శరద్ రాంగొండ పాటిల్
| శరద్ రాంగొండ పాటిల్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2002 - 2008 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 1999 - 2009 | |||
| ముందు | మోహనరావు షిండే | ||
|---|---|---|---|
| తరువాత | హఫీజ్‌భాయ్ ధాతురే | ||
| నియోజకవర్గం | మిరాజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1942 కుప్వాడ్, మిరాజ్ మండలం, సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర | ||
| మరణం | 2023 డిసెంబర్ 27 కుప్వాడ్, మిరాజ్ మండలం, సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర | ||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| నివాసం | మిరాజ్, మహారాష్ట్ర | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శరద్ రాంగొండ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిరాజ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]శరద్ రాంగొండ పాటిల్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మిరాజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పాటిల్ బజరంగ్ తుకారాం రాంసింగ్ గణపత్రావుపై 5563 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి గైక్వాడ్ మాణిక్తాయ్ ఆనందరాపై 44615 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
శరద్ రాంగొండ పాటిల్ 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మిరాజ్ శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2002లో జరిగిన పూణే పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]శరద్ రాంగొండ పాటిల్ 81 ఏళ్ల వయసులో 2023 డిసెంబర్ 27న కుప్వాడ్‌లోని తన నివాసంలో మరణించాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ "आयुष्यभर एकाच पक्षाशी एकनिष्ठ असलेले माजी आमदार प्राध्यापक शरद पाटील यांचं निधन, 81 व्या वर्षी घेतला अखेरचा श्वास". ETV Bharat News. 27 December 2023. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
{{cite news}}:|first1=has numeric name (help);|first1=missing|last1=(help) - ↑ "Sharad Patil, ex-JD(S) state president, dies". The Times of India. 28 December 2023. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "सांगली: जनता दलाचे माजी प्रदेशाध्यक्ष व माजी आमदार प्रा. शरद पाटील यांचे निधन" (in మరాఠీ). Lokmat. 27 December 2023. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.