శనిగరం జలాశయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శనిగరం జలాశయం
Shanigaram Reservoir.jpg
శనిగరం జలాశయం
Shanigaram Reservoir
అధికార నామంShanigaram Reservoir
శనిగరం జలాశయం
ప్రదేశంశనిగరం, కోహెడ మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
అక్షాంశ,రేఖాంశాలు18°11′10″N 79°00′50″E / 18.18611°N 79.01389°E / 18.18611; 79.01389Coordinates: 18°11′10″N 79°00′50″E / 18.18611°N 79.01389°E / 18.18611; 79.01389
ఆవశ్యకతనీటిపారుదల
స్థితివాడుకలో ఉంది
నిర్మాణం ప్రారంభం1887
ప్రారంభ తేదీ1891
నిర్మాణ వ్యయం560 సీర్లు (504 కిలోల బంగారం ధర)
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంభూమి పూరక ఆనకట్ట
ఎత్తు16 మీటర్లు (52 అడుగులు) నీటిమట్టం నుండి
పొడవు908 మీటర్లు[1]
Spillway typeవక్రరేఖ చిహ్నం
Spillway capacity14150 క్యూసెక్
జలాశయం
సృష్టించేదిశనిగరం జలాశయం
మొత్తం సామర్థ్యం1.09 Tmcft
పరీవాహక ప్రాంతం5100 ఎకరాలు

శనిగరం జలాశయం (శనిగరం చెరువు) తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కోహెడ మండలం శనిగరం గ్రామంలోని జలాశయం. 1891లో నిజాం ప్రభుత్వకాలంలో నిర్మించబడిన ఈ పురాతన రిజర్వాయర్ నిర్మాణానికి 560 సీర్లు (504 కిలోల బంగారం ధర) ఖర్చు చేశారు.

ప్రారంభం[మార్చు]

నిజాం ప్రభుత్వకాలంలో నిర్మించబడిన ఈ పురాతన రిజర్వాయర్ నిర్మాణం 1887లో ప్రారంభమై, 1891లో పూర్తయింది. దీని నిర్మాణానికి 560 సీర్లు (504 కిలోల బంగారం ధర) వ్యయం అయింది.

సామర్థ్యం[మార్చు]

శనిగరం జలాశయం సామర్థ్యం 42 అడుగులు ఉంది.[2]

ఉపయోగం[మార్చు]

1 టీఎంసీ సామర్థ్యం గల ఈ జలాశయం ద్వారా శనిగరం, తంగళ్లపల్లి, బెజ్జంకి, రేగులపల్లి, పోతారం (జె), దాచారం, ముత్తన్నపేట్, గాగిళ్లాపూర్‌, గుగ్గిళ్ళ తదితర గ్రామాల్లోని 5,100 ఎకరాల ఆయకట్టు నీరు అందుతుంది.

ఇతర వివరాలు[మార్చు]

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-2 పనిలో భాగంగా తోట్టపల్లి జలాశయం ఎడమ కాలువ ద్వారా ఈ జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుంది.

మూలాలు[మార్చు]

  1. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. మూలం (PDF) నుండి 20 ఆగస్టు 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 21 నవంబర్ 2018. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. సాక్షి, జిల్లాలు (23 September 2016). "జోరువాన". మూలం నుండి 21 November 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 21 November 2018. Cite news requires |newspaper= (help)