శరద్ చౌహాన్
| శరద్ చౌహాన్ | |||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 7 – 2025 ఫిబ్రవరి 8 | |||
| ముందు | నీల్ దమన్ ఖత్రీ | ||
|---|---|---|---|
| తరువాత | రాజ్ కరణ్ ఖత్రి | ||
| నియోజకవర్గం | నేరేల | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| నివాసం | ఢిల్లీ, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శరద్ కుమార్ చౌహాన్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శరద్ చౌహాన్ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007లో బక్తవర్‌పూర్‌లో వార్డ్ 4 నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జస్వంత్ సింగ్ చేతిలో 832 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
శరద్ చౌహాన్ 2015 శాసనసభ ఎన్నికలకు ముందు బహుజన్ సమాజ్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీల్ దమన్ ఖత్రీపై 40,292 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3] ఆయన 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీల్ దమన్ ఖత్రీపై 17,429 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
శరద్ చౌహాన్ 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజ్ కరణ్ ఖత్రి చేతిలో 8596 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
వివాదం
[మార్చు]నరేలాకు చెందిన సోని అనే అమ్మాయి 2016లో ఆత్మహత్య కేసులో శరద్ చౌహాన్ తో సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం బెయిల్ లభించింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Sharad Kumar Affdavit" (PDF). myneta.info/. Archived from the original (PDF) on 2015-02-16. Retrieved 17 February 2015.
- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Narela" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
- ↑ "AAP MLA Sharad Chauhan, 6 others arrested in suicide case of party worker Soni". 2016-07-31.