శంకరమంచి పార్థసారధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శంకరమంచి పార్థసారధి
Sankaramanchy parthasaradhi.png
శంకరమంచి పార్థసారధి
జననం
శంకరమంచి పార్థసారధి

(1946-11-18)18 నవంబరు
జాతీయతభారతీయుడు
సుపరిచితుడుకథ, నాటక రచయిత

శంకరమంచి పార్థసారధి కథ, నాటక రచయిత[1]. ఆదివిష్ణు తరువాత అంతటి స్థాయిలో హాస్య నాటకాలు రాసే రచయితలు లేరనుకున్న సమయంలో శంకరమంచి పార్థసారధి రచనలు ప్రారంభించి హాస్యనాటకాలకు కొత్తరూపం ఇచ్చారు.

జననం[మార్చు]

ఈయన 1946, నవంబర్ 18బందరులో జన్మించారు.

విద్యాభ్యాసం[మార్చు]

విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బియస్సీ పూర్తిచేశారు.

కథకునిగా[మార్చు]

1978 శంకరమంచి మొదటి కథ స్వాతిలో ప్రచురితమయ్యింది. ఇప్పటి వరకూ దాదాపు 200 లకి పైగా కథలు స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, చతుర, ఉదయం వంటి అన్ని వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి, స్వాతి, ఉదయం పత్రికల్లో కథలకు బహుమతులు అందుకున్నారు. శంకరమంచి తన కథల్లో కుటుంబ జీవనంలోని విలువలకు, స్త్రీ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు. అనాది నుండి ఆధునిక కాలం వరకూ స్త్రీ ఎదుర్కొంటున్న వివక్ష, పడుతున్న బాధలు వీరి రచనల్లో చర్చకి వస్తాయి. నేటిప్రపంచం ఇంతటి ప్రగతి సాధించినా మహిళల కష్టాలు తగ్గకపోగా మరింత పెరగడం ఆయన్ని బాధిస్తోంటుంది. స్త్రీ అంటే ఎంతో గౌరవం శంకరమంచికి. ఈ విషయం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తూంటుంది.[2]

నాటకాలు[మార్చు]

బిక్కు, దీక్షిత్ వంటి నాటకరంగ మిత్రుల ప్రోత్సాహంతో "చికాగో" అనే హాస్యనాటిక రాసారు. హళ్ళికి హళ్ళిలో పూర్తి వైవిధ్యాన్ని అందించారు శంకరమంచి. ఈ నాటిక అనేక పరిషత్ పోటీలలో గెలుపొందింది. అనేక వేదికలపై విజయవంతంగా ప్రదర్శితమవుతూ వస్తోంది.

పొట్ట చెక్కలయ్యే హాస్యాన్ని వేదికపై అందించిన "దొంగలబండి" అనే రెండు గంటల నాటకం ఒక సంచలనం. ఇది శంకరమంచికి గొప్ప పేరు తెచ్చింది. వీరి "పూజకు వేళాయెరా" నాటికకు ఆంధ్రజ్యోతి పోటీలో ప్రథమ బహుమతి లభించింది. "ప్రసన్నకి ప్రేమతో" కూడా ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకూ 13 నాటికలు 2 నాటకాలు రాసారు శంకరమంచి. వీటిలో అనేక నాటకాలు పోటీల్లో బహుమతులందుకున్నాయి. ఇంతే కాక వీరి నాటకాలకు పనిచేసిన నటులు, దర్శకులకు కూడా అనేక అవార్డులు లభించడం విశేషం.[3]

రేడియో నాటికలకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి పొందారు. రాసిన అన్ని నాటికలకు నాటకాలకు ఉత్తమ రచయితగా అన్ని పరిషత్తులలో బహుమతులు పొందారు.

== సినిమా రచన =], ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను వంటి సినిమాలకు కథ, మాటల రచయితగా పనిచేశారు. సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు., ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన సినిమాలు శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.[4]

అవార్డులు - సత్కారాలు[మార్చు]

 1. జంధ్యాల స్మారక అవార్డులు
 2. సుమధుర కళానికేతన్, విజయవాడ వారి సత్కారం
 3. జంధ్యాల మిత్రమండలి వారిచే హైదరాబాద్ లో సత్కారం
 4. జాలీ ఫెండ్స్ కల్చరల్ అసోసియేషన్ వారిచే సత్కారం
 5. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 2003లో సత్కారం
 6. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (హాస్య నాటికలు పుస్తకానికి)[5][6]

మూలాలు[మార్చు]

 1. హన్స్ ఇండియా, జూన్ 21,2015
 2. కథకునిగా శంకరమంచి పార్థసారథి
 3. నాటక రచయితగా శంకరమంచి
 4. సినీ రచయితగా శంకరమంచి
 5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020. CS1 maint: discouraged parameter (link)
 6. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లింకులు[మార్చు]