శరవస్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shravasti జిల్లా

श्रावस्ती जिला
Uttar Pradesh లో Shravasti జిల్లా స్థానము
Uttar Pradesh లో Shravasti జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముDevipatan
ముఖ్య పట్టణంBhinga
మండలాలు2
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుShravasti
విస్తీర్ణం
 • మొత్తం1,858.2 కి.మీ2 (717.5 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం11,14,615
 • సాంద్రత600/కి.మీ2 (1,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత49.13 per cent
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో శరవస్తి జిల్లా (హిందీ:) ఒకటి. భింగ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. శరవస్తి జిల్లా దేవిపతన్ డివిషన్‌లో భాగంగా ఉంది. [1] 2001 సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.

చరిత్ర[మార్చు]

శరవస్తి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఇది రాప్తి నదీ తీరంలో ఉంది. శరవస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు.[2] శరవస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు, పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుండి క్రీ.శ 6వ శతాబ్దం వరకు శరవస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రం మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉంది. శరవస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది. నాగార్జున వ్రాతలను అనుసరించి క్రీ.పూ 5వ శతాబ్దంలో నగరం జనసంఖ్య 9,00,000.

బ్రుహత్కల్పలో శరవస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువా ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడుందని సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు, పలు దేవకులికాల ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నగరంలో కోటనిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు, కోట శిథిలాలు కనిపిస్తున్నాయి. పురావస్తు శాఖ త్రవ్వకాలలో శరవస్తి సమీపంలో ఉన్న సాహేత్- మాహెత్ వద్ద జరుపుతున్న త్రవ్వకాలలో పలు పురాతన విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తున్నాయి. అవన్ని ఇప్పుడు మ్యూజియం ఆఫ్ మథురా, లక్నోలో బధ్రపరచబడి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

శరవస్తి —చారిత్రాత్మక అవధ్ భూభాగంలో ఒక భాగం.

సరిహద్దులు[మార్చు]

జిల్లా దక్షిణ సరిహద్దులో గోండియా జిల్లా, పశ్చిమ సరిహద్దులో బహ్రైచ్ జిల్లా, తూర్పు సరిహద్దులో బలరాంపూర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని డన్ంగ్ డెయుఖురి జిల్లా, వాయవ్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బంకె జిల్లా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోకు శరవస్తి రాజధాని భింగ 170 కి.మీ దూరంలో ఉంది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో శరవస్తి జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,114,615,[4]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 414 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 572 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -5.25 %
స్త్రీ పురుష నిష్పత్తి. 875:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 49.13%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

విద్య[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి 34.2%. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప అక్షారాశ్యత కలిగిన జిల్లాగా శరవస్తి గుర్తించబడుతుంది.[7]

మూలాలు[మార్చు]

  1. "Press Information Bureau English Releases". Pib.nic.in. Retrieved 2012-07-23.
  2. http://www.hindustantimes.com/Travel/TravelStories/The-Ananda-Bodhi-at-Shravasti/Article1-905851.aspx
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)
  7. "Seminar On Progress Of Literacy In India: What The Census 2001 Preveals Niepa, New Delhi, October 05, 2002". India’s Literacy Panorama. educationforallinindia.com. Archived from the original on 2010-03-29. Retrieved 2010-08-17.

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శరవస్తి&oldid=2955284" నుండి వెలికితీశారు