వ్యాపార నీతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక వ్యాపార పరిసరాలలో ఉద్భవించే నీతిసూత్రాలు మరియు నీతి లేదా నీతిపరమైన సమస్యలను పరిశీలించే ఒక విధమైన అనువర్తిత నీతిశాస్త్రమును వ్యాపారనీతి (సంస్థాపరమైన నీతి అని కూడా పిలువబడుతోంది) అనవచ్చు. వ్యాపార ప్రవర్తనలోని అన్ని రీతులకూ ఇది అన్వయిస్తుంది మరియు వ్యక్తుల మరియు వ్యాపారసంస్థల ప్రవర్తనలన్నిటికీ సంబంధించింది. వైద్య, సాంకేతిక, న్యాయ మరియు వ్యాపారనీతి వంటి అనేక రంగాలకు చెందిన నీతిపరమైన ప్రశ్నలతో వ్యవహరించు రంగమే అనువర్తిత నీతిశాస్త్రం.

21వ శతాబ్దంలో మనస్సాక్షి-కేంద్రీకృత వర్తక ప్రదేశాలు పెరుగుతున్నందువలన, అధిక నైతిక వ్యాపార ప్రక్రియలకు మరియు చర్యలకు(ఎథిసిజంగా పిలువబడుతోంది) డిమాండ్ పెరుగుతోంది.[1] నూతన ప్రజా ఉపదేశాలు మరియు చట్టాల ద్వారా వ్యాపారనీతిని మెరుగుపరచ వలసిందిగా పరిశ్రమపై ఒత్తిడి తేబడుతోంది(ఉదా. UKలో ఎక్కువ ఉద్గారాలను విడుదల చేసే వాహనాలకు ఎక్కువ పన్ను విధించబడుతోంది).[2] నీతికి లోబడని ధోరణిలో పనిచేయడం వలన తరచూ వ్యాపారంలో స్వల్ప-కాలిక లాభాలను పొందవచ్చు; అయితే ఆవిధమైన ప్రవర్తనలు కొంతకాలానికి ఆర్ధిక వ్యవస్థను క్షీణింపచేస్తాయి.

వ్యాపరనీతి ఒక సూత్రప్రాయంగా మరియు ఒక వివరణాత్మక విభాగంగా ఉండవచ్చు. ఒక సంస్థాపరమైన పద్ధతిగా మరియు ఒక వృత్తి నైపుణ్యంగా, ఈ రంగం ప్రాథమికంగా సూత్రప్రాయంగా ఉంది. విద్యారంగంలో వివరణాత్మక విధానాలు కూడా తీసుకోబడుతున్నాయి. ఆర్ధికేతర సాంఘిక విలువలతో గల ప్రతిబంధకాలను వ్యాపారం ఏ విధంగా తట్టుకుంటుంది అనే దానిని వ్యాపార నైతిక విషయాల విస్తృతి మరియు పరిమాణం ప్రతిఫలిస్తుంది. చారిత్రకంగా, పెద్ద వ్యాపార సంస్థలు మరియు విద్యాసంస్థలలో 1980 మరియు 1990లలో వ్యాపారనీతిలో ఆసక్తి నాటకీయంగా పెరిగింది. ఉదాహరణకు, నేడు అనేక పెద్ద వ్యాపార సంస్థల వెబ్ సైట్లు ఆర్ధికేతర సాంఘిక విలువల పెంపుదలకు అంకితమవడాన్ని వివిధ శీర్షికల క్రింద నొక్కిచెపుతున్నాయి (ఉదా. నైతిక నియమావళి, సాంఘిక బాధ్యతా లక్షణాలు). కొన్ని సందర్భాలలో, వ్యాపార నీతిని పరిగణించి సంస్థలు వాటి కీలక విలువలను పునర్నిర్వచించాయి (ఉదా. BP యొక్క "పెట్రోలియం ఆవల" పర్యావరణ మార్పు).

విషయ సూచిక

వ్యాపారనీతిలో విషయాల అవలోకనం[మార్చు]

సాధారణ వ్యాపారనీతి[మార్చు]

ఇవి కూడా చూడండి: సంస్థల దుర్వినియోగం, సంస్థల నేరాలు.

గణాంక సమాచార నీతి[మార్చు]

కేసులు: గణాంక అపవాదులు, ఎన్రాన్, వరల్డ్ కామ్

మానవవనరుల నిర్వహణనీతి[మార్చు]

యజమాని-ఉద్యోగి మధ్య తలెత్తే నైతిక విషయాలకు సంబంధించిన విషయాలు, అనగా యజమాని మరియు ఉద్యోగస్థుల మధ్య ఉండే హక్కులు మరియు విధులకు సంబంధించిన విషయాలను మానవవనరుల నిర్వహణ(HRM) నీతి చూస్తుంది.

పైన తెలిపినవన్నీ ఉద్యోగస్థుల నియామకం మరియు తీసివేతలకు సంబంధించినవి. ఒక ఉద్యోగి లేదా కాబోయే ఉద్యోగి జాతి, వయసు, లింగం, మతం, లేదా ఏ విధమైన వివక్షత పై నియమింపబడటం లేదా తీసివేయబడటం జరుగకూడదు.

అమ్మకం మరియు వర్తకం యొక్క నీతి[మార్చు]

వర్తకం ఒక వస్తువుని గురించి (మరియు లభ్యత గురించి) కేవలం సమాచారాన్ని అందించడమే కాక, మన విలువల మరియు ప్రవర్తన మార్పులను కోరుతుంది. కొంతమేరకు సమాజం దీనికి ఆమోదం తెలిపింది, కానీ నైతికహద్దు రేఖ ఎక్కడ గీయాలి? వర్తకనీతి ఉమ్మడిగా మాధ్యమ నీతి పై బలంగా ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వర్తకం, మాధ్యమాన్ని భారీగా ఉపయోగించుకుంటుంది. ఏదేమైనా, మాధ్యమ నీతి ఎక్కువ విస్తృతి కలిగిన విషయం మరియు వర్తకనీతి వెలుపల కూడా ఇది విస్తరించి ఉంటుంది.

ఇవి కూడా చూడండి: మేమే స్పేస్, సమాచారం లేకపోవడం, ప్రకటనసిద్ధాంతం, దోషపూరిత ప్రకటనలు, ప్రకటనల నియంత్రణ

కేసులు: బెనెటన్.

ఉత్పత్తి యొక్క నీతి[మార్చు]

వ్యాపార నీతి యొక్క ఈ రంగం సాధారణంగా సంస్థ యొక్క ఉత్పత్తులు మరియు ఉత్పత్తి ప్రక్రియలు హానిచేయకుండా సంస్థ విధులు ఉండేలా వ్యవహరిస్తుంది. ఈ రంగంలో తీవ్రమైన కొన్ని సందిగ్దతలు ఒక ఉత్పత్తి లేదా ఉత్పత్తి ప్రక్రియలలో కొంత ప్రమాదం ఉంటుందనే సాధారణ వాస్తవం నుండి ఉత్పన్నమవుతాయి మరియు దీనిని ఏమేరకు అనుమతించవచ్చు అనేది నిర్ణయించడం కష్టం, లేదా దీనిని ఏ మేరకు అనుమతించ వచ్చనేది నిరోధక సాంకేతికతల పరిస్థితుల మార్పు పై లేదా హానిని అంగీకరించే సాంఘిక దృష్టి మార్పుల పై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి: ఉత్పత్తి బాధ్యత

కేసులు: ఫోర్డ్ పింటో అపవాదు, భోపాల్ విపత్తు, ఆస్బెస్టాస్ / ఆస్బెస్టాస్ మరియు చట్టం, పీనట్ కార్పరేషన్ అఫ్ అమెరికా.

మేధోపరమైన ఆస్తి, విజ్ఞానం మరియు నైపుణ్యాల యొక్క నీతి[మార్చు]

విజ్ఞానం మరియు నైపుణ్యాలు విలువైనవే కానీ "స్వంతం చేసుకొనే" వస్తువులు కావు. ఒక ఆలోచన పై ఎవరికి ఎక్కువ హక్కులు ఉంటాయనేది నిశ్చయంగా చెప్పలేము: ఉద్యోగికి శిక్షణనిచ్చిన సంస్థకా, లేక ఉద్యోగికి తనకు తానుగానా? మొక్క పెరిగిన దేశానికా, లేక మొక్క యొక్క ఔషధపరమైన శక్తిని గుర్తించి మరియు అభివృద్ధిపరచిన సంస్థకా? దీని ఫలితంగా, యాజమాన్యాన్ని స్థిరపరచుకొనే ప్రయత్నాలు మరియు యాజమాన్యం పై నీతిపరమైన విభేదాలు తలెత్తుతాయి.

కేసులు:హ్యూమన్ జేనోం ప్రాజెక్ట్లోని వ్యక్తిగత మరియు ప్రజా ఆసక్తులు

నీతి మరియు సాంకేతికత కంప్యూటర్ మరియు వరల్డ్ వైడ్ వెబ్ ఇరవయ్యో శతాబ్దపు రెండు అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలు. ఈ సాంకేతికతల నుండి ఉత్పన్నమయ్యే అనేక నైతిక విషయాలు ఉన్నాయి. సమాచారాన్ని పొందటం చాలా తేలిక. ఇది విషయాన్ని వెలికితీయడానికి, కార్యక్షేత్రాన్ని పరిశీలించడానికి, మరియు ఏకాంతాన్ని దాడిచేయడానికి దారితీసింది.[5]

వైద్య సాంకేతికత కూడా బాగా అభివృద్ధి చెందింది. ప్రాణరక్షక ఔషధాలు ఉత్పత్తిచేసే సాంకేతికత ఔషధ సంస్థల వద్ద ఉంది. ఈ ఔషధాలు పేటెంట్లచే సంరక్షింపబడి ఉన్నాయి మరియు సాధారణ మందులు అందుబాటులోలేవు. ఇది అనేక నైతిక ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది.

అంతర్జాతీయ వ్యాపారనీతి మరియు ఆర్ధిక వ్యవస్థల నీతి[మార్చు]

ఈ విషయాలన్నీ ఒక సమూహంలో చేర్చబడటానికి కారణం అవి విస్తృతమైన, ప్రాపంచిక దృష్టిని వ్యాపారనీతి విషయాలలో కలిగి ఉండటం.

అంతర్జాతీయ వ్యాపారనీతి[మార్చు]

వ్యాపారనీతి ఒక రంగంగా 1970ల లోనే ఉద్భవించినప్పటికీ, ఆ దశాబ్దంలో జరిగిన అంతర్జాతీయ అభివృద్ధిపై ఆధారపడి, అంతర్జాతీయ వ్యాపారనీతి 1990ల చివరి వరకూ ఉద్భవించలేదు.[6] అంతర్జాతీయ వర్తక సందర్భం నుండి అనేక నూతన ప్రయోగాత్మక విషయాలు తలెత్తాయి. ఈ రంగంలో నైతిక విలువల సాంస్కృతిక సాపేక్షత వంటి సిద్ధాంతపరమైన విషయాలు అధిక ప్రాధాన్యతను పొందుతాయి. ఇతర, పాత విషయాలు కూడా సమూహంగా ఏర్పడతాయి. విషయాలు మరియు ఉపరంగాలలో ఉన్నవి:

 • అంతర్జాతీయ వాణిజ్య ప్రవర్తనకు ఆధారంగా ప్రాపంచిక విలువల అన్వేషణ.
 • అనేక దేశాలలో వ్యాపారనీతి సంప్రదాయాల పోలిక. వాటికి సంబంధించిన GDP మరియు [అవినీతి రాన్కింగ్ల] ఆధారంగా కూడా.
 • అనేక మతాల దృష్టికోణం నుండి వ్యాపారనీతి సంప్రదాయాల పోలిక.
 • అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాల నుండి ఉత్పన్నమయ్యే నీతి సంబంధ విషయాలు; ఉదా.ఔషధ పరిశ్రమలో జీవ దృగ్గోచరత మరియు బయో పైరసీ; న్యాయబద్ధమైన వర్తక ఉద్యమం; బదిలీ ధర.
 • ప్రపంచీకరణ మరియు సాంస్కృతిక సామ్రాజ్యవాదం వంటి విషయాలు.
 • వైవిధ్యమైన ప్రపంచ ప్రమాణాలు- ఉదా.బాల కార్మికులను ఉపయోగించడం.
 • అంతర్జాతీయ వైరుధ్యాల వలన బహుళజాతి సంస్థలు తక్కువ-జీతం కలిగిన దేశాలకు ఉత్పత్తి అవుట్ సోర్సింగ్ (ఉదా.వస్త్రాలు) మరియు సేవలు (ఉదా.కాల్ సెంటర్లు) మార్గాల ద్వారా ప్రయోజనాన్ని పొందడం.
 • ఇతర రాజ్యాలతో అనుమతించదగిన అంతర్జాతీయ వర్తకం.

ఇతర దేశాలు తరచూ పోగుపడవేయడాన్ని పోటీ బెదరింపుగా ఉపయోగిస్తాయి, అంటే సాధారణ ధర కంటే తక్కువ ధరకు ఉత్పత్తులను అమ్మడం. ఇది దేశీయ మార్కెట్లలో సమస్యలకు దారితీస్తుంది. విదేశీ మార్కెట్లతో నిర్దారింపబడిన ధరలతో పోటీపడటం ఈ మార్కెట్లకు కష్టంగా మారుతుంది. 2009లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ డంపింగ్-వ్యతిరేక చట్టాలపై పరిశోధన నిర్వహించింది. పెద్దసంస్థలు ఇతర ఆర్ధికంగా అభివృద్ధి చెందని సంస్థల పై ప్రయోజనాన్ని పొందడం వలన, పోగువేయడం అనేది తరచూ నైతిక విషయంగా చూడబడుతుంది.

ఆర్ధికవ్యవస్థల నీతి[మార్చు]

వ్యాపారనీతిలో భాగంగా కాక దానికి సంబంధించినదిగా, అస్పష్టంగా నిర్వచింపబడిన ఈ రంగంలో,[7] వ్యాపార నైతికకారులు రాజకీయ అర్ధశాస్త్రం మరియు రాజకీయ తత్వశాస్త్రం వంటి రంగాలలో ప్రవేశించి, ఆర్ధిక ప్రయోజనాల పంపిణీ కొరకు వివిధ వ్యవస్థల తప్పులు మరియు ఒప్పుల పై దృష్టి కేంద్రీకరిస్తారు. జాన్ రావ్ల్స్ మరియు రాబర్ట్ నోజిక్ ఇద్దరూ ప్రముఖ సమర్పకులు.

వ్యాపారనీతిలో సిద్ధాంతపరమైన విషయాలు[మార్చు]

విరుద్ధమైన ఆసక్తులు[మార్చు]

వ్యాపారనీతిని అనేక నూతన దృష్టి కోణాల నుండి పరీక్షించవచ్చు, వీటిలో వీటిలో ఉద్యోగి దృష్టి కోణం, వాణిజ్య సంస్థ మరియు మొత్తంగా సమాజం ఉంటాయి. చాలా తరచుగా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాల మధ్య విభేదాలు ఏర్పడే సందర్భాలు తలెత్తవచ్చు, ఒక వర్గం యొక్క ఆసక్తికి అనుగుణంగా పనిచేస్తే మరొక వర్గా(ల)నికి హాని కలుగవచ్చు. ఉదాహరణకు, ఒక ప్రత్యేక ఫలితం ఉద్యోగికి మంచిని కలిగించవచ్చు, అయితే, అది సంస్థకు లేదా సంఘానికి చెడు కలిగించేదిగా ఉండవచ్చు, లేదా దీనికి విరుద్ధంగా ఉండవచ్చు. కొంత మంది నీతికారులు (ఉదా.,హెన్రీ సిద్గ్విక్) నీతి యొక్క ముఖ్యపాత్ర విరుద్ధమైన ఆసక్తులను క్రమపరచడం మరియు రాజీ చేయడంగా పేర్కొన్నారు.

నైతికవిషయాలు మరియు విధానాలు[మార్చు]

సమాజంలో వ్యాపారనీతి యొక్క ప్రయోజనం పై తత్వవేత్తలు మరియు ఇతరులకు భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు, కొంతమంది దృష్టిలో వ్యాపారం యొక్క పరమోద్దేశ్యం దాని యజమానులకు, లేదా ప్రజలచేత నడుపబడే సంస్థ ఐతే దాని వాటాదారులకు గరిష్ఠ లాభాలను ఆర్జించిపెట్టడం. కాబట్టి, ఈ అభిప్రాయంలో, లాభార్జనను పెంచే చర్యలు మరియు వాటాదారుల విలువ పెంచే చర్యలను మాత్రమే ప్రోత్సహించాలి, ఎందుకంటే ఇతర ఏ చర్య అయినా లాభాల పై పన్ను వంటివే. మిగిలిన అన్నిటికంటే లాభాల గరిష్ఠీకరణ పొందటానికి ప్రయత్నించే సంస్థలు మాత్రమే విక్రయ రంగంలో పోటీని తట్టుకుని నిలబడతాయని కొంతమంది నమ్మకం. ఏమైనప్పటికీ, ఒక వ్యాపారం చట్టానికి మరియు ప్రాథమిక నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండటానికి స్వీయాసక్తి అవసరమని కొంతమంది అభిప్రాయం, ఎందుకంటే, అట్లు చేయలేని పరిస్థితులలో జరిమానాల రూపంలోనో, అనుమతిని కోల్పోవటం లేక సంస్థ ప్రతిష్ఠ కోల్పోవడం జరుగుతుంది. ప్రముఖ ఆర్ధికవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్ ఈ అభిప్రాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవారిలో ప్రముఖుడు.

కొంతమంది దృష్టిలో సంస్థలు నైతిక నిబద్ధతకు నిలబడలేవు. ఈ అభిప్రాయంలో నైతిక ప్రవర్తన వ్యక్తులకు అవసరం కానీ వ్యాపారానికి లేక సంస్థకు కాదు.

ఇతర సిద్ధాంతవేత్తల అభిప్రాయంలో, ఒక వ్యాపారానికి తన యజమానుల లేదా ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే కాక అంతకు మించి ఇతర నైతిక విధులు ఉన్నాయి, మరియు ఇవి కేవలం చట్టానికి కట్టుబడి ఉండటం వంటి వాటి కంటే మిన్న అయినవి. ఒక వ్యాపారానికి దాని పెట్టుబడిదారులపట్ల, దాని ప్రవర్తన పై ఆసక్తి ఉన్న వారి పట్ల అనగా వీరు దాని ఉద్యోగులు, వినియోగదారులు, అమ్మకందారులు, ప్రాంతీయ జనాభా, లేక సమాజం మొత్తం పై గానీ నైతిక బాధ్యతలు ఉన్నాయని వీరి నమ్మకం. పెట్టుబడిదారులను ప్రాథమిక మరియు ద్వితీయ పెట్టుబడిదారులుగా విభజించవచ్చు. ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే వాటాదారుల వంటి వారు ప్రాథమిక పెట్టుబడిదారులు కాగా, ప్రత్యక్షంగా ప్రభావితం కాని ప్రభుత్వం వంటివి ద్వితీయ పెట్టుబడిదారులు. పెట్టుబడిదారులకు వ్యాపార నిర్వహణకు సంబంధించి కొన్ని హక్కులు ఉంటాయని వీరి అభిప్రాయం మరియు కొంతమంది దృష్టిలో, వీటిలో పరిపాలనాపరమైన హక్కులు కూడా ఉన్నాయి.

కొంతమంది సిద్ధాంతకర్తలు వ్యాపారానికి సాంఘిక ఒప్పంద సిద్ధాంతాన్ని అవలంబించారు, దీనిలో వాణిజ్య సంస్థలు పాక్షిక-ప్రజాస్వామ్య సంఘాలుగా ఉంటాయి, మరియు ఉద్యోగులు మరియు ఇతరపెట్టుబడిదారులకు సంస్థ వ్యవహారాలలో పాత్ర ఉంటుంది. జాన్ రాల్ యొక్క ఏ థియరీ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రభావం వల్లను,మరియు వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో తగిన సమయంలో ప్రవేశపెట్టిన సర్వామోద పద్ధతి వల్లను, 1980లలో మొదలైన "నాణ్యతా ఉద్యమం" ఫలితంగాను రాజకీయతత్వశాస్త్రంలో ఒప్పంద సిద్ధాంతాన్ని చైతన్యపరచిన ఫలితంగా ఈ సాంఘిక ఒప్పంద సిద్ధాంతం ప్రసిద్ధి పొందింది. ప్రొఫెసర్స్ థామస్ డొనాల్డ్ సన్ మరియు థామస్ దన్ఫీ వ్యాపారానికి ఒప్పంద సిద్ధాంతం యొక్క ఒక పాటాన్తరాన్ని ప్రతిపాదించారు, వారు దానిని సమీకృత సాంఘిక ఒప్పంద సిద్ధాంతంగా పిలిచారు. i)హేతువాద ప్రజలు సార్వత్రిక సూత్రాలుగా అంగీకరించే స్థూల-సూత్రాలు, మరియు ii)ఆసక్తి గల భాగస్వాముల మధ్య వాస్తవ ఒప్పందాల పై ఆధారపడిన సూక్ష్మ-సూత్రాల కలయికని ఉపయోగించి, భాగస్వాముల మధ్య ఒక "న్యాయబద్ధమైన ఒప్పందాన్ని" సూత్రీకరించడం ద్వారా విరుద్ధ ఆసక్తులను చక్కగా పరిష్కరించవచ్చని వారు ప్రతిపాదించారు. వ్యాపారం అనేది ఒకరికి సంబంధించిన ఆస్తి అని మరియు ఒక చిన్న-రాజ్యం కానీ లేదా సాంఘిక న్యాయాన్ని పంపిణీచేసే సాధనం కానీ కాదనే ఒక ముఖ్యాంశాన్ని ఈ ఒప్పంద సిద్ధాంతాల ప్రతిపాదకులు మరచారని విమర్శకులు పేర్కొన్నారు.

విభిన్న అలవాట్లను కలిగిన అనేక దేశాలలో కార్యకలాపాలు నిర్వహించే బహుళ జాతి సంస్థల విషయంలో వలెనే, సంస్థలు బహుళ మరియు కొన్ని సందర్భాలలో విరుద్ధ చట్టాలు లేదా సాంస్కృతిక ప్రమాణాలు అనుసరించినపుడు నైతిక విషయాలు తలెత్తుతాయి. ఉదాహరణకు, ఒక సంస్థ దాని మాతృదేశానికి చెందిన చట్టాలను పాటించాలా?, లేక అది వ్యాపారం నిర్వహించే అభివృద్ధి చెందుతున్న దేశంలోని తక్కువ కఠినమైన చట్టాలను పాటించాలా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్ చట్టం సంస్థలు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా లంచాలను ఇవ్వడాన్ని నిషేధిస్తుంది; అయితే, ప్రపంచంలోని మిగిలిన భాగాలలో, వ్యాపార నిర్వహణలో లంచం ఒక అంగీకరించబడిన సంప్రదాయంగా ఉంది. ఇదే విధమైన సమస్యలు బాలకార్మికులు, ఉద్యోగుల భద్రత, పనిగంటలు, జీతములు, వివక్షత, మరియు పర్యావరణ రక్షణ చట్టాలకు సంబంధించి కూడా ఉన్నాయి.

నైతికత పై గ్రేషంస్ చట్టం ప్రకారం కొన్నిసార్లు చెడు నైతిక అలవాట్లు మంచి నైతిక అలవాట్లను తరిమివేస్తాయి అని చెప్పబడింది. పోటీతత్వం కలిగిన వ్యాపార పరిసరాలలో, లాభాలను గరిష్ఠ పరచుకోవడం మాత్రమే ప్రధానంగా భావించే సంస్థలు మాత్రమే మనుగడ కలిగి ఉంటాయని చెప్పబడింది.

రంగంలో వ్యాపారనీతి[మార్చు]

సంస్థాపరమైన నైతిక విధానాలు[మార్చు]

సమగ్రమైన సమ్మతి మరియు నైతిక కార్యక్రమములలో భాగంగా, అనేక సంస్థలు ఉద్యోగుల నైతిక ప్రవర్తనకు సంబంధించిన అంతర్గత విధానాలను సూత్రీకరించాయి. ఈ విధానాలు విస్తృతమైన సామాన్య బోధనలు, ఉన్నత-సామాన్యీకరించిన భాష (సామాన్యంగా సంస్థాపరమైన నైతిక ప్రకటనగా పిలువబడుతుంది)గా ఉంటాయి, లేదా అవి బాగా విస్తరించిన విధానాలుగా ఉండవచ్చు, ప్రత్యేకమైన ప్రవర్తనా ఆవశ్యకతలను కలిగి ఉంటాయి (సాధారణంగా సంస్థాపరమైన నైతిక స్మృతిగా పిలువబడుతుంది). ఇవి సాధారణంగా పనివారి నుండి సంస్థ యొక్క ఆపేక్షలను గుర్తించడానికి ఏర్పడినాయి మరియు వ్యాపారం నిర్వహించడంలో తలెత్తగలిగే సాధారణమైన నైతిక సమస్యలను పరిష్కరించడానికి మార్గదర్శకాలను అందిస్తాయి. ఇటువంటి విధానం అధిక నైతిక జాగరూకతకు, అన్వయించుటలో అనుగుణ్యతకు, మరియు నైతికవిపత్తులను తప్పించడానికి దారితీస్తాయి.

పెరుగుతున్న సంస్థల సంఖ్య ఉద్యోగులను వ్యాపార ప్రవర్తనకు సంబంధించి సమావేశాలకు హాజరు కావలసినదిగా కోరవచ్చు, ఈ సమావేశాలలో తరచు సంస్థ యొక్క విధానాలు, ప్రత్యేక కేసుల అధ్యయనాలు, మరియు చట్టపరమైన ఆవశ్యకతలు చర్చింపబడతాయి. కొన్ని సంస్థలు వాటి ఉద్యోగులను సంస్థ యొక్క ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తూ అంగీకారపత్రంలో సంతకం కూడా చేయించుకుంటాయి.

అనేక సంస్థలు ఉద్యోగుల అనైతిక ప్రవర్తనకు దారితీసే పర్యావరణ కారకాలను అంచనా వేస్తున్నాయి. వ్యాపార పరిసరాలలో పోటీ అనైతిక ప్రవర్తనకు పురికొల్పవచ్చు. వర్తకం వంటి రంగాలలో అబద్ధాలు ఉంటాయని ఆశించవచ్చు. దీనికి ఉదాహరణగా సాలోమన్ సోదరుల అనైతిక చర్యల గురించిన విషయాలని పేర్కొనవచ్చు.

నైతిక ప్రవర్తనను అదుపులో ఉంచే సంస్థల నియమాలను ప్రతి ఒక్కరూ బలపరచరు. కొంత మంది, ఉద్యోగులు వారి స్వంత తీర్పుల ద్వారానే వారి పై ఆధారపడిన నైతిక సమస్యలను బాగా పరిష్కరిస్తారని భావిస్తారు.

మరికొందరు సంస్థ నైతిక విధానాలు ప్రాథమికంగా ఉపయోగితా భావన పై ఆధారపడి ఉన్నాయని భావిస్తారు, మరియు అవి సంస్థ యొక్క చట్టపరమైన జవాబుదారీ తనాన్ని పరిమితం చేస్తాయి, లేదా ఒక మంచి సంస్థగా కనబడి ప్రజల అభిమానానికి పదునుపెడతాయి. భావనలో, దాని ఉద్యోగులు నియమాలను అనుసరిస్తున్నందు వలన సంస్థ న్యాయపరమైన వ్యాజ్యాలను తప్పించుకోవచ్చు. ఏదైనా వ్యాజ్యం సంభవిస్తే, ఉద్యోగులు సంస్థ యొక్క స్మృతిని సరిగా అనుసరించినట్లయితే ఆ సమస్య తలెత్తేది కాదని సంస్థ వాదించవచ్చు.

కొన్నిసార్లు సంస్థ యొక్క నైతిక స్మృతి మరియు సంస్థ యొక్క నిజవిధానాల మధ్య పొందిక లేకపోవచ్చు. అందువలన, అటువంటి ప్రవర్తన నిర్వాహకులు స్పష్టంగా అంగీకరిస్తారా లేదా, కానపుడు, అది సంస్థల విధానాల వంచనకి దారితీస్తాయి, మరియు, అయితే, ఉత్తమంగా, అవి కేవలం వర్తక ఉపకరణంగా మారతాయి.

ఒక నైతిక పద్ధతి విజయవంతమవ్వటానికి అత్యధిక నైతికవేత్తలు ప్రతిపాదించిన సూచనలు:

 • నిర్వహణ పరంగా అత్యున్నత స్థాయి నుండి అసందిగ్ధంగా మాటలు మరియు చేతల ద్వారా ఆసరా లభించాలి.
 • కాల అవధులలో వీటిని తిరిగి రాయడం మరియు చెప్పటం ద్వారా వివరించాలి.
 • ఉద్యోగులచే ఎంతో కొంత అవగాహన చేసుకొని ఆచరింపగలిగే విధంగా ఉండాలి.
 • విధేయత మరియు మెరుగుదలకు సాధారణ పర్యవేక్షణతో పాటు ఉన్నత అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలి.
 • అవిధేయత ఉన్న సందర్భాలలో పర్యవసానాలు నిర్దిష్టంగా తెలియచేయబడాలి.
 • తటస్థంగా మరియు లింగవిచక్షణ లేకుండా ఉండాలి.

నైతిక అధికారులు[మార్చు]

1980ల మధ్య నుండి సంస్థలు నైతిక అధికారులను(కొన్నిసార్లు "సమ్మతి" లేదా "వ్యాపార నిర్వహణ అధికారులు"గా పిలువబడతారు) నియమించాయి. ఆ సమయంలో U.S. రక్షణ పరిశ్రమను బాధించిన వరుస మోసం, అవినీతి మరియు దుర్వినియోగ అపకీర్తి సంఘటనలు ఈ పదవుల సృష్టికి ఉత్ప్రేరకంగా పనిచేశాయి. ఇది మొత్తం పరిశ్రమ నైతిక వ్యాపార నిర్వహణను పెంపొందించి మరియు అనుసరించేటట్లు చేసే, డిఫెన్స్ ఇండస్ట్రీ ఇనీషియేటివ్(DII) ఏర్పాటుకు దారితీసింది. సంస్థలలో నైతిక నిర్వహణకు DII ఒక ప్రారంభ గుర్తింపు చిహ్నాన్ని ఏర్పరచింది. 1991లో ఎథిక్స్ & కంప్లయన్స్ ఆఫీసర్ అసోసియేషన్ (ECOA) --ప్రారంభంలో ఎథిక్స్ ఆఫీసర్ అసోసియేషన్ (EOA)-- సెంటర్ ఫర్ బిజినెస్ ఎథిక్స్( బెంట్లీ కళాశాల, వాల్థం, MA) నైతికంగా ఉత్తమ నిర్వహణను సాధించాలనుకునేవారి నిర్వహణా సంస్థల ప్రయత్నాలకు బాధ్యులతో వృత్తిపరమైన సంఘం ఏర్పడింది. దీని సభ్యుల సంఖ్య వేగంగా పెరిగింది (ఈ ECOA ప్రస్తుతం 1,100 పైగా సభ్యులను కలిగిఉంది) మరియు వెంటనే స్వతంత్రసంస్థగా స్థాపించబడింది.

నైతిక/సమ్మతి అధికారులను నియమించడంలో సంస్థ యొక్క నిర్ణయాలకు మరొక కీలక కారణం 1991లో సంస్థల కొరకు ఫెడరల్ సెన్టెన్సింగ్ గైడ్ లైన్స్ జారీఅవడం, ఈ ప్రమాణాలను సంస్థలు(పెద్దవి లేదా చిన్నవి, వాణిజ్యపరమైనవి మరియు కానివి) అనుసరించడంవలన అవి సమాఖ్య నేరాలకు పాల్పడినపుడు శిక్షలో తగ్గింపును పొందవచ్చు. శిక్షను విధించడంలో న్యాయమూర్తులకు సహాయపడతాయని భావించినప్పటికీ, ఉత్తమ విధానాలు నెలకొల్పడానికి సహాయపడటంలో వీటి ప్రభావం లక్ష్యానికి దూరంగా ఉంది.

2001-04 మధ్య అనేక సంస్థాగత అవినీతి కుంభకోణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో (ఎన్రాన్, వరల్డ్ కామ్ మరియు టైకో వంటి పెద్దసంస్థలను ప్రభావితం చేసినవి), చిన్న మరియు మధ్య తరహా సంస్థలు కూడా నైతిక అధికారులను నియమించుకోవడం ప్రారంభించాయి. వీరు తరచుగా ముఖ్య కార్యనిర్వహణ అధికారికి నివేదిక ఇస్తారు మరియు సంస్థ యొక్క కార్యక్రమాలలో నైతిక అనువర్తనాలను అంచనా వేయడంలో బాధ్యత వహిస్తారు, సంస్థ యొక్క నైతిక విధానాలను రూపొందించడంలో సూచనలను చేస్తారు, మరియు ఉద్యోగులకు సమాచారాన్ని అందచేస్తారు. వారు అనైతిక మరియు చట్టవ్యతిరేక చర్యలను బహిర్గతం చేయడం లేదా నిరోధించడం పై ప్రత్యేకమైన ఆసక్తిని చూపుతారు. పై కుంభకోణాలకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ లో చట్టబద్ధం చేసిన సర్బన్స్-ఒక్స్లె ఆక్ట్ ఈ విధమైన ధోరణికి కొంతవరకూ కారణం. సంస్థ నిర్ణయాల వలన వాటాదారుల యొక్క పెట్టుబడులు ఏ విధంగా ప్రభావితమవుతాయో పరిశీలించేందుకు నష్ట అంచనా అధికారులను నియమించడం ఈ రకమైన ధోరణికి సంబంధించినదే.

విపణిలో నైతిక అధికారుల ప్రభావం స్పష్టంగా లేదు. శాసన ఆవశ్యకతలకు ప్రతిస్పందనగా ప్రాథమికంగా నియామకం జరిగినట్లయితే, కనీసం, స్వల్ప కాలవ్యవధిలో, సమర్ధత తక్కువగా ఉంటుందని ఆశించవచ్చు. ఎందుకంటే, కొంతవరకు నైతిక ప్రవర్తన పై నిలకడగా విలువలను నెలకొల్పే వాణిజ్య సంస్కృతి ఫలితంగా నైతిక వ్యాపార అలవాట్లు ఉంటాయి, ఒక సంస్కృతి మరియు వాతావరణం సాధారణంగా సంస్థ ఉన్నతస్థాయి నుండి ప్రసరిస్తుంది. నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి కేవలం నైతిక పర్యవేక్షణకు ఒక స్థాన్నాన్ని ఏర్పరచడం ఒకటే సరిపోదు: సాధారణ నిర్వాహకుల నుండి నిలకడ కలిగిన ఆసరాతో కూడిన మరింత నియమబద్ధమైన కార్యక్రమం అవసరం.

నైతిక ప్రవర్తన యొక్క పునాది ఒక సంస్థ యొక్క వ్యాపార సంస్కృతి మరియు సూత్రాల పరిధిని దాటి ఉంటుంది, ఇది వ్యక్తి యొక్క ప్రాథమిక నైతిక శిక్షణ, వ్యక్తిని ప్రభావితం చేసే ఇతర సంస్థలు, ఆ సంస్థ ఉన్న పోటీ వ్యాపార వాతావరణం మరియు మొత్తంగా సమాజం పై ఆధారపడి ఉంటుంది.

ఒక విద్యావిభాగంగా వ్యాపారనీతి[మార్చు]

వ్యాపారనీతి ఒక విద్యావిభాగంగా 1970లో ఉద్భవించింది. వ్యాపారనీతి విద్యాపత్రికలు లేదా సమావేశాలు లేనందువలన, పరిశోధకులు వారి పత్రాలను సాధారణ నిర్వహణలలో బహిర్గత పరచేవారు, అకాడమీ అఫ్ మేనేజ్మెంట్ వంటి సాధారణ సమావేశాలకు హాజరయ్యేవారు. కాలవ్యవధిలో, అనేక పత్రికలు వచ్చాయి, మరియు అనేక మంది పరిశోధకులు ఈ రంగంలో ప్రవేశించారు. ప్రత్యేకించి 2000లకు ముందు నుండి చోటు చేసుకున్న అనేక వ్యాపార సంస్థల అవినీతి కుంభకోణాల వల్ల బోధనలో వ్యాపార సంబంధ విషయాల పై ఆసక్తి పెరిగింది. 2009 నాటికి, మార్కెట్లో A+ ఆదరణ కలిగిన జర్నల్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ మరియు బిజినెస్ ఎథిక్స్ క్వార్టర్లీలతో కలిపి పదహారు దాకా బోధనా సంబంధ పత్రికలు వివిధ వ్యాపార నైతిక ప్రచురణలను అందిస్తున్నాయి.[8]

వ్యాపారనీతిలో మతపరమైన అభిప్రాయాలు[మార్చు]

వ్యాపారనీతికి ప్రామాణికతను చొప్పించడానికి దాని పై మత అభిప్రాయాల చారిత్రిక మరియు ప్రాపంచిక ప్రాముఖ్యత కొన్నిసార్లు తక్కువ అంచనా వేయబడింది. ప్రత్యేకించి ఆసియా మరియు మధ్య ప్రాచ్యంలో, వ్యాపార నిర్వహణ మరియు వ్యాపార విలువల సృష్టి పై మత మరియు సాంస్కృతిక దృక్పధాల ప్రభావం బలంగా ఉంది.

ఉదాహరణలు:

సంబంధిత విభాగాలు[మార్చు]

వ్యాపార మరియు ఆర్దికరంగాల యొక్క తత్వ, రాజకీయ మరియు నైతిక కీలకాంశాలతో వ్యవహరించే తత్వశాస్త్ర విభాగమైన, వ్యాపార తత్వశాస్త్రం నుండి వ్యాపారనీతిని ప్రత్యేకంగా చూడాలి. వ్యక్తిగత వ్యాపార నిర్వహణ నీతివంతంగా సాధ్యపడుతుంది వంటి ఉదాహరణల ఆధారంగా వ్యాపారనీతి నిర్వహింపబడుతుంది-దీనిని వ్యతిరేకించే స్వేచ్చావాద సామ్యవాదులు, (వీరు "వ్యాపారనీతి"ని కేవలం ఒక పదాలంకారంగా భావిస్తారు) వ్యాపారనీతి పరిధి కంటే విస్తృతార్ధంలో దీనిని నిర్వచిస్తారు.

వ్యాపార తత్వశాస్త్రం ఒక వ్యాపారానికి సాంఘిక బాధ్యతలు ఉన్నాయా, ఉంటే అవి ఏవి వంటి ప్రశ్నలతో పాటుగా; వ్యాపార నిర్వహణ సిద్ధాంతం; వ్యక్తిగతవాదం vs. సామూహికవాదం;వర్తక ప్రదేశంలో పాల్గొనేవారి ఇష్టపూర్వక స్వేఛ్చ;స్వీయ ఆసక్తి యొక్క పాత్ర; అదృశ్య హస్త సిద్ధాంతాలు; సామాజికన్యాయ ఆవశ్యకతలు; మరియు సహజ హక్కులు, ప్రత్యేకించి వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తి హక్కులు వంటి వాటితో వ్యవహరిస్తుంది.

వ్యాపారనీతి రాజకీయ అర్ధశాస్త్రంతో కూడా సంబంధం కలిగి ఉంది, ఇది రాజకీయ మరియు చారిత్రక దృష్టికోణాల నుండి ఆర్ధిక విశ్లేషణ. ఆర్ధికచర్యల యొక్క పంపిణీ పర్యవసానాలతో రాజకీయ అర్ధశాస్త్రం వ్యవహరిస్తుంది. అది ఆర్ధిక చర్య వలన ఎవరు లాభం పొందుతారో మరియు ఎవరు నష్టపోతారో, మరియు నీతి విషయాల కీలక ఫలితమైన పంపిణీ న్యాయబద్ధంగా లేదా సరిగా ఉందా అనేది తెలుసుకుంటుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Ethics the easy way". H.E.R.O. మూలం నుండి 2008-05-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-05-21. Cite web requires |website= (help)
 2. "Miliband draws up green tax plan". BBC. 2006-10-30. Retrieved 2008-05-21. Cite web requires |website= (help)
 3. Friedman, Milton (1970-09-13). "The Social Responsibility of Business is to Increase Its Profits". The New York Times Magazine. మూలం నుండి 2011-03-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-12-23.
 4. Hare, R. M. (1979). "What is wrong with slavery". Philosophy and Public Affairs. 8: 103–121.
 5. నీతి సిద్ధాంతం మరియు వ్యాపారం (బ్యూచామ్ప్)
 6. Enderle, Georges (1999). International Business Ethics. University of Notre Dame Press. p. 1. ISBN 0-268-01214-8.
 7. George, Richard de (1999). Business Ethics.
 8. "Serenko, A. and Bontis, N. (2009). A citation-based ranking of the business ethics scholarly journals. International Journal of Business Governance and Ethics 4(4): 390-399" (PDF). మూలం (PDF) నుండి 2010-02-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-10-21. Cite web requires |website= (help)
 9. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2006-04-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-12-23. Cite web requires |website= (help)

మరింత చదవడానికి[మార్చు]

వెలుపటి వలయము[మార్చు]

మూస:Ethics