వ్యాపార నమూనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక వ్యాపార నమూనా అనేది ఒక సంస్థ ఆర్థిక, సామాజిక, లేదా ఇతర రూపాలలో ఉండే విలువను[1] ఏవిధంగా నిర్ధారిస్తుంది, పంపిణీ చేస్తుంది మరియు హస్తగతం చేసుకుంటుంది అను విషయాల మూలాంశాలను వివరిస్తుంది. వ్యాపార నమూనా రూపకల్పన యొక్క ప్రక్రియ వ్యాపార విధానములో ఒక భాగము.

శాస్త్రీయ విధానములో మరియు వాడుకలో వ్యాపార నమూనా అను పదమును ఒక వ్యాపారము యొక్క విధానాల అనియత మరియు నియత వివరణలను సూచించుటకు విస్తృత శ్రేణిలో ఉపయోగిస్తారు, ఈ శ్రేణిలో కారణము, నజరానాలు, విధానాలు, ఉపకరణ సౌకర్యాలు, సంస్థ యొక్క నిర్మాణాలు, వ్యాపార పద్ధతులు, మరియు క్రియాత్మక విధానాలు మరియు పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఇది ఒక సంస్థ యొక్క సంపూర్ణ చిత్రమును ఉన్నత-స్థాయి కోణములో చూపిస్తుంది.

ఒక వ్యాపారమును స్థాపించినప్పుడు అది బహిర్గతంగా కానీ లేదా అంతర్గతంగా కానీ ఆ వ్యాపార సంస్థ ఉపయోగించుకున్న విలువ నిర్ధారణ, పంపిణీ, మరియు హస్తగత విధానాల రూపకల్పనను లేదా నిర్మాణమును వివరించే ఒక నిర్దిష్ట వ్యాపార నమూనాను ఉపయోగించుకోవచ్చు. వ్యాపార నమూనా యొక్క సిద్ధాంతం ఏమనగా ఇది వినియోగదారుడిని సంతృప్తికరంగా విలువను చెల్లించుటకు ఏవిధంగా ప్రోత్సహించాలి, మరియు ఆ చెల్లింపులను ఏ విధంగా లాభాల క్రింద బదలాయించాలి అనే విధానమును నిర్వచిస్తుంది: కాబట్టి ఇది వినియోగదారుడు ఏమి కోరుకుంటున్నాడు, ఏవిధంగా కోరుకుంటున్నాడు, మరియు ఒక సంస్థ వినియోగదారుడి అవసరాలను తీర్చుటకు ఎలాంటి ఉన్నత విధానాలను ఏవిధంగా అనుసరించాలి, వీటిన్నిటిని అందించినందుకు మూల్యమును అందుకోవటం, మరియు లాభమును ఆర్జించుట వంటి విషయాల గురించి నిర్వహణా విభాగం యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది[2].

వ్యాపార నమూనాలను వ్యాపారాలను వివరించుటకు మరియు విభజించుటకు (ప్రత్యేకంగా ఒక సంస్థాగత నిర్మాణములో) ఉపయోగిస్తారు, కాని వీటిని వ్యవస్థలలో ఉన్న నిర్వాహణాధికారులు భవిష్యత్తు అభివృద్ధి యొక్క అవకాశాల గురించి శోధించుటకు కూడా ఉపయోగిస్తారు. చివరిగా, ఉన్నత వ్యాపార నమూనాలను అత్యుత్తమ నిర్వహణాధికారులను ఎంపిక చేసుకొనుటకు మంచి ఉపకరణాలుగా ఉపయోగిస్తారు [3].

చరిత్ర[మార్చు]

అనేక సంవత్సరాలలో, వ్యాపార నమూనాలు అధునాతనము అయ్యాయి. బైట్ అండ్ హుక్ వ్యాపార నమూనా (దీనిని "రేజర్ అండ్ బ్లేడ్స్ వ్యాపార నమూనా" లేదా "టైడ్ ప్రొడక్ట్స్ వ్యాపార నమూనా" అని కూడా తెలుపుతారు) 20 వ శతాబ్ద ఆరంభములో పరిచయం చేయబడింది. ఈ నమూనాలో ఒక చిన్న ఉత్పత్తిని అతి తక్కువ ధరకు ఉత్పత్తి చేయుట, ఎక్కువగా నష్టానికి ("ఎర"), ఆ తరువాత ఆ నష్టాన్ని భర్తీ చేసుకొనుటకు లేదా సహఉత్పత్తులకు లేదా సేవలకు నష్టపరిహార మొత్తాలను వసూలు చేయుట ("కొక్కెం") ఉంటాయి. ఉదాహరణలు: రేజర్ (బైట్) మరియు బ్లేడ్స్ (హుక్) ; సెల్ ఫోన్స్ (బైట్) మరియు దానిలో మాట్లాడు సమయము (హుక్) ; కంప్యూటర్ ప్రింటర్లు (బైట్) మరియు ఇంకు కార్ట్రిడ్జ్ రీఫిల్స్ (హుక్) ; మరియు కెమెరాలు (బైట్) మరియు ప్రింట్లు (హుక్). ఈ నమూనా యొక్క ఒక ఆసక్తికర లక్షణం అడోబ్, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ దాని యొక్క డాక్యుమెంట్ రీడర్ ను ఉచితంగా ఇచ్చాడు కాని దాని యొక్క డాక్యుమెంట్ రైటర్ కొరకు అనేక వందల డాలర్లు వసూలు చేసాడు.

1950లలో, మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్స్ మరియు టయోట నుండి నూతన వ్యాపార నమూనాలు వచ్చాయి. 1960లలో ఉన్న, సృష్టికర్తలు వాల్-మార్ట్ మరియు హైపర్ మార్కెట్స్. 1970 లలో ఫెడ్ ఎక్స్ మరియు టాయ్స్ R Us ల నుండి; 1980లలో బ్లాక్ బస్టర్, హొం డిపాట్, ఇంటెల్, మరియు డెల్ కంప్యూటర్ నుండి; 1990లలో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్, నెట్ ఫ్లిక్స్, ఈబే, Amazon.com, మరియు స్టార్ బాక్స్ నుండి నూతన వ్యాపార నమూనాలు వచ్చాయి.

ఈరోజు, వ్యాపార నమూనాల యొక్క రకాలు సాంకేతికతని ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాము అనే విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, పారిశ్రామికవేత్తలు ఇంటర్నెట్లలో పూర్తిగా ప్రస్తుతం నడుస్తున్న లేదా ఆవశ్యకమైన సాంకేతికత మీద ఆధారపడుతున్న అత్యాధునిక నమూనాలను కూడా తయారు చేస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని, వ్యాపారాలు అతి తక్కువ ధరలో అసంఖ్యాక వినియోగదారులకు చేరువ కావచ్చు.

ఆదాయ నమూనాల ఉదాహరణలు[మార్చు]

 • బ్రిక్స్ మరియు క్లిక్స్ వ్యాపార నమూనా:
ఆఫ్ లైన్ (బ్రిక్స్ ) మరియు ఆన్ లైన్ (క్లిక్స్ ) రెండిటి యొక్క సమక్షములతో ఒక సంస్థ విలీనము చేసే వ్యాపార నమూనా. బ్రిక్స్-మరియు-క్లిక్స్ నమూనాకు ఒక ఉదాహరణ ఒక దుకాణాల సమాహారము ఒక వినియోగదారుడిని ఆన్ లైన్ లో ఒక ఉత్పత్తిని ఆర్డర్ చేయుటకు అనుమతి ఇచ్చి ఆ ఉత్పత్తిని వారి యొక్క స్థానిక దుకాణములో తెచ్చుకోవాలి అని చెప్పుట.
 • సమష్టి వ్యాపార నమూనాలు
వ్యాపార సంస్థలు లేదా భాగాస్వామ్య సంస్థలు సాధారణంగా ఒకే రంగానికి లేదా సారూప్య రంగాలకు సంబంధించిన అధిక సంఖ్య వ్యాపారముతో, వ్యాపారస్తులతో లేదా వృత్తి ఉద్యోగులతో, వనరులు, సమాచారమును పరస్పరం అందించుటను కలిపే లేదా వారి సభ్యులకు ఇతర ప్రయోజనాలను అందించు ఒక లాభదాయక ప్రయత్నముతో అల్లుకొని ఉంటాయి.
 • విడిభాగాల వ్యాపార నమూనా
ఒక సంస్థను రూపొందిచుటకు మరియు విశ్లేషించుటకు IBM చే అభివృద్ధి చేయబడినది. ఇది వ్యాపార అంశాలకు సంబంధించిన "నిర్మాణ విభాగముల" యొక్క ఒక ఊహాత్మక వృత్తాంతం లేదా రేఖా చిత్రం దీనిని ఒకే పేజీలో చిత్రించగలము. సంస్థ విధానము యొక్క అమరికను సంస్థ యొక్క సామర్ధ్యాలు మరియు పెట్టుబడులతో విశ్లేషించుటకు, నకలు లేదా పునరావృతం అయ్యే వ్యాపార సామర్ధ్యాలు మొదలగు వాటిని గుర్తించుటకు దీనిని ఉపయోగిస్తారు.
వెబ్ వాన్ ఉత్తర అమెరిక సూపర్ మార్కెట్ పరిశ్రమలో దళారీ వ్యవస్థను నిర్మూలించుటలో విఫలమైనప్పటికీ, అనేక సూపర్ మార్కెట్ సమాహారాలు (సేఫ్ వే ఇంక్. వంటివి) వెబ్ వాన్ సేవలను అందిస్తున్న నిచె మార్కెట్ ని లక్ష్యం చేసుకొనుటకు వారు వారి యొక్క స్వంత పంపిణీ సేవలను ఏర్పాటు చేసుకున్నారు.
 • దళారులను ప్రక్కన పెట్టే నమూనా
ఒక పంపిణీ వలయములో దళారులను తప్పించుట: "కటింగ్ అవుట్ ది మిడిల్ మాన్". ఒక రకం మధ్యవర్తిత్వం(పంపిణీదారుడు, టోకువ్యాపారి, దళారి, లేదా మధ్యవర్తి వంటి వారు) ఉండే సాంప్రదాయ పంపిణీ విధానాల ద్వారా వెళ్ళే బదులుగా సంస్థలు ఇప్పుడు నేరుగా ఉదాహరణకు ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుడితోనే నేరుగా సంప్రదించుట.
 • ప్రత్యక్ష అమ్మక నమూనా
ప్రత్యక్ష అమ్మకం ఉత్పత్తులను ఒక నిర్దిష్ట చిల్లర దుకాణములో కాకుండా నేరుగా వినియోగదారుడికే అమ్ముతుంది మరియు అమ్మకాలు నిర్వహిస్తుంది. అమ్మకాలు సాధారణంగా ప్రదర్శనల వంటి కార్యక్రమాల ద్వారా, ఒక్కొక్కరికి వారి గురించి వివరించుట ద్వారా, మరియు ఇతర వ్యక్తిగత సంబంధాల నిర్వహణల ద్వారా కాని జరుపుతారు. ఒక పాట్యాంశ పుస్తక నిర్వచనం ఏమిటంటే "సాధారణంగా వినియోగదారుడి ఉద్యోగ ప్రదేశములో కాని వారి ఇళ్ళ వద్ద కాని ప్రత్యక్ష వ్యక్తిగత ప్రదర్శన, వివరణ ఇచ్చి ఉత్పత్తి యొక్క అమ్మకం మరియు సేవలను అందించుట".[4]
 • పలు పంపిణీ వ్యాపార నమూనాలు,
 • ఫీ ఇన్, ఫ్రీ అవుట్
మొదటి వినియోగదారుడి నుండి సేవకు ధర వసూలు చేసి ఆ తరువాత వినియోగదారులకు ఉచితంగా సేవలను అందిస్తూ ఈ వ్యాపార నమూనా పని చేస్తుంది.
 • ఫ్రాంచైజ్
ఫ్రాంఛైజింగ్ అనేది మరొక సంస్థ విజయవంతమైన వ్యాపార నమూనాను ఉపయోగించుకునే వాడుక. ఫ్రాంఛైజర్ ప్రకారం, ఫ్రాంఛైజ్ అనేది సరకుల పంపిణీ కోసం ఛెయిన్ స్టోర్లను నిర్మించడానికి ప్రత్యామ్నాయ రూపం, ఇది మదుపు పెట్టదు ఛెయిన్‌ సంస్థపై బాధ్యతపడదు . ఫ్రాంఛైజీల విజయమే ఫ్రాంఛైజర్ విజయం. ఫ్రాంఛైజీకి ప్రత్యక్ష ఉద్యోగి కంటే ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని చెబుతుంటారు కారణం అతడు లేదా ఆమె వ్యాపారంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తారు.
 • ఫ్రీమియం వ్యాపార నమూనా
ప్రాథమిక వెబ్ సేవలను లేదా అధునాతన లేదా ప్రత్యేక సౌకర్యాల కొరకు ధరను వసూలు చేస్తూ డౌన్ లోడ్ చేయగలిగిన ఒక ప్రాథమిక డిజిటల్ ఉత్పత్తి అందిస్తూ ఈ వ్యాపార నమూనా పనిచేస్తుంది.[5]
 • పారిశ్రామికీకరణ సేవల వ్యాపార నమూనా
ఈ వ్యాపార నమూనాను సంస్థ యొక్క ప్రయోజనకర విధానాలు లోబడి ఉండే, స్ట్రాటజిక్ నిర్వహణలో(నిర్వహణాధికారి స్థాయి నిర్వహణ) మరియు సేవా సౌలభ్యంను ఒక సంస్థాగత ప్రక్రియగా భావించే సర్వీసెస్ వాణిజ్యంలో ఉపయోగిస్తారు.

ఇతర వ్యాపార నమూనాలు:

 • వేలం వ్యాపార నమూనా
 • ఆల్ ఇన్ వన్ వ్యాపార నమూనా
 • ఎబోక్యూబ్ వ్యాపార నమూనా
 • తక్కువ ఖర్చుతో నడిచే వ్యాపార నమూనా
 • ప్రోత్సాహక వ్యాపార నమూనాలు
 • గుత్తాధిపత్య వ్యాపార నమూనా
 • బహుళస్థాయి‌ మార్కెటింగ్ వ్యాపార నమూనా
 • నెట్ వర్క్ ప్రభావ వ్యాపార నమూనా
 • ఆన్ లైన్ వేలం వ్యాపార నమూనా
 • ఆన్ లైన్ విషయ వ్యాపార నమూనా
 • ప్రీమియం వ్యాపార నమూనా
 • వృత్తిపరమైన బాహ్య మూల నమూనా
 • పిరమిడ్ పథక వ్యాపార నమూనా
 • రేజర్ అండ్ బ్లేడ్స్ వ్యాపార నమూనా
 • సెర్విటైజేషన్ అఫ్ ప్రొడక్ట్స్ వ్యాపార నమూనా
 • సబ్‌స్క్రిప్షన్ వ్యాపార నమూనా

వ్యాపార నమూనా అంశాలు[మార్చు]

బిజినెస్ మోడల్ కాన్వాస్: తొమ్మిది వ్యాపార నమూనా నిర్మాణ భాగాలు, ఒస్టర్ వాల్డర్, పిగ్న్యుర్, & al. 2010[1]

వ్యాపార నమూనా రూపకల్పన నమూనా[మార్చు]

వ్యాపారం యొక్క నియతమైన వివరణలు దాని యొక్క కార్యకలాపాలను నిర్మించు విభాగాలు. అనేక వ్యాపార సిద్ధాంత సంకల్పనలు ఉన్నాయి.

ఒస్టర్ వాల్డర్ యొక్క పరిశోధన [1][6] విస్తృత శ్రేణి వ్యాపార నమూనా సిద్ధాంత సంకల్పనల మధ్య ఉండే సారూప్యాల ఆధారంగా వ్యాపార నమూనా కాన్వాస్ అని పిలిచే ఒక ఏక సూచన నమూనాను అందిస్తుంది.

ఈ వ్యాపార నమూనా రూపకల్పన నమూనా ద్వారా ఒక సంస్థ సులువుగా దాని యొక్క వ్యాపార నమూనాను వివరిస్తుంది. ఈ నమూనా యొక్క విషయాలు నిర్మాణము, నజరానా, వినియోగదారులు, పెట్టుబడులు మొదలైనవి.

భాగాస్వామ్యక వ్యవస్థల మధ్య వ్యాపార నమూనాల పరస్పర అవగాహన[మార్చు]

సహకార పరిశోధన మరియు సాంకేతికత యొక్క బాహ్య వనరుల ప్రవేశం గురించి అధ్యయనం చేసిన తరువాత, హమేల్ మొదలైన వారు (2010) వ్యాపార భాగస్వాములను నిర్ధారించాల్సి వచ్చినప్పుడు రెండు పక్షాల వ్యాపార నమూనాలు పరస్పరం ఒకేగా ఉన్నాయి అని నిర్ధారించుకొనుట ముఖ్యం అని కనుగొన్నాడు. ఉదాహరణకు, సమర్ధవంతమైన భాగస్వాముల యొక్క విలువను పెంపొందించు కారకాలు వ్యాపార నమూనాలను విశ్లేషించి గుర్తించుట ముఖ్యం అని కనుగొన్నారు, మరియు అది వారి యొక్క స్వంత సంస్థ యొక్క వ్యాపార నమూనా యొక్క కీలక విషయాలను అర్థం చేసుకొను భాగస్వామ్య సంస్థలను కనుగొటకు ఉపయోగపడుతుంది.[7]

వ్యాపార నమూనా 2.0[మార్చు]

చెన్ (2009) ఇరవై ఒకటో శతాబ్దములో వ్యాపార నమూనాలు సమష్టి వివేచన, నెట్ వర్క్ ప్రబావాలు, వినియోగదారుడు ఉత్పన్నం చేసిన విషయాలు, మరియు స్వయం-అభివృద్ధి సిద్దాంతముల యొక్క అవకాశం వంటి వెబ్ 2.0 యొక్క సామార్ధ్యాలను పరిగణలోకి తీసుకోవాలి అని సూచించారు. ఎయిర్ లైన్, ట్రాఫిక్, రవాణా, హోటల్, అతిథి భవనాలు, ఇన్ఫర్మేషన్ మరియు కమ్యునికేషన్ టెక్నాలజీ మరియు ఆన్ లైన్ క్రీడా సంస్థలు వంటి సేవా సంస్థలు వెబ్ 2.0 యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకునే వ్యాపార నమూనాల ప్రయోజనాలను అనుసరించి ప్రయోజనాలను పొందగలగాలి అని ఆయన సూచించారు. వెబ్ 2.0 యొక్క సాంకేతిక ప్రభావాన్నే కాకుండా నెట్వర్కింగ్ ప్రభావాన్ని కూడా బిజినెస్ మోడల్ 2.0 పరిగణలోకి తీసుకోవాలి అని ఆయన నొక్కి చెప్పారు. ఆయన ప్రతి సంవత్సరం అత్యధిక లాభాలతో అమెజాన్స్ ఆన్ డిమాండ్ వాణిజ్య సేవలను పునః ఉపయోగించుకుంటున్న అత్యధిక మరియు దినదినాభివృద్ధి చెందుతున్న సంస్థల సమూహముకు సహాయంగా ఉన్న ఒక పూర్తిగా వృద్ధి చెందిన బాహ్య వేదిక అమెజాన్ యొక్క విజయగాధను ఉదాహరణగా ఇచ్చారు.[8]

ప్రయోజనాలు[మార్చు]

MIT లో మాలోనే మొదలైన వారు.[9] నిర్వచించిన కొన్ని వ్యాపార నమూనాలు 1998 నుండి 2002 కాల పరిధిలో వ్యాపార నమూనా యొక్క ఉనికి ఎంత మేర ఉన్నది అని వారు నిరూపించనప్పుడు అత్యధిక U.S. సంస్థలు కలిగి ఉన్న సమాచార పట్టికలో ఉన్న వారి కంటే ఇతరులు ఉన్నత నైపుణ్యమును ప్రదర్శిస్తున్నారు అని కనుగొన్నారు.

సంబంధిత అంశములు[మార్చు]

వ్యాపార వ్యూహంలో వ్యాపార నమూనా రూపకల్పన విధానము ఒక భాగము. సంస్థ నిర్మాణములలో ఒక సంస్థ యొక్క వ్యాపార నమూనా కార్యాచరణ (ఉదాహరణ సంస్థలని అన్ని విభాగాలలో ఉద్యోగులు, వారి పదవులు మరియు వారి మధ్య ఉండే సంబంధాలను చూపే రేఖాచిత్రాలు, ఉద్యోగుల కార్యాచరణను తెలిపే రేఖాచిత్రాలు, మానవ వనరులు) మరియు సిద్ధాంతాలు (ఉదాహరణకు సమాచార సాంకేతికత నిర్మాణము, ఉత్పత్తి ఏవిధంగా తయారు చేయబడినది అని చూపించే ప్రోడక్ట్ లైన్స్) సంస్థ యొక్క వ్యాపార క్రియలలో ఒక భాగము.

కార్యాచరణ అమలు స్థాయిలో వ్యాపార నమూనాను తయారు చేయుటను సాధారణంగా వ్యాపార కార్యాచరణ రూపకల్పన అని కూడా తెలుపుతారు అని అర్థం చేసుకోవుట ముఖ్యం, మరియు వ్యాపార నమూనాలు మరియు వ్యాపార నమూనా రూపకల్పన అనేవి కార్యాచరణ విధాన స్థాయిలో సంస్థ యొక్క వ్యాపార సూత్రమును నిర్వచించుటను సూచిస్తుంది.

వ్యాపార నమూనా వ్యాపార చిహ్నం యొక్క నమ్మకమును నిర్ధారిస్తుంది మరియు వ్యాపార చిహ్నం యొక్క ధర్మము ఆ నమూనా యొక్క ఒక లక్షణంగా ఉండుట వలన వ్యాపార చిహ్నం అనేది వ్యాపార నమూనా యొక్క తదనంతర మెట్టు మరియు వ్యాపార సమూనాతో ఒక దగ్గర సంబంధమును కలిగి ఉంటుంది. దీనిని నిర్వహించటం వ్యాపార సముదాయ ఏకీకరణ యొక్క లక్ష్యం.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • వ్యాపార నమూనా రూపకల్పన
 • వ్యాపార నిర్వహణ
 • వ్యాపార నమూనా ప్రక్రియ
 • వ్యాపార సూచిక నమూనా
 • వ్యాపార సూత్రము
 • పోటీతత్వ ప్రయోజనము
 • మూల యోగ్యత
 • పెరుగుదల వేదికలు
 • మార్కెట్ రూపులు
 • మార్కెటింగ్‌
 • విక్రయ ప్రణాళిక
 • వ్యూహాత్మక నిర్వహణ
 • వ్యూహాత్మక ప్రణాళిక
 • వ్యూహాత్మక చలనాలు
 • విలువైన బదిలీ
 • వ్యాపార రూపకల్పన

మరింత చదవడానికి[మార్చు]

 • 'ది బిజినెస్ మోడల్: థిరిటికల్ రూట్స్, రీసెంట్ డెవలప్మెంట్స్, అండ్ ఫ్యూచర్ రీసర్చ్', C. జోత్త్, R. అమిత్, & L.మస్సా., WP-862, IESE, జూన్, 2010 - రివైజైడ్ సెప్టెంబర్ 2010 [http://www.iese.edu/research/pdfs/DI-0862-E.pdf]
 • "వ్యాపార నమూనాల మీద ప్రత్యేక అంశాలు" లాంగ్ రేంజ్ ప్లానింగ్, vol 43 ఏప్రిల్ 2010, దీనిలో వ్యాపార నమూనాకు యొక్క స్వభావముకు సంబంధించి ఉన్నత పరిశోధకులచే వ్రాయబడిన19 భాగాలు ఉన్నాయి.
 • నవకల్పన నుండి విలువను హస్తగతం చేసుకోవుటలో వ్యాపార నమూనా యొక్క పాత్ర: ఎవిడెన్స్ ఫ్రొం జెరాక్స్ కార్పొరేషన్స్ టెక్నాలజీ స్పిన్ఆఫ్ కంపెనీస్, H. చేస్బ్రో మరియు R. S. రోసేన్ బ్లూం, బోస్టన్, మసాచుసెట్స్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, 2002.
 • లీడింగ్ ది రెవల్యుషన్., G. హమేల్, బోస్టన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రెస్, 2000.
 • చేంజింగ్ బిజినెస్ మోడల్స్: సర్వేయింగ్ ది ల్యాండ్ స్కేప్, J. లిన్డెర్ మరియు S. కాన్ట్రెల్, యాక్సెంచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ చేంజ్, 2000.
 • డెవలపింగ్ బిజినెస్ మోడల్స్ ఫర్ ఈబిజినెస్, O. పెటేరోవిక్ మరియు C. కిట్ et al., ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కామర్స్ 2001, 2001.
 • ప్లేస్ టు స్పేస్: మిగ్రేటింగ్ టు ఈబిజినెస్ మోడల్స్, P. వెయిల్ మరియు M. R. విటలే, బోస్టన్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రెస్, 2001.
 • వేల్యూ-బేస్డ్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ - ఎక్స్ ప్లోరింగ్ ఇన్నోవేటివ్ ఈ-కామర్స్ ఐడియాస్, J. గోర్దిజ్న్, అమ్స్టర్ డాం, వ్రిజే యూనివర్సిటైట్, 2002.
 • ఇంటర్నెట్ బిజినెస్ మోడల్స్ అండ్ స్ట్రాటజీస్, A. అఫుః మరియు C. టుస్సి, బోస్టన్, మెక్ గ్రా హిల్, 2003.
 • ఫోకస్ థీం ఆర్టికల్స్: బిజినెస్ ఫర్ కంటెంట్ డెలివరీ: ఆన్ ఎంపిరికెల్ ఎనాలసిస్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అండ్ మాగజైన్ ఇండస్ట్రీ, మార్క్ ఫెట్స్చెరిన్ మరియు గెర్హార్డ్ నోల్మఎర్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆన్ మీడియా మానేజ్మెంట్, వాల్యూం 6, ఇష్యూ 1 & 2 సెప్టెంబర్ 2004, పేజీలు  4 – 11, సెప్టెంబర్ 2004.
 • బిజినెస్ మోడల్ జనేరేషన్, A. ఒస్టర్ వాల్డర్, య్వేస్ పిగ్న్యుర్, అలన్ స్మిత్, మరియు 45 దేశాల నుండి 470 వ్యాపారులు స్వయంగా ప్రచురించారు, 2009
 • సస్టైనింగ్ డిజిటల్ రిసోర్సెస్: ఆన్ ఆన్-ది-గ్రౌండ్ వ్యూ ఆఫ్ ప్రాజెక్ట్స్ టుడే, ఇతాక, నవంబర్ 2009. నియోగించబడుతున్న నమూనాల యొక్క పర్యావలోకనము మరియు ఆదాయ ఉత్పన్నము మరియు వెల నిర్వహణ యొక్క మార్పుల మీద విశ్లేషణ.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 బిజినెస్ మోడల్ జెనరేషన్ , A. ఒస్టర్ వాల్డర్, య్వేస్ పిగ్న్యుర్, అలన్ స్మిత్, మరియు 45 దేశాల నుండి 470 వ్యాపారులు స్వయంగా ప్రచురించారు, 2009
 2. (డేవిడ్ టీస్ 2010)
 3. (చార్లెస్ బాడెన్-ఫుల్లెర్ అండ్ మేరీ మోర్గాన్, 2010)
 4. మైఖేల్ A. బెల్క్ జార్జ్ E. బెల్క్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్: యాన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యునికేషన్ పెర్స్పెక్టివ్ , 7/e., మెక్ గ్రా-హిల్/ఇర్విన్, 2006
 5. JLM డి ల ఇగ్లేసియా, JEL గయో, "డూయింగ్ బిజినెస్ బై సెల్లింగ్ ఫ్రీ సర్వీసెస్ ". వెబ్ 2.0: బిజినెస్ మోడల్, 2008. స్ప్రింగర్.
 6. ది బిజినెస్ మోడల్ ఒంటోలజీ - అ ప్రోపోజిషణ్ ఇన్ అ డిజైన్ సైన్స్ అప్రోచ్
 7. హుమ్మేల్, E., G. స్లోవిన్స్కి, S. మాథ్యుస్, మరియు E. గిల్మొంట్. 2010. పరస్పర అవగాహన పరిశోధన కొరకు వ్యాపార నమూనాలు. రిసర్చ్ టెక్నాలజీ మానేజ్మెంట్ 53 (6) 51-54.
 8. చెన్, T. F. 2009. వెబ్ 2.0 తో వెబ్ సమాచార సేవల సంస్థ కొరకు వాస్తవ వ్యాపార విలువను నిర్ధారించుటకు బిజినెస్ మోడల్ 2.0 యొక్క ఒక వేదికను ఏర్పరచుట. ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ ఎలక్ట్రానిక్ బిజినెస్ మానేజ్మెంట్ 7 (3) 168-180.
 9. డు సం బిజినెస్ మోడెల్స్ పెర్ఫాం బెటర్ తాన్ అదర్స్? , మలోన్ et al., మే 2006