శనివారం
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శనివారము లేదా స్థిరవారము (Saturday) అనేది వారములో ఏడవ మరియు చివరి రోజు. ఇది శుక్రవారమునకు మరియు ఆదివారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతములో మొదటి రోజు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా (ఆదివారంతో పాటుగా) సెలవుదినంగా పాఠిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసిస్తారు మరియు ఈ రోజున కొత్త పనులు ప్రారంభించరు.
భారత పురాణాలలోని శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారము అని పిలువబడుతుంది.
హిందువులు శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.