Jump to content

శర్వాణి పిళ్ళై

వికీపీడియా నుండి
శర్వాణి పిళ్ళై
శర్వాణి పిళ్ళై (2014)
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1998-ప్రస్తుతం

శర్వాణి పిళ్ళై, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. అవంతిక అనే మరాఠీ సీరియల్ లో, 1998లో వచ్చిన తూ తిథే మీ అనే సినిమాలో నటించి గుర్తింపు పొందింది.[1]

టెలివిజన్

[మార్చు]

శర్వాణి తొలిరోజుల్లో దామిని, అవంతిక, తుజా నీ మఝా ఘర్ శ్రీమంతచా, అంబట్ గౌడ్ వంటి టెలివిజన్ సీరియళ్ళలో నటించింది. హిందీ సిట్‌కామ్ అయిన దునియాలో కూడా పనిచేసింది. ప్రస్తుతం ముల్గి జాలి హో ప్రధాన పాత్రలో కనిపించింది.[2]

ప్రాంతీయ సినిమాలు

[మార్చు]

తూ తిథే మీ సినిమాలో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. "నిషాని దావా అంగ్తా" అనే మరాఠీ సినిమాలో కూడా పనిచేసింది.[3]

బాలీవుడ్

[మార్చు]

పరేష్ రావల్, అజయ్ దేవగన్ నటించిన అతిథి తుమ్ కబ్ జావోగే సినిమాలో కూడా శర్వాణి నటించింది.[4]

మరాఠీ నాటకం

[మార్చు]

మకడచ్యా హాతీ షాంపైన్, అలీబాబా అని చలిషితలే చోర్‌ అనే ఆమె మరాఠీ నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు
1998 తూ తిథే మీ సంజయ్ సుర్కర్
2008 జోగ్వా రాజీవ్ పాటిల్
2010 పంగిరా రాజీవ్ పాటిల్
2011 డియోల్ ఉమేష్ కులకర్ణి
2010 అతిథి తుమ్ కబ్ జావోగే (హిందీ చిత్రం) ధీర్
2018 అసేహి ఏకదా వ్హావే సుశ్రుత్ భగవత్

మూలాలు

[మార్చు]
  1. "Sharvani Pillai: I'm happy to play a strong character on screen - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-16.
  2. "orkut". orkut.com. Archived from the original on 19 September 2013. Retrieved 2022-06-16.
  3. "'A kiss and a tale' | m 4 MOVIE". mformovie.in. Archived from the original on 2014-02-01. Retrieved 2022-06-16.
  4. bgbnd (2006-10-20). "Friday Review Bangalore / Theatre : Seemingly farcical". The Hindu. Archived from the original on 4 February 2014. Retrieved 2022-06-16.

బయటి లింకులు

[మార్చు]