90 కి.మీ.
పరిపాలనా విభాగాలు[మార్చు]
వోరార్ల్‌బర్గ్ ఉత్తరం నుండి దక్షిణానికి నాలుగు అతిపెద్ద జిల్లాలు వలె విభజించబడింది: బ్రెజెంజ్, డోర్న్‌బిర్న్, ఫెల్డ్కిర్చ్ మరియు బ్లుడెంజ్. ఈ జిల్లాలు ఆటోమొబైల్ లైసెన్స్ పలకలపై కింది సంక్షిప్త రూపాల్లో కనిపిస్తాయి: B, DO, FK మరియు BZ.
ఆర్థిక వ్యవస్థ[మార్చు]
పలు సంవత్సరాలుగా, వోరార్ల్‌బర్గ్ ఆర్థిక వ్యవస్థ ఆస్ట్రియా సగటుకు ఎగువన ఉత్తమంగా ఉంది. 2005లో మొత్తం ఆస్ట్రియాన్ GDP నిజ సమయాల్లో "సుమారు" 2.0% పెరగగా, వోరార్ల్‌బర్గ్ రికార్డ్ స్థాయిలో 2.9% పెరుగుదలను నమోదు చేసింది. ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, ముఖ్యంగా జర్మనీ మరియు ఇటలీల్లో ప్రధాన వ్యాపార భాగస్వామ్యులు సరైన లాభాలను పొందలేదు. ఈ కచ్చితమైన ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారంగా, వోరార్ల్‌బర్గ్ 2004లో దాని నికర ప్రాంతీయ ఉత్పత్తిని 11.5 బిలియన్ EURకు పెంచుకున్నట్లు వోరార్ల్‌బర్గ్ చాంబర్ ఆఫ్ ట్రేడ్ యొక్క ఆర్థిక విధాన విభాగం పేర్కొంది. దీని ప్రకారం ఇది నామమాత్ర పెరుగుదల 5.0%ను నమోదు చేసింది (ఆస్ట్రియా మొత్తం +4.0% నమోదు చేసింది). వోరార్ల్‌బర్గ్‌లో ఒక నివాసికి ప్రాంతీయ ఆదాయం 31,000 EUR, ఇది ఆస్ట్రియా దేశ సగటు కంటే 8% ఎక్కువ. వోరార్ల్‌బర్గ్ మరియు ముఖ్యంగా రైన్ కోనలను ప్రపంచంలోని అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటిగా చెప్పవచ్చు, ఇక్కడ ఉన్నత స్థాయి జీవనం కనిపిస్తుంది. రైన్ కోనలో అభివృద్ధి చెందుతున్న టెక్స్‌టైల్, దుస్తుల తయారీ, ఎలక్ట్రానిక్స్, మెషనరీ మరియు ప్యాకింగ్ సామగ్రితో సహా, ఇక్కడ పలువురు వ్యవసాయంపై కూడా ఆధారపడతారు, ముఖ్యంగా బ్రెజెంజెర్‌వాల్డ్ దాని పాల ఉత్పత్తులు ("బ్రెజెంజెర్‌వాల్డెర్ చీజ్ రూట్") మరియు పర్యాటక రంగానికి పేరు గాంచింది. పర్యాటక రంగంలో అత్యధిక సంఖ్యలో వ్యక్తులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో పర్వతాలు మరియు పలు స్కై రిసార్ట్‌లు ఉన్నాయి, వీటిలో అతిపెద్ద (మరియు అత్యంత ప్రజాదరణ పొందిన) అంశాలు:
- బ్రెజెంజెర్‌వాల్డ్,
- ఆర్ల్‌బెర్గ్ ప్రాంతం (ఉన్నత స్థాయి స్కై రిసార్ట్స్ లెచ్ మరియు జుర్స్‌లతో సహా),
- బ్రాండ్నెర్టాల్ మరియు
- మోంటాఫోన్.
ఈ ప్రాంతాల్లోని ప్రముఖ స్కైర్‌ల్లో అనితా వాచ్టెర్, ఎగాన్ జిమెర్మాన్, గెర్హార్డ్ నెన్నింగ్, మారియో రైటెర్, హ్యూబెర్ట్ స్ట్రోల్జ్, హానెస్ ష్నెడెర్ మరియు స్కై జంపర్ టోనీ ఇన్నౌర్‌లు ఉన్నారు. [2]
జనాభా[మార్చు]
వోరార్ల్‌బర్గ్‌లో జనాభా 372,500. ఇక్కడ నివాసుల్లో ఎక్కువమంది (86%) పశ్చిమ భాగంలో స్విట్జర్లాండ్ మరియు లిచ్టెన్‌స్టైన్‌తో మరియు ఉత్తర భాగంలో జర్మనీతో ఒక సాంస్కృతిక అనుసంధానంతో ఆస్ట్రియా-జర్మన్ ప్రజలు. జనాభాలోని ఒక అత్యధిక జనాభా యొక్క పూర్వీకులు ఆస్ట్రో-హంగేరియన్ చక్రవర్తి కాలంలో ముట్టడి కారణంగా 19వ శతాబ్దంలో స్విస్ ఫ్రెంచ్‌కో సహా "వాల్సెర్‌ల" వలసల్లో వాలాయిస్ యొక్క స్విస్ కాంటన్ నుండి చేరుకున్నారు.[ఉల్లేఖన అవసరం]
మతం[మార్చు]
జనాభాలోని 78% మంది రోమన్ క్యాథలిక్‌లు, దీనితో వోరార్ల్‌బర్గ్ జాతీయ ఆస్ట్రియాన్ సగటు (73.6%) వరుసలో నిలిచింది, 7,817 వోరార్ల్‌బర్గ్ నివాసులు ప్రొటెస్టాంట్ (2.2%). రెండవ అతిపెద్ద మతపరమైన నామవర్గీకరణం ఇస్లామ్, వీరు 8.4% మంది ఉన్నారు (ప్రధానంగా టర్కీష్ వలసదారులు).
భాష[మార్చు]
వారి ప్రాంతం మిగిలిన ఆస్ట్రియా నుండి ప్రత్యేకించబడటం వలన, వోరార్ల్‌బర్గ్‌లో అత్యధిక ప్రజలు ఇతర ఆస్ట్రియాన్లు అర్థం చేసుకోవడానికి కష్టపడే చాలా వైవిధ్యమైన జర్మన్ మాండలికంలో మాట్లాడతారు. ఇది ఒక అల్మానిక్ మాండలికాల్లో ఒకటి, ఇది స్విస్ జర్మన్‌ను కలిగి ఉంటుంది, అలాగే దీనిని లిచ్టెన్‌స్టైన్, బాడెన్-వ్రటెంబెర్గ్ మరియు ఫ్రాన్‌లోని ఆల్సాస్ ప్రాంతాల్లో కూడా మాట్లాడతారు. ఆస్ట్రియాలోని మిగిలిన ప్రాంతంలోని మాండలికాలను బ్రావారియాన్-ఆస్ట్రియాన్ భాష సమూహాలు మాట్లాడతారు. వోరార్ల్‌బర్గ్‌లోని పలు పట్టణాలు మరియు పల్లెలు కూడా వారి స్వంత వైవిధ్య ఉప మాండలికాలను కలిగి ఉన్నాయి.
చరిత్ర[మార్చు]
![]() | This విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. (January 2008) |
రోమన్లు వోరార్ల్‌బర్గ్‌ను ఆక్రమించడానికి ముందు, ఈ ప్రాంతంలో రెండు సెల్టిక్ తెగలు స్థిరపడ్డాయి: రాయిటి ఎగువ ప్రాంతాల్లో నివసించేవారు మరియు విండెలిసి దిగువ ప్రాంతాలు అంటే కాన్‌స్టాన్స్ సరస్సు మరియు రిన్ లోయల్లో నివాసాలను ఏర్పర్చుకున్నారు. విండెలిసిలో ముఖ్యమైన ఆవాసాల్లో ఒకటైన బ్రిగాంటియాన్ (నేడు బ్రెగెంజ్) 500 BCల్లో స్థాపించబడింది. దీనిని 15 BCలో రోమన్లు ఆక్రమించారు.
వోరార్ల్‌బర్గ్ అనేది రాయిటియాలోని రోమన్ ప్రావెన్సీలో రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది; తర్వాత దీనిని బావారీ (బావారియాలు) జాతి పరిపాలించింది. తర్వాత, ఈ ప్రాంతంలో బావారీ మరియు లాంగోబార్డ్స్‌లు స్థిరపడ్డారు మరియు ఇది తర్వాత 1525 వరకు కౌంట్స్ ఆఫ్ మోంట్ఫోర్ట్ పాలనలో వచ్చింది, తర్వాత హాబ్స్‌బర్గ్స్ అధికారాన్ని పొందారు.[1] మాజీ బిషోప్రిక్స్ కలిసి నివసించే చారిత్రక జర్మనీక్ ప్రావెన్సీని ఇప్పటికీ కొన్ని పాక్షిక స్వయంపాలిత కౌంట్‌ల్లో భాగంగా నిర్వహించబడుతుంది మరియు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు బిషోప్రిక్స్ మునుగడ కొనసాగింది. వోరార్ల్‌బర్గ్ అనేది ఫర్దెర్ ఆస్ట్రియాలో ఒక భాగం మరియు ప్రాంతంలోని భాగాలను కౌంట్స్ మోంట్ఫోర్ట్ ఆఫ్ వోరార్ల్‌బర్గ్ పరిపాలించింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, వోరార్ల్‌బర్గ్‌లో పలువురు స్విట్జర్లాండ్‌లో విలీనం కావాలని భావించారు.[2] వోరార్ల్‌బర్గ్‌లో 11 మే 1919న నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో, అక్కడ ప్రజల్లో 80% కంటే ఎక్కువమంది రాష్ట్రాన్ని స్విస్ సమాఖ్యలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. అయితే, ఈ ప్రతిపాదనను ఆస్ట్రియా ప్రభుత్వం, మిత్రరాజ్యాలు, స్విస్ లిబరెల్స్, స్విస్ ఇటాలియన్ మరియు స్విస్ ఫ్రెంచ్‌లు వ్యతిరేకించాయి.[3] [4]
వీటిని కూడా చూడండి[మార్చు]
- ప్రిన్సిపాల్ హోప్
గమనికలు[మార్చు]
- ↑ http://encyclopedia.farlex.com/Vorarlberg
- ↑ 1982 బ్రిటానికా, ఆస్ట్రియా చరిత్రపై కథనం
- ↑ C2D - Centre d'études et de documentation sur la démocratie directe
- ↑ [1]
బాహ్య లింకులు[మార్చు]
- ఆఫీసియల్ వెబ్సైట్
- ఇంటర్నెట్ పోర్టల్ ఫర్ వోరార్ల్‌బర్గ్
- వోరార్ల్‌బర్గ్ టూరిజం
- ల్యాండ్‌స్కేప్ ఆఫ్ వోరార్ల్‌బర్గ్
- సీ ఆల్ రెస్టారెంట్స్ ఆఫ్ వోరార్ల్‌బర్గ్ విత్ పిక్చర్స్
- ఎబౌట్ ది డయలెక్ట్ ఇన్ వోరార్ల్‌బర్గ్- ఇన్ జర్మన్
![]() |
Wikimedia Commons has media related to Vorarlberg. |
- గూగుల్ అనువాద వ్యాసాలు
- Articles with short description
- Infobox settlement pages with bad settlement type
- All articles with unsourced statements
- Articles with unsourced statements from April 2009
- విస్తరణ కోరబడిన వ్యాసములు from January 2008
- విస్తరణ కోరబడిన అన్ని వ్యాసములు
- Articles using small message boxes
- వోరార్ల్‌బెర్గ్
- యూరోపియన్ యూనియన్‌లో NUTS 2 గణాంక ప్రాంతాలు
- ఆస్ట్రియా రాష్ట్రాలు