శరీరశాస్త్రం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Lua error in మాడ్యూల్:Category_handler at line 246: Module:Category handler/data returned boolean, table expected. ప్రాణుల శరీరాల పనితీరును వివరించే శాస్త్రాన్ని శరీరశాస్త్రం అంటారు. ఇది జీవశాస్త్రంలో ఉపవర్గం. శరీరశాస్త్రంలో ప్రాణులు, వాటి వ్యవస్థలు, అవయవాలు, ప్రాణులలోని కణాలు, రసాయన లేదా భౌతిక పనితీరును నిర్వహించే జీవసూక్ష్మ కణసముదాయాల పనితీరును నిర్ధారించేందుకు శాస్త్రీయ ప్రక్రియలను అవలంబిస్తారు. శరీరశాస్త్రా న్ని ఆంగ్లంలో ఫిజియాలజి అంటారు. ఈ పదం గ్రీకు నుంచి వచ్చింది φύσιςLua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected., ఫిజిస్ అంటే "స్వభావం, పుట్టుక"; ఇక -λογίαLua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected., -లోజియా అంటే "అధ్యయనం". ప్రాణుల శరీరాలు పనిచేసే తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే శరీరశాస్త్రం.

చరిత్ర[మార్చు]

శరీరశాస్త్రం 420 B.C. నాటిది. అంటే, వైద్యశాస్త్ర పితామహునిగా కీర్తిపొందిన హిప్పోక్రటిస్,[1] కాలం నుంచీ ఉన్న శాస్త్రం ఇది. అరిస్టాటిల్ కీలక భావన మరియు శరీరనిర్మాణం - పనితీరుల మధ్య సంబంధానికి గల ప్రాధాన్యతను తెలియజేసేలా ఆయన సాగించిన అధ్యయన ప్రక్రియలు పురాతన గ్రీస్‌లో శరీరశాస్త్రానికి నాంది పలుకగా, క్లాడియస్ గాలెనస్ ( 126-199 A.D.), ఈయన్నే గాలెన్ అని కూడా అంటారు. శరీరధర్మాలను కనుగొనేందుకు ఈయనే మొదటగా ప్రయోగాలు చేశారు. ప్రయోగాత్మక శరీరధర్మశాస్త్రానికి గాలెన్ ఆద్యుడు.[2] భారతీయ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన శుశ్రుతసంహిత మరియు చరకసంహిత లు కూడా మానవ శరీరనిర్మాణం, శరీరశాస్త్రాలను వివరంగా వర్ణించాయి. ఆండ్రియాస్ వెసాలియస్ మరియు విలియం హార్వే[3]లు ఇందులోకి అడుగుపెట్టిన తర్వాత ప్రపంచ వైద్యరంగం గాలెన్ ప్రతిపాదించిన గాల్వనిజం నుంచి మరలింది.

మధ్యయుగాల్లో ప్రాచీన గ్రీక్, హైందవ వైద్య సాంప్రదాయాలను ముస్లిం వైద్యులు మరింత అభివృద్ధి చేశారు. ముఖ్యంగా శరీరశాస్త్రంలో ఆవిసెన్నా (980-1037), ప్రవేశపెట్టిన ప్రాయోగీకరణ మరియు పరిమాణ నిర్ణయం లాంటి ప్రక్రియలు కేనన్ ఆఫ్ మెడిసిన్ సిద్ధాంతంగా రూపుదిద్దుకున్నాయి. పలు ప్రాచీన శరీరధర్మ సిద్ధాంతాలను ఇబ్న్ అల్-నఫిస్ (1213–1288) తోసిపుచ్చాడు. గుండె యొక్క నిర్మాణం, గుండెకు రక్తం సరఫరా అయ్యే పద్ధతి, ఊపిరితిత్తుల నిర్మాణం మరియు ఊపిరితిత్తులకు రక్తం సరఫరా అయ్యే పద్ధతుల గురించి మొట్టమొదటిసారి సక్రమంగా వర్ణించిన వైద్యుడు ఈయనే. అందుకే ఈయన్ని రక్తప్రసరణ - శరీరశాస్త్ర[4] పితామహునిగా అభివర్ణిస్తారు. ఊపిరితిత్తులు మరియు రక్తంలో వాయుపూరణానికి సంబంధించిన రసాయనిక చర్యల సంబంధాన్ని, నాడీస్పందన,[5] ప్రక్రియ మరియు సూక్ష్మ కేశనాళికల ద్వారా రక్త ప్రసరణ[6]కు సంబంధించిన ప్రాథమిక భావనను కూడా మొట్టమొదటగా వర్ణించింది ఈయనే.

మధ్యయుగాల అనంతర కాలంలో చోటుచేసుకున్న పారిశ్రామిక విప్లవంతో పశ్చిమ దేశాలలో శరీరశాస్త్రం గురించి మరిన్ని పరిశోధనలు జరిగాయి. దాంతో శరీరనిర్మాణం, శరీరశాస్త్రంపై ఆధునిక అధ్యయనం వేగవంతమైంది. ఆండ్రియాస్ వెసాలియస్ మానవ శరీరనిర్మాణం పై ప్రభావవంతమైన గ్రంథం డి హ్యూమాని కార్పోరిస్ ఫాబ్రికా [7] రచన చేశాడు. వెసాలియస్‌ను ఆధునిక మానవ శరీరనిర్మాణశాస్త్ర మూలపురుషునిగా చెప్పుకుంటారు.[8] శరీరనిర్మాణ శాస్త్రవేత్త విలియం హార్వే 17వ శతాబ్దం[9]లోనే రక్తప్రసరణ ప్రక్రియను కనిపెట్టాడు. శరీరం పనితీరును తెలుసుకునేందుకు జాగ్రత్తగా ప్రయోగాలు చేయటం, నిశిత పరిశీలనలను ప్రయోజనాత్మకంగా మేళవించి సమర్థవంతంగా రక్తప్రసరణ ప్రక్రియను ప్రదర్శనాపూర్వకంగా నిరూపించాడు. ఇది ప్రయోగాత్మక శరీరధర్మశాస్త్రం అభివృద్ధికి మూలం. హెర్మన్ బోయర్ హావేను కొన్నిసార్లు శరీరశాస్త్ర పితామహునిగా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఆయన లైడెన్ నగరంలో ఈ శాస్త్రంపై అద్భుతంగా బోధించాడు. అంతేగాక పాఠ్య పుస్తకం ఇన్‌స్టిట్యూషనిస్ మెడికా (1708)Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.[ఆధారం కోరబడింది]ను రచించాడు.

18వ శతాబ్దంలో ఫ్రెంచ్ వైద్యుడు, శరీరధర్మ శాస్త్రవేత్తLua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.[ఆధారం కోరబడింది] అయిన పియరీ కబనిస్ ద్వారా ఈ రంగంలో ముఖ్యమైన కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి.

ఇక 19వ శతాబ్దంలో శరీరధర్మశాస్త్ర విజ్ఞానం శీఘ్రగతిన అభివృద్ధి చెందింది. మరీ ముఖ్యంగామూస:Peacock-inline 1838లో మత్తయ్యాస్ షిల్డెన్ మరియు థియొడార్ ష్వాన్ ప్రతిపాదించిన కణ సిద్ధాంతం ప్రాణుల శరీరాలు అతి చిన్న కణాలతో నిర్మితమవుతాయని ఆ సిద్ధాంత సారాంశం కాగా అది అప్పటికి విప్లవాత్మక సిద్ధాంతం. క్లాడ్ బెర్నార్డ్ (1813–1878) ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయగా వాటితో ఆయన సిద్ధాంతమైన మిలియు ఇంటీరియర్ (అంతర్గత వాతావరణం) వెలుగులోకి వచ్చింది. ఈ సిద్ధాంతంపై అమెరికా శరీరధర్మ శాస్త్రవేత్త వాల్టర్ కేనన్ (1871–1945)Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.[clarification needed] మరిన్ని పరిశోధనలు చేసి దీనిని "హోమియోస్టాసిస్"గా అభివృద్ధి చేశాడు.

20వ శతాబ్దంలో జీవశాస్త్రవేత్తలు కూడా మనుష్యేతర ప్రాణుల శరీర పనితీరుపై ఆసక్తి కనబరిచారు. దాంతో తులనాత్మక శరీరశాస్త్రం మరియు పర్యావరణ శరీరశాస్త్రం[10] క్రమేపీ అభివృద్ధి చెందాయి. నట్ స్కిమిట్-నీల్సెన్ మరియు జార్జ్ బార్తొలోమ్యు ఈ రంగంలో కృషి చేసినవారిలో ముఖ్యులు. అత్యంత సమీపకాలంలో, పరిమాణాత్మక శరీరశాస్త్రం అభివృద్ధి చెంది ఒక ప్రత్యేక ఉపశాస్త్రం[11]గా నిలిచింది.

విద్యాసంస్థలు[మార్చు]

విద్యార్థులు శరీరశాస్త్రాన్ని ప్రధాన అంశంగా అధ్యయనం చేసేందుకు చాలా విశ్వవిద్యాలయాలు అనుమతిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకుLua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.Lua error in మాడ్యూల్:Category_handler at line 255: Module:Category handler/data returned boolean, table expected.[ఆధారం కోరబడింది] సంబంధించి ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అంశంగా పరిగణిస్తున్నారు.

గౌరవాలు మరియు పురస్కారాలు[మార్చు]

శరీరశాస్త్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజి. ఈ పురస్కారాన్ని 1901 నుండి రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ ప్రదానం చేస్తుంది.

మూస:Nobel Medicine

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. శరీరశాస్త్రం - శరీరశాస్త్ర చరిత్ర, శరీరశాస్త్ర శాఖలు
 2. ఛాతీ సంబంధ శస్త్రచికిత్సాలయాలు: ఛాతీ నిర్మాణంపై చారిత్రక దృష్టికోణం, స్టాన్లీ సి. ఫెల్ మరియు ఎఫ్. గ్రిఫిత్ పియర్సన్
 3. గాలెన్
 4. ఛైర్మన్స్ రిఫ్లెక్షన్స్ (2004), "గల్ఫ్ అరబ్బులలో సంప్రదాయ వైద్యం, భాగం 2: బ్లడ్-లెట్టింగ్", హార్డ్ వ్యూస్ 5 (2), పుట. 74-85 [80].
 5. నహ్యాన్ ఎ. జి. ఫేన్సీ (2006), "పల్‌మనరి ట్రాన్సిట్ అండ్ బాడీలీ రెజరెక్షన్: ది ఇంటరాక్షన్ ఆఫ్ మెడిసిన్ , ఫిలాసఫీ అండ్ రెలిజియన్ ఇన్ ది వర్క్స్ ఆఫ్ ఇబ్న్ అల్-నఫిస్ (మరణం 1288)", పుట. 224-229, ఇలెక్ట్రానిక్ థీసిస్ అండ్ డిసర్‌టేషన్స్ , యూనివర్శిటీ ఆఫ్ నోట్రె డేమ్.[1]
 6. పాల్ ఘలియోన్‌గుయి, ఇబ్న్ అల్-నఫిస్, కైరో, 1966, పుట. 109-129, మరియు "ది వెస్ట్ డినైస్ ఇబ్న్ అల్-నఫిస్ కంట్రిబ్యూషన్ టు ది డిస్‌కవరి ఆఫ్ ది సర్క్యులేషన్" ఫర్ ది సింపోజియం ఆన్ ఇబ్న్ అల్-నఫిస్ , ఇస్లామ్ వైద్యంపై రెండవ అంతర్జాతీయ సదస్సు: ఇస్లామ్ వైద్య సంస్థ, కువైట్, 1982.
 7. వెసాలియస్ రచించిన 'డి హ్యూమాని కార్పోరిస్ ఫాబ్రికా వర్చువల్ కాపీ
 8. ఆండ్రియాస్ వెసాలియస్ (1514-1567)
 9. జిమెర్, కార్ల్. 2004. సోల్ మేడ్ ఫ్లెష్: ది డిస్కవరీ ఆఫ్ ది బ్రెయిన్ - అండ్ హౌ ఇట్ ఛేంజ్డ్ ది వరల్డ్. న్యూయార్క్: ఫ్రీ ప్రెస్.
 10. ఫెదెర్, ఎం. ఇ., ఎ. ఎఫ్. బెన్నెట్, డబ్ల్యు. డబ్ల్యు. బర్గ్‌రెన్, అండ్ ఆర్. బి. హుఎ, ఇడిఎస్. 1987. న్యూ డైరక్షన్స్ ఇన్ ఇకొలాజికల్ ఫిజియాలజి. కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, న్యూయార్క్.
 11. హెచ్‌టిటిపి://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బయాలజీ.యుసిఆర్.ఇడియు/పీపుల్/ఫ్యాకల్టీ/గార్లండ్/గార్ల్‌సిఎ94.పిడిఎఫ్‌గార్లండ్, టి., జూనియర్., అండ్ పి. ఎ. కార్టెర్. 1994. పరిణామాత్మక శరీరశాస్త్రం. శరీరశాస్త్ర వార్షిక సమీక్ష 56:579-621.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Wiktionarypar

మూస:Biology-footer