శరణం గచ్ఛామి
| శరణం గచ్ఛామి | |
|---|---|
| దర్శకత్వం | ప్రేమ్ రాజ్ |
| రచన | మురళి బొమ్మకు |
| నిర్మాత | మురళి బొమ్మకు |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | కళ్యాణ్ సామి |
| సంగీతం | రవి కళ్యాణ్ |
| పంపిణీదార్లు | బొమ్మకు క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2017 ఏప్రిల్ 7 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
శరణం గచ్చామి 2017లో విడుదలైన తెలుగు భాషా యాక్షన్-రొమాన్స్ సినిమా. బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్‌పై మురళి బొమ్మకు నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించాడు.[1] నవీన్ సంజయ్, తనిష్క్ తివారీ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాశ్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలైంది.[2]
జనవరి 2017లో ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమా "ప్రజా క్రమాన్ని ప్రభావితం చేసే, శాంతికి భంగం కలిగించే అవకాశం ఉంది" అనే కారణంతో ఈ సినిమాకి సర్టిఫికేషన్ నిరాకరించింది.[3][4]
కథ
[మార్చు]మానవ్ (నవీన్ సంజయ్) జర్నలిజం విద్యార్థి. ఆయన రిజర్వేషన్ విధానాలు, వాటి అమలును ప్రభావితం చేసే అంశాలు, వాటి ఫలితాలపై పరిశోధన చేస్తాడు. రిజర్వేషన్ విధానాలు ప్రతిపాదించబడిన అణగారిన వర్గాల దుస్థితి ఆశించిన ఫలాలను ఇవ్వలేదని గమనించాడు. ఆయన తన మార్గదర్శకత్వంతో పాటు, అడ్డంకులు ఏమిటో, కావలసిన మార్పులను ఎలా పొందాలో వెతికే క్రమంలో ఆయన ఎదురుకున్న సవాలు;లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాడు? చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[5]
నటీనటులు
[మార్చు]- మానవ్ గా నవీన్ సంజయ్
- తనిష్క్ రాజన్
- జయప్రకాశ్ రెడ్డి
- పరుచూరి వెంకటేశ్వరరావు
- పోసాని కృష్ణ మురళి
- సుధ
- మురళి బొమ్మకు
- ఆర్.కృష్ణయ్య (ఎమ్మెల్యే)
- దేశపతి శ్రీనివాస్
- వై. కాశీ విశ్వనాథ్
- సత్య కృష్ణన్
పాటలు
[మార్చు]| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "ధగత్ ధగన్" | కైలాష్ ఖేర్ | |
| 2. | "నాగుమోము నమః" | ||
| 3. | "రుమాల్ రుమాల్" | రేవంత్, దివ్య దివాకర్ | |
| 4. | "వేల యేలా" | ధనుంజయ్, సునీత |
మూలాలు
[మార్చు]- ↑ "Official Trailer - Saranam Gacchami" (in ఇంగ్లీష్). The Times of India. 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2026.
- ↑ "Saranam Gacchami Movie Showtimes". The Times of India. 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2026.
- ↑ "సెన్సార్ తిరస్కరణపై సమరం : శరణం గచ్ఛామి టీం". Sakshi. 31 January 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2026.
- ↑ "CBFC denies certification to Telugu film on caste-based quota, says it may 'disrupt peace'". Hindustan Times. 26 January 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 May 2017.
- ↑ "Saranam Gacchami Telugu Movie Review | Saranam Gacchami Movie Review | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT". 8 April 2017.