Jump to content

శక్తి జిల్లా

వికీపీడియా నుండి
Sakti district
Maa Beri Wali Mandir in Sakti
Maa Beri Wali Mandir in Sakti
Location in Chhattisgarh
Location in Chhattisgarh
Coordinates (Sakti): 23°01′N 82°58′E / 23.02°N 82.96°E / 23.02; 82.96
Country India
StateChhattisgarh
DivisionBilaspur
HeadquartersSakti
Tehsils7
Government
  Vidhan Sabha constituencies3
Population
 (2011)
  Total
6,53,036
Demographics
  Sex ratio1004
Time zoneUTC+05:30 (IST)
Major highways3

శక్తి జిల్లా, భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2021 ఆగస్టు 15న భూపేష్ బఘెల్ ప్రకటించిన నాలుగు కొత్త జిల్లాలలో శక్తి జిల్లా ఒకటి. ఇది జంజ్‌గిర్-చంపా జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా ఏర్పడింది. [1] [2] [3] [4] జిల్లా ప్రాంతం గతంలో "శక్తి రాచరిక రాష్ట్రం" గా ఉంది. ఇది స్వాతంత్ర్యం తర్వాత బిలాస్పూర్ జిల్లాలో చేరింది.

శక్తి జిల్లా, మహానది నదీ లోయలో ఉంది. జిల్లాకు దక్షిణాన అనేక కొండ శ్రేణులు ఉన్నాయి. జిల్లాకు దక్షిణ సరిహద్దుగా మహానది ఉంది. జిల్లా ముఖ్యపట్టణం ''శక్తి'' పట్టణం

భౌగోళికం

[మార్చు]

శక్తి జిల్లా చుట్టూ వాయవ్యంలో కోర్బా జిల్లా, పశ్చిమాన జాంజ్‌గిర్-చంపా జిల్లా, తూర్పున రాయ్‌గఢ్ జిల్లా, దక్షిణాన సారన్‌ఘర్ జిల్లా ఉన్నాయి.

రాజకీయాలు

[మార్చు]

శక్తి జిల్లా శక్తి శాసనసభ నియోజకవర్గం (సంఖ్య 33) కింద ఉంది. ఇది చత్తీస్‌గఢ్‌లోని ఏకైక విద్యా జిల్లా. శక్తి జిల్లాలో 245 పంచాయతీలు, 458 గ్రామాలు ఉన్నాయి. శక్తి జిల్లా 2021 ఆగష్టు 15న ఏర్పడింది. 2022 సెప్టెంబరు 9న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ద్వారా పూర్తి జిల్లా ఉనికిలోకి వచ్చింది. ఇక్కడ ప్రస్తుత 2018 - 2023 శాసవసభ సభ్యుడుగా చరణ్ దాస్ మహంత్ కొనసాగుచున్నాడు, ఇతను ఛత్తీస్‌గఢ్ శాసనసభ స్పీకర్. శక్తి జిల్లా, మొదటి కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేట్ నుపుర్ రాశి పన్నా ఐఎఎస్, జిల్లా మొదటి పోలీసు సూపరింటెండెంట్ ఎం.ఆర్.. అహిరే ఐఫిఎస్, మొదటి జిల్లా విద్యా అధికారి బి.ఎల్. ఖరే,

చరిత్ర

[మార్చు]

బ్రిటీష్ రాజ్ కాలంలో, శక్తి అనేది శక్తి రాష్ట్రానికి రాజధానిగా ఉంది, ఇది తూర్పు రాష్ట్రాల ఏజెన్సీకి చెందిన అనేక రాచరిక రాష్ట్రాలలో ఒకటి.[5]

ఈ రాచరిక రాష్ట్ర పాలకులు 'రాణా' అనే బిరుదును కలిగి ఉన్నారు.వారి వివరాలు

  • రుద్ర సింగ్
  • ఉదయ్ సింగ్
  • కివాత్ సింగ్
  • కాగన్ సింగ్
  • కలందర్ సింగ్ -1837
  • 1837–19 జూన్ నుండి 1850 జూన్ 18 వరకు ఖాళీగా ఉంది
  • రంజిత్ సింగ్ (జ. 1836) - 1850 జూన్ 19 – 1875 వరకు
  • 1875 - ఫిబ్రవరి 1892 ఖాళీగా ఉంది
  • రూప నారాయణ్ సింగ్ - 1892 ఫిబ్రవరి – 1914 జులై వరకు
  • లీలాధర్ సింగ్ (జ. 1892) - 1914 జులై 4 – 1947 ఆగష్టు 15 వరకు

చివరి లీలాధర్ సింగ్ కుమారుడు రాజా సురేంద్ర బహదూర్ సింగ్, హాకీ జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు. 2021 ఆగస్టు 15న, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి చేత, శక్తి ఛత్తీస్‌గఢ్‌లో మొహ్లా మన్‌పూర్, సారన్‌ఘర్-బిలాయిఘర్, మనేంద్రగఢ్‌లతో పాటు కొత్త జిల్లాగా శక్తి జిల్లాను ప్రకటించారు. దీనితో ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లాలు సంఖ్య మొత్తం 33కి పెరిగింది.[6]

జనాభా శాస్త్రం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,శక్తి జిల్లాలో 6,53,036 జనాభా ఉంది, అందులో 61,508 (9.42%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.శక్తి జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1004 మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది.మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 1,48,386 (22.72%) మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన జనాభా 1,04,296 (15.97%) మంది ఉన్నారు.[7]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 95.98% జనాభా చత్తీస్‌గఢీని, 2.72% మంది హిందీని వారి మొదటిభాషగా మాట్లాడతారు. [8]

మూలాలు

[మార్చు]
  1. "Chhattisgarh Cm Bhupesh Baghel Announces Four New Districts And 18 Tehsil Independence Day - एलान: स्वतंत्रता दिवस पर सीएम भूपेश बघेल ने की घोषणा, छत्तीसगढ़ में बनेंगे चार नए जिले और 18 तहसील - Amar Ujala Hindi News Live". amarujala.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-02.
  2. "4 New Districts, 18 Tehsils In Chhattisgarh: Chief Minister Bhupesh Baghel". ndtv.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-02.
  3. "Chhattisgarh to have 4 new districts, says CM Bhupesh Baghel on Independence Day". The Economic Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-02.
  4. "Chhattisgarh CM Bhupesh Baghel announces 4 new districts, 18 tehsils - India News". indiatoday.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-09-02.
  5. Princely States of India
  6. "Chhattisgarh CM Bhupesh Baghel announces 4 new districts, 18 tehsils". India Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-05.
  7. "District Census Handbook: Janjgir-Champa". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  8. "Table C-16 Population by Mother Tongue: Chhattisgarh". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.

వెలుపలి లంకెలు

[మార్చు]