Jump to content

శశికాంత్ షిండే

వికీపీడియా నుండి
శశికాంత్ జయవంతరావ్ షిండే
శశికాంత్ షిండే


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 మే 14
గవర్నరు రమేష్ బైస్
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
జూన్ 2013 – సెప్టెంబర్ 2014
గవర్నరు *కె. శంకరనారాయణన్

పదవీ కాలం
1999 – 2009
ముందు సప్కల్ సదాశివ్ పాండురంగ్ (భౌ)
తరువాత నియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గం జాయోలి
పదవీ కాలం
2009 – 2019
ముందు షాలినీ పాటిల్
తరువాత మహేష్ షిండే
నియోజకవర్గం కోరేగావ్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-10-19) 1963 అక్టోబరు 19 (age 61)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
ఇతర రాజకీయ పార్టీలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వైశాలి షిండే
సంతానం *తేజష్ షిండే
  • సాహిల్ షిండే
నివాసం లాసుర్నే, కోరెగావ్, సతారా
వృత్తి రాజకీయ నాయకుడు

శశికాంత్ జయవంతరావు షిండే (జననం 19 అక్టోబర్ 1963) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

శశికాంత్ షిండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జాయోలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సప్కల్ సదాశివ్ పాండురంగ్‌పై 12,186 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సప్కల్ సదాశివ్ పాండురంగ్‌పై 43,539 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండుసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

శశికాంత్ షిండే 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి డా. షాలినితై వసంతరావు పాటిల్‌పై 31,753 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] జూన్ 2013 నుండి సెప్టెంబర్ 2014 వరకు జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి విజయరావు బాబూరావు కనసేపై 47,247 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7]

శశికాంత్ షిండే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి మహేష్ షిండే చేతిలో 6,232 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[8][9] ఆయన 2020లో మహారాష్ట్ర శాసనమండలికి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేల కోటా నుండి మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[10]

శశికాంత్ షిండే 2024 లోక్‌సభ ఎన్నికలలో సతారా లోక్‌సభ నియోజకవర్గం నుండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉదయన్‌రాజే భోసలే చేతిలో 32,771 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Koregaon Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  2. "Statistical Report on Generlal Election, 1999 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
  3. "Statistical Report on Generlal Election, 2004 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  7. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  8. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  9. "Sharad Pawar's Party Appoints Shashikant Shinde As Maharashtra Unit Vice President" (in ఇంగ్లీష్). NDTV. 15 November 2019. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  10. "Shashikant Shinde: Trade Union Leader To Retain Satara, NCP Bastion" (in ఇంగ్లీష్). TimelineDaily. 3 May 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.
  11. "Lok Sabha 2024 election results: Satara". Election Commission of India. 4 June 2024. Archived from the original on 18 January 2025. Retrieved 18 January 2025.